చీడిగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చీడిగ
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ
జనాభా
 (2011)
 • Total6,365
భాష
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)

చీడిగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, కాకినాడ గ్రామీణ మండలం లోని జనగణన పట్టణం.[1]

చీడిగ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండలంలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం, చీడిగ పట్టణంలో మొత్తం 1,746 కుటుంబాలు నివసిస్తున్నాయి. చీడిగ పట్టణ మొత్తం జనాభా 6,365, అందులో 3,199 మంది పురుషులుకాగా, 3,166 మంది స్త్రీలు ఉన్నారు.సగటు లింగ నిష్పత్తి 990. పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 570, ఇది మొత్తం జనాభాలో 9%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 289 మంది మగ పిల్లలుఉండగా, ఆడపిల్లలు 281 మంది ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి 972, ఇది సగటు లింగ నిష్పత్తి (990) కంటే తక్కువ.అక్షరాస్యత రేటు 86.6%. ఈ విధంగా అవిభాజ్య తూర్పుగోదావరి జిల్లా అక్షరాస్యత 71%తో పోలిస్తే చీడిగలో అక్షరాస్యత ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 90.96%, స్త్రీల అక్షరాస్యత రేటు 82.18%.[2]

ప్రాథమిక సౌకర్యాల నిర్వహణ

[మార్చు]

చీడిగ సెన్సస్ టౌన్ పరిధిలో ఉన్న మొత్తం 1,746 ఇళ్లకు స్థానిక స్వపరిపాలన సంస్థ వీటికి మంచి నీరు, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిమితుల్లో రోడ్లు నిర్మించడానికి, నిర్వహణకు దాని అధికార పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్నులు విధించడానికి కూడా దానికి అధికారం ఉంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Villages and Towns in Kakinada Mandal of East Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-10. Retrieved 2022-10-10.
  2. 2.0 2.1 "Chidiga Population, Caste Data East Godavari Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-10. Retrieved 2022-10-10.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చీడిగ&oldid=3887041" నుండి వెలికితీశారు