పల్మెల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పల్మెల
—  మండలం  —
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, పల్మెల స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, పల్మెల స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, పల్మెల స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జయశంకర్ జిల్లా
మండల కేంద్రం పల్మెల
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 231 km² (89.2 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 7,775
 - పురుషులు 3,876
 - స్త్రీలు 3,899
పిన్‌కోడ్ 505504


పల్మెల మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం భూపాలపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మంథని డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 5 నిర్జన గ్రామాలు. మండల కేంద్రం పల్మెల

గణాంకాలు[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 231 చ.కి.మీ. కాగా, జనాభా 7,775. జనాభాలో పురుషులు 3,876 కాగా, స్త్రీల సంఖ్య 3,899. మండలంలో 1,985 గృహాలున్నాయి.[4]

2016 లో ఏర్పడిన మండలం[మార్చు]

లోగడ పలిమెల గ్రామం కరీంనగర్ జిల్లా, మంథని రెవెన్యూ డివిజను, మహాదేవపూర్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పలిమెల గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా, భూపాలపల్లి రెవెన్యూ డివిజను పరిధి క్రింద మహాదేవపూర్ మండలం నుండి పలిమెల గ్రామంతో కలుపుకొని (1+16) పద్హేడు గ్రామాలను విడగొట్టి, పలిమెల గ్రామాన్ని నూతన మండల ప్రధాన కేంధ్రంగా  ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. పల్మెల
  2. పంకెన
  3. లెంకలగడ్డ
  4. మోదేడ్
  5. కమాన్‌పల్లి
  6. సర్వాయిపేట
  7. దమ్మూర్
  8. బూరుగుగూడెం
  9. నీలంపల్లి
  10. వెంచేపల్లి
  11. ముక్నూర్
  12. తిమ్మాటిగూడెం

గమనిక:నిర్జన గ్రామాలు 5 పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు[మార్చు]