దొమ్మరనంద్యాల
దొమ్మరనంద్యాల వైఎస్‌ఆర్ జిల్లా, మైలవరం మండలానికి చెందిన గ్రామం. [1] పిన్ కోడ్ నం. 516 431.
దొమ్మర నంద్యాల | |
---|---|
జనాభా గణన పట్టణం | |
నిర్దేశాంకాలు: 14°51′52″N 78°21′57″E / 14.86444°N 78.36583°ECoordinates: 14°51′52″N 78°21′57″E / 14.86444°N 78.36583°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కడప |
జనాభా వివరాలు (2001) | |
• మొత్తం | 7,678 |
భాషలు | |
• అధికార | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 516431 |
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
జమ్మలమడుగు పట్టణానికి వాయవ్య దిశగా 4 కి.మీ. దూరంలో ఉంది. తూర్పున మోరగుడి గ్రామం, పశ్చిమాన వేపరాల గ్రామం, దక్షిణాన పెన్నా నది, ఉత్తరాన కర్మలవారి పల్లె గ్రామం, దొమ్మర నంద్యాలకు సరిహద్దులుగా ఉన్నాయి.
సమీప గ్రామాలు[మార్చు]
సమీప మండలాలు[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
- జమ్మలమడుగు నుండి బస్సు, ప్రైవేటు వాహనాలు రోడ్డు మార్గం ద్వారా వచ్చును. జమ్మలమడుగు నుండి మాత్రమే కాకుండా తాడిపత్రి రోడ్ నుండి కూడా గ్రామానికి ట్రంక్ రోడ్ వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ గ్రామానికి రెండు లైన్ల రోడ్ సదుపాయం ఉంది.
- జమ్మలమడుగు నుండి ఈ గ్రామం చేరడానికి ప్రస్తుతం మూడు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.
- జమ్మలమడుగు - తాడిపత్రి రహదారిలో మొరగుడి వద్ద నుండి ఈ గ్రామానికి చేరుకోవచ్చు.
- అలాగే మైలవరం బైపాస్ నుండి కుడా చేరుకోవచ్చు.
- జమ్మలమడుగు - వేపరాలకు పెన్నా నది మద్యలో నుండి వేసిన కొత్త రోడ్ ద్వారా కూడా దొమ్మర నంద్యాల చేరవచ్చు.
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో ప్రస్తుతం విద్యా సదుపాయాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. గ్రామంలో ఒక ఉన్నత పాఠశాల, నాలుగు ప్రాథమిక పాఠశాలలు, చిన్న పిల్లల కోసం నాలుగు అంగన్వాడి కేంద్రాలు, బాలురకు ప్రభుత్వ హాస్టల్ సదుపాయం కూడా ఉన్నాయి. ప్రస్తుతం హాస్టల్లో వంద మంది విద్యార్థులు దాక ఉన్నారు. దొమ్మర నంద్యాల లోని ఉన్నత పాఠశాల జిల్లాలోని కర్పోరాట్ పాఠశాలలకు దీటుగా ఉన్నత విద్యను బోధిస్తూ కడప జిల్లాలోనే ఉన్నతమైన పాఠశాలలలో ఒకటిగా నిలిచింది. ఇక్కడ పాఠశాల వాతావరం చాలా ఆహ్లాదంగా, ఆనందకరంగా ఉంటుంది. ఈ గ్రామం నుండే కాకుండా పొరుగు గ్రామాలైన మోరగుడి, కర్మలవారి పల్లె, చిన్న కొమెర్ల గ్రామాల నుండి మాత్రమే కాకుండా, జమ్మలమడుగు పట్టణం నుండి కూడా విద్యార్థులు రావడం జరుగుతున్నది. ఏడాది ఏడాదికి ఇక్కడి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం 900 పైగా విద్యార్థులతో ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉపాధ్యాయులుగా, ఇంజనీర్లుగా, వ్యాపారస్తులుగా, సాఫ్ట్ వేర్లుగా, డాక్టర్లు గానే కాకుండా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు.
- కడప జిల్లా లోనే అత్యుత్తమ విద్యాలయంగా గుర్తించబడిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇక్కడి జిల్లా పరిషత్ పాఠశాల భవనము మిక్కిలి సుందరమైనది.
- శాంతినికేతన్ పాఠశాల.
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయం[మార్చు]
ఈ గ్రామంలో తొగట వీర క్షత్రియుల ఇలవేలుపు అయిన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జ్యోతి మహోత్సవాలు మూడు రోజులపాటు వైభవంగా జరుగును.
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
జనాభా (2011) - మొత్తం 8,337 - పురుషుల సంఖ్య 4,219 - స్త్రీల సంఖ్య 4,118 - గృహాల సంఖ్య 2,192 https://web.archive.org/web/20150207104629/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-07-29.
వెలుపలి లింకులు[మార్చు]
[1] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2013,అక్టోబరు-23; 1వపేజీ.