ఆల వెంకటేశ్వర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలె వెంకటేశ్వర్‌ రెడ్డి
ఆల వెంకటేశ్వర్ రెడ్డి


పదవీ కాలం
 2014 - 2018, 2018 - 2023 డిసెంబర్ 03
తరువాత గవినోళ్ల మధుసూదన్ రెడ్డి
నియోజకవర్గం దేవరకద్ర

వ్యక్తిగత వివరాలు

జననం 30 సెప్టెంబర్ 1968
అన్నాసాగర్, భూత్పూర్‌ మండలం, మహబూబ్​నగర్​ జిల్లా
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు రఘుపతి రెడ్డి, వరలక్ష్మి
జీవిత భాగస్వామి మంజుల
సంతానం ఇద్దరు కుమార్తెలు (ప్రీతి)[1]
మతం హిందూ

ఆల వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[3][4]

జననం, విద్య[మార్చు]

వెంకటేశ్వర్ రెడ్డి 1968, సెప్టెంబరు 30న రఘుపతి రెడ్డి, వరలక్ష్మి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, భూత్‌పూర్‌ మండలంలోని అన్నసాగర్ గ్రామంలో జన్మించాడు. బిఈ సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.[5] తండ్రి రఘుపతి గ్రామ సర్పంచ్ గా, సమితి అధ్యక్షుడిగా, జెడ్పీటిసిగా పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

వెంకటేశ్వర్ రెడ్డికి మంజులతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ విశేషాలు[మార్చు]

కొంతకాలం కాంట్రాక్టర్ గా పనిచేసిన వెంకటేశ్వర్ రెడ్డి తన తండ్రి వారసత్వంతో 2002లో తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2006లో జెడ్పీటిసిగా ఎన్నికయ్యాడు.[6] 2011-2013 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పవన్ కుమార్ పై 16,922 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[7][8] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. పవన్ కుమార్ పై 34,748 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[9][10] ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో దేవరకద్ర నుండి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.[11][12]

ఇతర వివరాలు[మార్చు]

చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (20 June 2021). "భూత్పూర్‌ను అభివృద్ధి చేస్తాం". Archived from the original on 5 జూలై 2021. Retrieved 5 July 2021.
  2. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-08-29.
  3. "Alla Venkateshwar Reddy MLA of DEVARKADRA Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-23. Retrieved 2021-08-29.
  4. Namasthe Telangana (1 June 2021). "ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేసిన ఎమ్మెల్యే ఆల". Namasthe Telangana. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
  5. admin (2019-01-08). "Devarakadra MLA Alla Venkateshwar Reddy". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-29.
  6. Eenadu (26 October 2023). "అంచెలంచెలుగా ఎదిగి అసెంబ్లీకి". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  7. Eenadu (13 November 2023). "తొలి ప్రయత్నం.. వరించిన విజయం". EENADU. Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  8. "Alla Venkateshwar Reddy(TRS):Constituency- DEVARKADRA(MAHBUBNAGAR) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-08-29.
  9. "Alla Venkateswar Reddy(TRS):Constituency- DEVARKADRA(MAHBUBNAGAR) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-08-29.
  10. "Devarkadra Assembly Election: TRS' Alla Venkateshwar Reddy up against Congress' Pavan Kumar". www.timesnownews.com. Retrieved 2021-08-29.
  11. Namasthe Telangana (22 August 2023). "సమరానికి సై". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  12. Eenadu (14 November 2023). "ఎన్నికల బరిలో కోటీశ్వరులు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.