Jump to content

కోనేరు రంగారావు

వికీపీడియా నుండి
కోనేరు రంగారావు
కోనేరు రంగారావు

కోనేరు రంగారావు


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి.

వ్యక్తిగత వివరాలు

జననం 1935,జూలై 26
కృష్ణాజిల్లా గూడవల్లి
మరణం మార్చి 15, 2010
రాజకీయ పార్టీ కాంగ్రేసు పార్టీ
జీవిత భాగస్వామి కోనేరు అలీసమ్మ.
సంతానం ఇద్దరు కుమారులు , ఇద్దరు కుమార్తెలు.
మతం హిందూమతము
మార్చి 30, 2009నాటికి

కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీ మంత్రి.

కోనేరు రంగారావు, 1935, జూలై 26న కృష్ణాజిల్లా గూడవల్లి గ్రామములో జన్మించాడు.[1] ఈయన తండ్రి తాతయ్య. గూడవల్లి గ్రామానికి పంచాయితీ సర్పంచిగా రాజకీయ జీవితము ప్రారంభించిన రంగారావు సర్పంచిగా 10 సంవత్సరాలు పనిచేశాడు. ఆ తరువాత కంకిపాడు నియోజకవర్గము నుండి శాసనసభకు ఎన్నికై, సామాజికాభివృద్ధి శాఖా మంత్రి అయ్యాడు. ఈయన పురపాలక శాఖ, దేవాదాయ శాఖ, సామాజికాభివృద్ధి శాఖలలో మంత్రిగా పనిచేశాడు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయాములో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు.[2] రంగారావు తిరువూరు నియోజకవర్గము నుండి కూడా శాసనసభకు రెండు పర్యాయములు ఎన్నికైనాడు.

రంగారావు 2010 మార్చి 15 న మరణించాడు. ఆయన సతీమణి కోనేరు అలీసమ్మ. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.[3]

కోనేరు రంగారావు కమిటీ

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూపంపిణీ కార్యక్రమాల అమలును పరిశీలించి, ఈ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీయే కోనేరు రంగారావు కమిటీ. ఈ కమిటీని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2004 డిసెంబర్ 1 నాటి జీవో Ms.No.977, 2004 డిసెంబర్ 23 నాటి జీవో Ms.No.1091 ల ద్వారా ఏర్పరచింది.

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సైటులో కోనేరు రంగయ్య ప్రొఫైలు[permanent dead link]
  2. "Koneru Ranga Rao, a Dalit, appointed as deputy chief minister of Andhra Pradesh" (in ఇంగ్లీష్). India Today. 15 July 1994. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
  3. "Koneru passes away" (in Indian English). The Hindu. 15 March 2010. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.