శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ (సుడా)
సంస్థ వివరాలు
స్థాపన మే 17, 2017
Preceding agency కరీంనగర్ నగరపాలక సంస్థ
అధికార పరిధి తెలంగాణ ప్రభుత్వం
ప్రధానకార్యాలయం కరీంనగర్
18°26′13″N 79°07′27″E / 18.436944°N 79.124167°E / 18.436944; 79.124167
సంబంధిత మంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, (ముఖ్యమంత్రి)
కల్వకుంట్ల తారక రామారావు, (పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి)
కార్యనిర్వాహకులు జి.వి. రామకృష్ణరావు[1], చైర్మన్

శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ (సుడా), తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణ అభివృద్ధి ప్రణాళిక సంస్థ. వారసత్వ నిర్మాణాలు, పట్టణం, దాని పరిధి ప్రాంతంలో నిర్ధిష్టమైన అభివృద్ధికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుంది.

చరిత్ర[మార్చు]

2017, మే 17న తెలంగాణ ప్రభుత్వంచే శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ ఏర్పాటుచేయబడింది. దీని ప్రధాన కార్యాలయం కరీంనగర్ పట్టణంలో ఉంది.[2][3][4]

విధులు - బాధ్యతలు[మార్చు]

రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లోని మౌలిక సదుపాయాల ప్రణాళికను, అభివృద్ధిని వివరించడానికి ఆయా అభివృద్ధి పనులకోసం పట్టణ అభివృద్ధి సంస్థలకు అధికారాలు ఇవ్వబడ్డాయి.[5]

అధికార పరిధి[మార్చు]

కరీంనగర్, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం[6] పరిధిలోవున్న 4,89,985 నివాసితుల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికను ఈ సంస్థ నిర్వహిస్తుంది.[7] కరీంనగర్ పట్టణంతోపాటు 71 గ్రామాలను కలిపి ఈ సంస్థను ఏర్పాటుచేశారు.[8]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రభూమి, తెలంగాణ (8 November 2019). "భావి అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్లు". www.andhrabhoomi.net. Archived from the original on 8 నవంబరు 2019. Retrieved 17 January 2020.
  2. The Hindu, Telangana (18 May 2017). "KCR announces Satavahana UDA for Karimnagar". Archived from the original on 20 జనవరి 2018. Retrieved 17 January 2020.
  3. The Hans India, Telangana (18 May 2017). "Telangana to set up urban development authority for Karimnagar". Retrieved 17 January 2020.
  4. India Today, Telangana (5 July 2017). "Karimnagar, Nizamabad, Khammam to get urban devp authorities". Archived from the original on 15 జనవరి 2020. Retrieved 17 January 2020.
  5. ఈనాడు, ప్రధానాంశాలు. "సుడా.. ప్రగతి జాడ". www.eenadu.net. Archived from the original on 17 జనవరి 2020. Retrieved 17 January 2020.
  6. Census 2011, Karimnagar. "Karimnagar District Population Census 2011-2020, Andhra Pradesh literacy sex ratio and density". www.census2011.co.in. Retrieved 17 January 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  7. The Hans India, Telangana (26 June 2017). "Satavahana Urban Development Authority just a pen stroke away" (in ఇంగ్లీష్). Archived from the original on 7 ఏప్రిల్ 2019. Retrieved 17 January 2020.
  8. నమస్తే తెలంగాణ, వార్తలు (25 October 2017). "పట్టణ శివార్ల కు పండుగ". www.ntnews.com. Archived from the original on 17 జనవరి 2020. Retrieved 17 January 2020.

వెలుపలి లంకెలు[మార్చు]