Jump to content

మహబూబ్‌నగర్ నగరాభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
(మహబూబ్‌నగర్‌ నగరాభివృద్ధి సంస్థ నుండి దారిమార్పు చెందింది)

మహబూబ్‌నగర్‌ నగరాభివృద్ధి సంస్థ (ముడా) తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ పట్టణ అభివృద్ధి ప్రణాళిక సంస్థ. వారసత్వ నిర్మాణాలు, పట్టణం, దాని పరిధి ప్రాంతంలో నిర్ధిష్టమైన అభివృద్ధికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుంది.[1][2]

అధికార పరిధి

[మార్చు]

మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూరు మున్సిపాలిటీలు సహా 12 మండలాల్లోని 142 గ్రామాలతో మహబూబ్‌నగర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేస్తూ 2022 ఫిబ్రవరి 14న ప్రభుత్వం జీవో నెంబర్‌ 26 జారీ చేసింది.[3][4]

మహబూబ్‌నగర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిటీ సభ్యులు

[మార్చు]

రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ముడా కమిటీకి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఛైర్మన్‌గా, మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌ కుమార్‌ వైస్‌ఛైర్మన్‌గా ఉంటారు. జడ్చర్ల శాసనసభ్యుడు సి.లక్ష్మారెడ్డి, దేవరకద్ర శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ సహా ఆర్థికశాఖ నుంచి ప్రత్యేక ముఖ్యకార్యదర్శి లేదా అదే శాఖ నుంచి నామినేట్‌ అయిన వ్యక్తి, పట్టణ ప్రణాళికశాఖ డైరక్టర్‌గా \ సభ్యులుగా ఉంటారు.[5][6] మహబూబ్‌నగర్‌ నగరాభివృద్ధి సంస్థ తొలి ఛైర్మన్‌గా గంజి వెంకన్న ముదిరాజ్‌ ఏప్రిల్ 2న నియమితుడయ్యాడు.[7][8]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (14 February 2022). "Govt. notifies two new urban development authorities — Mahabubnagar and Neelagiri" (in Indian English). the original నుండి 16 February 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 February 2022.
  2. Namasthe Telangana (14 February 2022). "మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఉడా ఏర్పాటు.. సీఎం కేసీఆర్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృత‌జ్ఞ‌త‌లు". the original నుండి 16 February 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 February 2022.
  3. Nava Telangana (15 February 2022). "మహబూబ్‌నగర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు". the original నుండి 16 February 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 February 2022.
  4. Eenadu (15 February 2022). "ముడా కల సాకారం". the original నుండి 16 February 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 February 2022.
  5. ETV Bharat News (15 February 2022). "కొత్తగా రెండు నగరాభివృద్ధి సంస్థలు". the original నుండి 16 February 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 February 2022.
  6. Andhra Jyothy (16 February 2022). "నెరవేరిన కల". the original నుండి 16 February 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 February 2022.
  7. Disha (2 April 2022). "ముడా చైర్మన్‌గా గంజి వెంకన్న ముదిరాజ్." the original నుండి 20 April 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 April 2022.
  8. Disha (19 April 2022). "'అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ' ఆ జిల్లాకు మణిహారం: మంత్రి శ్రీనివాస్ గౌడ్". the original నుండి 20 April 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 April 2022.