మొగుళ్ళపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొగుళ్ళపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్ళపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్ళపల్లి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°19′47″N 79°36′57″E / 18.329759°N 79.615746°E / 18.329759; 79.615746
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జయశంకర్ భూపాలపల్లి
మండల కేంద్రం మొగుళ్ళపల్లి
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.87%
 - పురుషులు 62.69%
 - స్త్రీలు 36.74%
పిన్‌కోడ్ 506366

మొగుళ్ళపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం భూపాలపల్లి రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ములుగు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 39,387, పురుషులు 19,614, స్త్రీలు 19,773

వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు మార్పు[మార్చు]

లోగడ మొగుళ్లపల్లి మండలం వరంగల్ జిల్లా పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మొగుళ్లపల్లి  మండలాన్ని(1+16) పద్హేడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి)  జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. అకినేపల్లి
 2. పోతుగల్
 3. కుర్కిశాల
 4. పెద్దకోమటిపల్లి
 5. పార్లపల్లి
 6. మోట్లపల్లి
 7. మెట్‌పల్లి
 8. గుండ్లకర్తి
 9. వేములపల్లి
 10. గుడిపహాడ్
 11. పిడిసిల్ల
 12. ముల్కలపల్లి
 13. మొగుళ్ళపల్లి
 14. ఇస్సిపేట్
 15. అంకుశాపూర్
 16. మేదరమట్ల
 17. రంగాపురం

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

బయటి లింకులు[మార్చు]