సి. లక్ష్మా రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి. లక్ష్మా రెడ్డి
155A9996.jpg
వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ ప్రభుత్వం
Preceded byటి. రాజయ్య
Constituencyజడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం
ఎమ్మెల్యే
Assumed office
డిసెంబర్ 17, 2014
Personal details
Born (1962-02-03) 1962 ఫిభ్రవరి 3 (వయస్సు: 58  సంవత్సరాలు)
Political partyతెలంగాణ రాష్ట్ర సమితి
Spouse(s)శ్వేత
Childrenస్వరణ్, స్ఫూర్తి
Residenceహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
Educationబి.హెచ్.ఎం.ఎస్. (హోమియోపతి)

సి. లక్ష్మా రెడ్డి ప్రముఖ వైద్యులు, రాజకీయ నాయకులు, తెలంగాణ ప్రభుత్వ కేబినేట్ మంత్రి. జడ్చర్ల ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు.[1]

జననం[మార్చు]

లక్ష్మా రెడ్డి 1962, ఫిబ్రవరి 3న జడ్చర్లలో జన్మించారు. వీరి తండ్రి పేరు నారాయణ్ రెడ్డి. వీరి స్వగ్రామం తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామం.

విద్యాభ్యాసం[మార్చు]

హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషన్ సొసైటీ (గుల్బర్గా, కర్ణాటక) నుండి హోమియోపతిక్ మెడికల్ సైన్సెస్ లో బ్యాచులర్ డిగ్రీ పట్టా పొందారు. ఆ సమయంలో విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించేముందు జడ్చర్లలో ఒక హోమియోపతిక్ డాక్టర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు.[2]

వివాహం - పిల్లలు[మార్చు]

లక్ష్మా రెడ్డి వివాహం డాక్టర్ శ్వేతలో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.

రాజకీయ జీవితం[మార్చు]

లక్ష్మా రెడ్డి రాజకీయాల్లో చాలా చురుకుగా పాల్గొనేవారు. చిన్నవయసు నుండి అనేక పదవులను చేపట్టారు. తన స్వగ్రామైన తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తిమ్మాజిపేట మండల స్థాయిలో సింగిల్ విండో విధానాన్ని, గ్రంథాలయం సంఘాన్ని ఏర్పాటుచేశారు.

2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

2004 అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కానీ ప్రత్యేక రాష్ట్ర సాధనలె కేసీఆర్ యొక్క పిలుపుతో 2008 ఏప్రిల్ లో తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయారు.[3]

2014 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అరోగ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న టి.రాజయ్య తొలగింపు తర్వాత, అతని స్థానంలో లక్ష్మా రెడ్డిని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు మార్చారు.[4]

మూలాలు[మార్చు]

  1. నవతెలంగాణ, రాష్ట్రీయం. "వైద్యసేవల సంస్థకు స్కాచ్‌ అవార్డు". Retrieved 17 January 2017.
  2. Profile of Minister
  3. Jadcherla MLAs
  4. Rajaih gets marching orders