కంకిపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంకిపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కంకిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి తత్తరమూడి వజ్రకుమారి
జనాభా (2001)
 - మొత్తం 14,616
 - పురుషుల సంఖ్య 6,565
 - స్త్రీల సంఖ్య 6,461
 - గృహాల సంఖ్య 3,210
పిన్ కోడ్ 521151
ఎస్.టి.డి కోడ్ 08676

కంకిపాడు (ఆంగ్లం: Kankipadu), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం. పిన్. కోడ్ నం. 521 151., ఎస్టీడీ కోడ్ = 08676.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 24 మీ. ఎత్తు.[1]

సమీప గ్రామాలు[మార్చు]

గొడవర్రు 1 కి.మీ, ప్రొద్దుటూరు 1 కి.మీ, కోలవెన్ను 2 కి.మీ, దావులూరు 3 కి.మీ, చినపులిపాక 3 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

పెనమలూరు, తోట్లవల్లూరు, వుయ్యూరు, గన్నవరం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కంకిపాడు, మానికొండ, పెనమలూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ

ప్రధాన గ్రామీణ రహదారులు[మార్చు]

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

 • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
 • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల లాకుగూడెం.
 • సెయింట్ మేరీస్ పాఠశాల.
 • కృషి ప్రాథమికోన్నత పాఠశాల.
 • ఎస్.ఎస్. ప్రగ్న్య జూనియర్ పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

మీ-సేవ కేంద్రం[మార్చు]

స్థానిక కన్యకా పరమేశ్వరీ సత్రం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని, 2015, సెప్టెంబరు-28వ తేదీనాడు ప్రారంభించారు. [7]

బ్యాంకులు[మార్చు]

 1. ది కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్. ఫోన్ నం.
 2. ది కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్., కంకిపాడు-
 3. సప్తగిరి గ్రామీణ బ్యాంక్.
 4. ది కంకిపాడు మండల కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్. ఫోన్ నం. 8019958203

రైతు బజార్[మార్చు]

స్థానిక రహదారి బంగళా ఆవరణలో, 2013, మార్చి‌లో 20 రైతు దుకాణాలు, నాలుగు డ్వాక్రా దుకాణాలతో ప్రారంభమైన ఈ రైతుబజార్, ప్రస్తుతం 37 దుకాణాలకు చేరింది. మొదటి సంవత్సరం రోజుకు సగటున ఒక లక్ష రూపాయల కొనుగోళ్ళు జరుగగా, ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలకు పెరిగింది. ఈ రైతుబజారులో దుకాణాన్ని కేటాయించడానికి, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు జియో ట్యాగింగ్ విధానాన్ని అనుసరించుచున్నారు. దీనితో వాస్తవంగా కూరగాయలు సాగుచేయుచున్నవారికే ఇక్కడ దుకాణం లభించుచున్నది. అందువలననూ, ప్రభుత్వం జరీ చేసిన మార్గదర్శకాలు కఠినంగా ఉండటంతో, దళారుల బెడద చాలా తగ్గిపోయింది. 50 గ్రామాలకు ప్రధాన కూడలి అయిన ఈ రైతు బజార్ లో, విజయవాడ రైతుబజారులోని ధరలనే అమలుచేస్తున్నారు. [1]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

పెద్ద చెరువు:- చాలా సంవత్సరాల తరువాత, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువు ప్రక్షాళన పనులను, 2016, మే-10న ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తత్తరమూడి వజ్రకుమారి సర్పంచిగా గెలుపొందారు. ఉపసర్పంచిగా శ్రీ పులి కామేశ్వరరావు ఎన్నికైనారు.

గ్రామంలోని దర్శనీయప్రదేశమలు/దేవాలయాలు[మార్చు]

 1. శ్రీ గంగాపార్వతీ సమేత రామలింగేశ్వరాలయం.
 2. శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం (విష్ణాలయం).
 3. శ్రీ గొంతేనమ్మ అమ్మవారి ఆలయం.
 4. శ్రీ కోదండ రామాలయం (పాత పెట్రోలు బానికి ఎదుట ఉంది)
 5. స్థానిక గన్నవరం రహదారి విస్తరణలో భాగంగా తొలగించిన పోతురాజు విగ్రహాన్ని, 2016, జనవరి-27 బుధవారంనాడు, గంగానమ్మ ఆలయంలో శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠించారు.
 6. శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణస్వామివారి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

 • కె.ఎల్.రావు
 • ఇదే వూరిలో నటుడు కోట శ్రీనివాసరావు జన్మించడం విశేషం. కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో పేరొందిన వైద్యుడు. కోట 1945, జూలై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.
 • కోట శంకరరావు, సినీ/రంగస్థల/టి.వి. నటుడు.

గ్రామ విశేషాలు[మార్చు]

చెత్త నుండి సంపద ఉత్పత్తి కేంద్రం

వనరులు[మార్చు]

 1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kankipadu/Kankipadu". Retrieved 18 June 2016. External link in |title= (help)

బయటి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017, మార్చి-27; 1వపేజీ. [2] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017, జూన్-7; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=కంకిపాడు&oldid=3035193" నుండి వెలికితీశారు