శనివారపుపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శనివారపుపేట
—  జనగణన పట్టణం  —
గ్రామం లోని శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం
గ్రామం లోని శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం
శనివారపుపేట is located in Andhra Pradesh
శనివారపుపేట
శనివారపుపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°43′26″N 81°05′46″E / 16.723789°N 81.096208°E / 16.723789; 81.096208
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం ఏలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 8,142
 - పురుషులు 4,112
 - స్త్రీలు 4,030
 - గృహాల సంఖ్య 2,114
పిన్ కోడ్ 534002
ఎస్.టి.డి కోడ్

శనివారపుపేట, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు మండలానికి చెందిన జనగణన పట్టణం.

ఏలూరు నుండి ముసునూరు మీదుగా నూజివీడు వెళ్ళేమార్గంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం దాదాపు ఏలూరు నగరంలో కలిసిపోయింది. గ్రామం శివారులలోని పొలాలలో వరి, కొబ్బరి, కూరగాయలు ప్రధానమైన పంటలు. గ్రామంలో చెన్నకేశవ స్వామి, రామ లింగేశ్వర స్వామి వార్ల దేవాలయం ప్రధానమైన ఆకర్షణ. ఈ ఆలయం చిన్న తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో ఉంది. ఈ ఆలయ గోపురం చాలా ఎత్తైనది, వివిధ పురాణ గాథలు చక్కని శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి.

పట్టణ జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పట్టణ జనాభా మొత్తం 8,142 అంందులో పురుషుల సంఖ్య 4,112 మంది కాగా స్త్రీలు 4,030 మంది ఉన్నారు.పట్టణ పరిధిలోని గృహాల 2,114 ఉన్నాయి.

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7456. ఇందులో పురుషుల సంఖ్య 3812, మహిళల సంఖ్య 3644, గ్రామంలో నివాస గృహాలు 1742 ఉన్నాయి.

మూలాలు[మార్చు]


వెలుపలి లంకెలు[మార్చు]