మల్లు రవి
మల్లు రవి తెలంగాణ రాష్ట్రానకి చెందిన రాజకీయ నాయకుడు. 13 వ,18 వ లోక్ సభలో నాగర్ కర్నూల్ (ఎస్సీ) నియోజక వర్గం నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు.[1] ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ కన్వీనర్‌గా కాంగ్రెస్ పార్టీ నియమించింది.[2] ఆయనను 2024 జనవరి 20న తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది.[3]
మల్లు రవి | |||
| |||
నియోజకవర్గం | నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం (ఎస్సీ) | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | లక్ష్మీపురం గ్రామం,మండలం, ఖమ్మం : జిల్లా. తెలంగాణ . | 1950 జూలై 5||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
బంధువులు | మల్లు అనంత రాములు, మల్లు భట్టివిక్రమార్క (సోదరులు)[4] | ||
సంతానం |
| ||
నివాసం | 401, తేజీస్విని అపార్టుమెంటు, ద్వారకాపురి కాలనీ, పంజాగుట్ట, హైదరాబాద్. 9490794250 |
బాల్యం, విద్యాభ్యాసం,కుటుంబం
[మార్చు]డాక్టర్ మల్లు రవి పుట్టిన తేదీ 1950 జూలై 14 లక్ష్మీపురం గ్రామం, మండలం, ఖమ్మం : జిల్లా. తెలంగాణ .లో జన్మించారు.తండ్రి పేరు శ్రీ అఖిల్లాండ, సోదరుడు, కీ.శే. మల్లు అనంత రాములు నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి మాజీ పార్లమెంటు సభ్యుడు.[5]
వివాహం,పిల్లలు
[మార్చు]మల్లు రవి మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు కుమార్తెని 1982 జూన్ 5 న డాక్టర్ రాజపన్సి దేవిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు మల్లు సిద్ధార్ధ, ఒక కుమార్తె ఉన్నారు.
విద్యార్హతలు
[మార్చు]ఎం.బి.బి.ఎస్. డి.ఎల్.ఓ. హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలలో విద్యను అభ్యసించారు.
రాజకీయ జీవితం
[మార్చు]మల్లు రవి కాంగ్రెస్ పార్టీతో ఒక విద్యార్థి నాయకుడిగా తన వృత్తిని ప్రారంభించారు. అతను 1991-96, 10 వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.1998 12 వ లోక్‌సభకు నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ఎన్నికయ్యారు, అయితే 1999 లో తన సీటును కోల్పోయాడు, కాని తెలంగాణా అంశంపై తెరాస శాసనసభ్యులు మూకుమ్మడి రాజీనామాల ఫలితంగా 2008లో మళ్ళీ ఇక్కడ ఉపఎన్నిక జరిగింది. 2008 ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎం.చంద్రశేఖర్ పై 2,106 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. రాజీనామా చేసి పోటీకి నిలబడ్డ తెరాస అభ్యర్థి లక్ష్మారెడ్డి మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2009 శాసనసభ ఎన్నికలలో మహాకూ టమి తరఫున పోటీలోకి దిగిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎర్ర చంద్రశేఖర్ విజయం సాధించాడు 6890 ఓట్ల తేడాతో సిటింగ్ ఎమ్మేల్యే మల్లు రవి ఓడిపోయారు. జడ్చర్ల నియోజకవర్గం శాసనసభ 2014 ఎన్నికల్లో జడ్చర్ల కోసం ఆయన పోటీ చేశారు చర్లకోల లక్ష్మణరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి విజయం సాధించాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి మళ్ళీ ఓడిపోయారు.
మెడికల్ ప్రాక్టీషనర్, పొలిటికల్ అండ్ సోషల్ వర్కర్.
1980-82 కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్, వైద్యులు'వింగ్
1991 లో 10 వ లోక్‌సభకు ఎన్నికయ్యారు సభ్యుడు, కమిటీ ఆన్ పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్
సభ్యుడు, కమిటీ ఆన్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్
సభ్యుడు, సంప్రదింపుల కమిటీ, మంత్రిత్వ శాఖ సంక్షేమ
సభ్యుడు, సంప్రదింపుల కమిటీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ
సభ్యుడు, సంప్రదింపుల కమిటీ, వాణిజ్య మంత్రిత్వ శాఖ
1998 లో 12 వ లోక్సభకు తిరిగి ఎన్నికయ్యారు (రెండవసారీ)
సభ్యుడు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ [6]
1998-99 సభ్యుడు, కమిటీ ఆన్ పెట్రోలియం అండ్ కెమికల్స్
సభ్యుడు, సంప్రదింపుల కమిటీ, మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్
స్పెషల్ ఇన్విటే, కన్సల్టేటివ్ కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
సామాజిక సంక్షేమం హాస్టల్ బోర్డర్స్ కోసం చిన్న హ్యాండ్బుక్
ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. [1]
2024లో 18వ లోక్ సభ నాగర్ కర్నూల్
లోక్ సభ నియోజక వర్గం నుండికాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి,భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన పి.భరత్ పై 94,వేల 361 మెజారిటీ ఓట్ల తో గెలుపొందాడు. [7]
చిరునామా
[మార్చు]401, తేజీస్విని అపార్టుమెంటు, ద్వారకా పురి కాలనీ, పంజాగుట్ట, హైదరాబాద్.
ప్రత్యేక ఆసక్తులు
[మార్చు]భారతదేశంలో సామాజిక-ఆర్థిక సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది, ఇష్టమైన కాలక్షేపం, వినోదం, గ్రామీణ పేదల పెంపు
క్రీడలు, క్లబ్లు, కబడ్డీ, ఫుట్బాల్, టెన్నిస్.అతను తన సొంత ఓటర్లతో ఎల్లప్పుడూ ప్రేమతో ఉంటాడు.
దేశాలు సందర్శించారు
[మార్చు]నేపాల్, దక్షిణ ఆఫ్రికా, విండ్హాక్ నమీబియా, 1998 [8].
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-01-03. Retrieved 2017-06-16.
- ↑ HMTV (18 November 2023). "కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి కీలక పదవి..!". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
- ↑ Sakshi (21 January 2024). "ప్రభుత్వ సలహాదారుల నియామకం". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
- ↑ V6 Velugu (8 December 2023). "తెలంగాణ మంత్రుల ప్రొఫైల్స్". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Lokasabha, 9th Lok Sabha. "Members Bioprofile". www.loksabhaph.nic.in. Retrieved 28 June 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link] - ↑ http://www.thehansindia.com/posts/index/Khammam-Tab/2017-01-03/Demonetisation-a-scam-Mallu-ravi/271688
- ↑ Velugu, V6 (2024-06-05). "నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ దే .. మూడోసారి ఎంపీగా గెలిచిన మల్లు రవి". V6 Velugu. Retrieved 2024-06-05.
{{cite web}}
: zero width space character in|title=
at position 6 (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ https://duckduckgo.com/Mallu_Ravi?ia=web[permanent dead link]