మంగంపేట (ఓబులవారిపల్లె)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మంగంపేట,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్‌ఆర్ జిల్లా, ఓబులవారిపల్లె మండలానికి చెందిన జనగణన పట్టణం.[1]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామం రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత నాణ్యవంతమైన ముగ్గురాయి నిక్షేపాలున్న గ్రామం ఇది. స్వాతంత్ర్యానికి పూర్వం అగ్రహారంగా ఉన్న ఈ వూరు, 1954 లో ఖనిజాన్ని కనుగొన్న తరువాత పంచాయతీగా రూపొందింది. ఆ తరువాత కాలక్రమేణా పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందుచున్నది. రోజుకు ఒకటిన్నర కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట పరిధిలోనే ఉంది. [1]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ రామాలయo[మార్చు]

ఈ గ్రామపరిధిలోని కొత్తమంగంపేటలోని ఆరవ వీధిలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని, 8 సెప్టెంబరు, 2013న ప్రారంభించారు. [2]

శ్రీ ఆంజనేయస్వామి ఆలయo[మార్చు]

2014, ఫిబ్రవరి 15 శనివారంనాడు, శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. 16వ శతాబ్దంలో శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో, శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్ధం, చిట్వేలి-మంగపేట దారిన వెళ్తుఇన్నప్పుడు, శ్రీ ఖడ్గతిక్కన ప్రతిష్ఠించినట్లు చెప్పబడుతున్న ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్నది. తాజాగా గ్రామస్థులు పునరుద్ధరించి, "నీరుంపల్లి ఆంజనేయస్వామి"గా పునహ్ ప్రతిష్ఠ చేశారు. ఆఖరిరోజు మంగళవాయిద్యాలు, వేదమంత్రాలతో స్వామివారికి గణపతి పూజ, ఇతర ప్రత్యేకపూజలు జరిపారు. అనంతరం భక్తులందరికీ తీర్ధప్రసాదాలు అందజేశారు. 17 ఉదయం ధ్వజస్తంభం ఏర్పాటు, నాగప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. [3]

శ్రీ కట్టా పుట్టలమ్మ అమ్మవారి దేవాలయం[మార్చు]

పురాతన కాలంనాటి ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధమైనది. ఇక్కడ వేల సంఖ్యలో వివాహాలు జరిగినవి. ప్రస్తుతం ఆలయం శిథిలావస్థలో ఉంది. ఆదరణ లేక ధూప, దీప, నైవేద్యాలు కరువైనవి. త్వరిత గతిన పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. ఈ ఆలయంలో 2014,జూన్-7 శనివారం నుండి అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రారంభమైనవి. ఆదివారం ఉదయం నుండియే అమ్మవారికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. పొంగళ్ళను నిర్వహించి భజన కార్యక్రమాలు చేపట్టినారు. దీనితో రెండురోజులు నిర్వహించిన జతర ముగించారు. [4] & [5]

మూలాలు[మార్చు]

  1. "Villages & Towns in Obulavaripalle Mandal of YSR, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-02-25.

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు కడప జూలై 25, 2013. 8వ పేజీ.

[2] ఈనాడు కడప సెప్టెంబరు 8, 2013. 4వ పేజీ.

3] ఈనాడు కడప; 2014,ఫిబ్రవరి-18; 4వ పేజీ.

[4] ఈనాడు కడప; 2014,మే-17; 5వ పేజీ.

[5] ఈనాడు కడప; 2014,జూన్-9, 4వ పేజీ.