నడికూడ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నడికూడ మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం.ఇది జిల్లా ప్రధాన కార్యాలయం నుండి ఉత్తరం వైపు 27 కి.మీ. దూరంలో ఉంది. మండలం ప్రధాన కార్యాలయం నడికూడ.ఈ మండలం నడికూడ గ్రామం, ప్రస్తుత నడికూడ మండలంలోని 12 గ్రామాలు 2018 మే కు ముందు 2016 పునర్వ్యవస్థీకరణలో కొత్తగా ఏర్పడిన వరంగల్ గ్రామీణ జిల్లా, వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను పరిధిలోని పరకాల మండలంలో 9 గ్రామాలు, చివరి మూడు గ్రామాలు దామెర మండలంలో ఉండేవి.వరంగల్ పట్టణ జిల్లాను హన్మకొండ జిల్లాగా పేరును మార్చిన సమయంలో తిరిగి ఇది వరంగల్ గ్రామీణ జిల్లా నుండి హన్మకొండ జిల్లాలో, (పూర్వపు వరంగల్ పట్టణ జిల్లా) కొత్తగా ఏర్పడిన పరకాల రెవెన్యూ డివిజనులో భాగమైంది. [1] [2][3] ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]నడికూడ పిన్ కోడ్ 506391.

సమీప మండలాలు[మార్చు]

నడికూడ మండలానికి తూర్పు వైపు శాయంపేట మండలం, పడమర వైపు కమలాపూర్ మండలం, ఉత్తరం వైపు మొగుళ్లపల్లి మండలం, దక్షిణాన ఆత్మకూరు మండలం ఉన్నాయి.

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. నార్లాపూర్
 2. నడికూడ
 3. వరికోల్
 4. రాయపర్తి
 5. పులిగిళ్ల
 6. చర్లపల్లి
 7. ముస్త్యాల్‌పల్లి
 8. చౌటపర్తి
 9. ధర్మారం
 10. సర్వాపూర్
 11. కౌకొండ
 12. కంఠాత్మకూర్

గమనిక: పరకాల మండలం నుండి మొదటి 9, దామెర మండలం నుండి చివరి 3 గ్రామాలతో ఈ మండలం ఏర్పడింది.

మూలాలు[మార్చు]

 1. G.O.Ms.No. 74,  Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
 2. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
 3. "Hanamkonda, Warangal in Telangana to be new districts now- The New Indian Express". web.archive.org. 2021-10-03. Retrieved 2021-10-03.
 4. "తెలంగాణలో కొత్త రెవిన్యూ డివిజన్". Zee News Telugu. 2018-03-24. Retrieved 2022-01-22.

వెలుపలి లంకెలు[మార్చు]