పూర్వము ఈ గ్రామంను వేయిమునులకుదురు అని పిలిచేవారు. సుమారు ౫౦,౦౦౦ (50,000) జనాభా కలిగిన ఈ గ్రామం విజయవాడ నగరానికి ఆగ్నేయ దిక్కున ఉంది. దక్షిణాన కృష్ణా నది, ఊరి మధ్యన ఉత్తరాన బందరు కాలువ ప్రవహిస్తున్నాయి. వ్యవసాయము, వ్యవసాయధారిత వ్యాపారము, పాడి పరిశ్రమ ఇక్కడి జీవనాధారాలు. గులాబి తోటలు, జామ తోటలు ఈ వూరిలో ప్రధానమైనవి. ఎంతోమంది గ్రామస్థులు విజయవాడ నగరంలోనే కాక దేశంలోని వివిధ నగరాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా చదువులు, ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు.
యనమలకుదురు గ్రామం మహాశివరాత్రి ఉత్సవాలకు ప్రసిద్ధి. శివపార్వతి నగర్, చిన్న వంతెన, కొత్త వంతెన, మండపం, కచేరి చావిడి (పంచాయతి), బోసు బొమ్మ, ఎన్టిఆర్ సెంటర్, భగత్ సింగ్ నగర్, లంబాడిపేట, లాకులు, తాడిగడప డొంక గ్రామంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గాంధీ మునిసిపల్ స్కూల్లో చదువుతున్న సమయంలో తన భాల్యాన్ని యనమలకుదురులోనే రామయ్య గారి ఇంట్లో గడిపారు.
యనమలకుదురు భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా లో విజయవాడ యొక్క పొరుగు ప్రాంతంగా, జనాభా గణన పట్టణంగా ఉంది. సెన్సస్ ఇండియా 2011 లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, యనమలకుదురు జనాభా గణనలో 34,177 మంది జనాభా ఉన్నారు, ఇందులో 17,146 మంది మగవారు, 17,031 మంది మహిళలు ఉన్నారు. అలాగే 0-6 ఏళ్ళ వయస్సు ఉన్న చిన్నారుల జనాభా 3898 ఉండగా, ఇది యనమలకుదురు మొత్తం జనాభాలో 11.41% గా ఉంది. యనమలకుదురు సెన్సస్ టౌన్ లో, మహిళా సెక్స్ నిష్పత్తి 993 ఉండగా ఇది రాష్ట్ర సగటు 993 కి సమానంగా ఉంది. అంతేకాకుండా, యనమలకుదురులో పిల్లల సెక్స్ నిష్పత్తి దాదాపుగా 955 గా ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోల్చితే ఎక్కువగా ఉంది. యనమలకుదురు పట్టణం అక్షరాస్యత శాతం 72.89%, రాష్ట్ర సగటు 67.02% కంటే ఎక్కువ. పట్టణంలో, పురుష అక్షరాస్యత 76.98%, స్త్రీ అక్షరాస్యత రేటు 68.79% గా ఉంది.[1]
యనమలకుదురు సెన్సస్ టౌన్ మొత్తం నిర్వహణలో 9398 గృహాలు ఉన్నాయి, మంచినీటి వసతి, మురికినీరు వంటి ప్రాథమిక సదుపాయాలను ఇది కలగ చేస్తుంది. ఇది సెన్సస్ టౌన్ పరిమితుల్లో రోడ్లు నిర్మించడానికి, దాని అధికార పరిధిలో వచ్చే ఆస్తులపై పన్నులను విధించేందుకు కూడా అధికారం కలిగి ఉంటుంది.[1]
పట్టణం మొత్తం జనాభాలో షెడ్యూల్ కులం (ఎస్.సి.) 9.44%, షెడ్యూల్ ట్రైబ్ (ఎస్టీ) 5.6% మంది ఉన్నారు.
మొత్తం జనాభాలో 13,041 మంది పని లేదా వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇందులో 10,298 మంది మగవారు, 2,743 మంది స్త్రీలు ఉన్నారు. జనాభా లెక్కల సర్వేలో, పనిచేయువాడు అనగా; వ్యాపారం, ఉద్యోగం, సేవా, వ్యవసాయదారుడు, కార్మిక కార్యకలాపాలను నిర్వహించేవాడు అని అర్థం. మొత్తం పనిలో 13041 మంది పనిచేస్తున్నప్పుడు, 90.14% మంది ప్రథాన (మెయిన్ వర్క్లో) పనులలో పాల్గొంటున్నారు, అదే సమయంలో 9.86% మొత్తం కార్మికులు సాధారణ (అండర్ వర్క్) పనిలో నిమగ్నమయ్యారు.[1]
పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.
ఈ ఆలయంలో 2016, మే-20వ తేదీ వైశాఖ శుద్ధ చతుర్దశినాడు రాత్రికి, స్వామివారి కల్యాణోత్సవాలను కన్నులపండువగా నిర్వహించారు. 21వ తేదీ శనివారం, వైశాఖపౌర్ణమినాడు, ఉదయం కళ్యాణ దంపతులకు పుష్పోత్సవం అనంతరం గ్రామోత్సవం, రాత్రికి పవళింపుసేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. [3]
పురాణం ప్రకారం గ్రామంలోని మునిగిరి అనే కొండఫై వేయిమంది మునులు మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోడానికి తపస్సు చేసినట్టు ప్రతీతి. అందువలనే ఈ గ్రామంను వేయిమునులకుదురు అని పిలిచేవారు. కాలక్రమంలో వేయిమునులకుదురు నుండి యనమలకుదురుగా మారిందని పెద్దలు చెబుతుంటారు. నేడు మునిగిరిఫై రామలిగేశ్వరస్వామి ఆలయం, విగ్నేశ్వరాలయం, అయ్యప్పస్వామి ఆలయం, నాగేంద్రస్వామి ఆలయం ఉన్నాయి.
గ్రామంలో ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయాలను విద్యుత్తు దీపకాంతులతో, పుష్పాలతో అలంకరిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి పక్క గ్రామాల నుండే కాక జిల్లా నలుమూల నుండి ప్రజలు వస్తారు. గ్రామస్థులు తమ బంధువులను ఆహ్వానించి విందు ఇవ్వటం ఆనవాయితీ. శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లును, విద్యుత్, కేబుల్ వైర్లను రోడ్డుకి అడ్డంగా తగులకుండా క్రమబద్ధీకరిస్తారు. గ్రామస్తులను తమ ఇళ్లను రంగులతో అలకరించుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు మూడు రోజుల పాటు సాగుతాయి.
మొదటిరోజు-ప్రభోత్సవం
మొదటిరోజు మహాశివరాత్రి నాడు పెద్దఎత్తున భక్త జనప్రవాహంతో నిండిపోతుంది. ఉదయం స్వామి వారికి యనమలకుదురు లాకుల సెంటర్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయం నుంచి పట్టువస్త్రాలను ఆలయ అధికారులు మేళతాళాలలతో ఊరేగింపుగా తీసుకుని వస్తారు. మండపం వద్ద గ్రామప్రభ వేలంపాట నిర్వహిస్తారు. ఈ వేలంపాటను ప్రజలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. తరువాత గండ దీపాలతో భక్తులు ఊరేగింపుగా మునిగిరిఫై వేంచేసి ఉన్న రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. పశువులను అందంగా పూలతో అలంకరించి కొండ చుట్టూ తిప్పుతారు. సాయంత్రం ప్రభల రథాలను లాగే ఎడ్లను ఊరేగింపుగా తీసుకొనివచ్చి గ్రామ ప్రభ చుట్టూ తిప్పుతారు. ఈ సందర్భంగా గ్రామం తీన్మార్ డప్పులు, కోలాటాలు, కోయ నృత్యాలు, బేతాళ వేషాలు, మేళతాళాలతో మారుమోగిపోతుంది. ఒక్కో ప్రభకు అయ్యే ఖర్చు నాలుగు లక్షలు అవుతుంది అని అంచనా. రాత్రి రంగుకాగితలు, విద్యుత్తు దీపాలతో అలంకరించిన 50 అడుగుల ప్రభలను కొండచుట్టూ మరుసటిరోజు ఉదయం వరకు ఊరేగింపుగా తిప్పుతారు.
రెండవరోజు-గ్రామోత్సవం
రెండవరోజు వేకువజామున అర్చకులు పార్వతి, రామలింగేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు పూలతో అలంకరించిన నందీశ్వరుని వాహనంఫై ఉత్సవ విహ్రహాలను మేళ తాళల మద్య గ్రామ వీధులలో గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గ్రామస్థులు స్వామివారికి హారతులు ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేస్తారు.
మూడవరోజు-వసంతోత్సవం
మూడవ రోజు ఉదయం గ్రామ వీధుల్లో స్వామి వారిని పల్లకిలో ఊరేగిస్తూ ఘనంగా వసంతోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామి వారికి కళ్యాణం చేసిన దంపతులు, గ్రామస్థులు రంగులు, రంగు నీళ్ళు ఒకరిఫై ఒకరు చల్లుకుంటూ ఊరేగింపులో పాల్గొంటారు. అనంతరం కృష్ణా నదిలో త్రిసూల స్నానాలు చేస్తారు. రాత్రి ధ్వజారోహణ సందర్భంగా స్వామి వారికి నివేదన చేసిన నందిముద్దలను భక్తులకు ఇస్తారు. ఇవి తిన్నవారికి సంతానం కలుగుతుందని నమ్మకం. ఈ కార్యక్రమంతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.
విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలనుండి యనమలకుదురు గ్రామానికి బస్సు సౌకర్యం ఉంది.
7R: మిల్క్ ప్రాజెక్ట్ నుండి యనమలకుదురు (కాళేశ్వరరావు మార్కెట్, పండిట్ నెహ్రూ బస్సు స్టేషను, లబ్బీపేట, స్కెవ్ బ్రిడ్జి, రామలింగేశ్వర నగర్ గుండా బస్సు ప్రయాణం సాగుతుంది)
7A: కాళేశ్వరరావు మార్కెట్ నుండి లాకులు (పండిట్ నెహ్రూ బస్సు స్టేషను, లబ్బీపేట, పటమట, ఆటోనగర్ బస్సు స్టాండ్ గుండా బస్సు ప్రయాణం సాగుతుంది)
7B: కాళేశ్వరరావు మార్కెట్ నుండి తాడిగడప డొంక (పండిట్ నెహ్రూ బస్సు స్టేషను, లబ్బీపేట, పటమట, ఆటోనగర్ బస్సు స్టాండ్ గుండా బస్సు ప్రయాణం సాగుతుంది)
బస్సులే కాక గ్రామానికి చేరడానికి రైల్వే స్టేషను, పండిట్ నెహ్రూ బస్టాండ్, బెంజ్ సర్కిల్, పటమట, ఆటోనగర్ బస్టాండ్ నుండి ఆటోలు దొరుకుతాయి.
20 వార్డులు 22,000 వోటర్లు కలిగిన యనమలకుదురు గ్రామ పంచాయతి కృష్ణా జిల్లాలోనే అతిపెద్ద పంచాయతిల్లో ఒకటి. ప్రస్తుత గ్రామ పంచాయతి పాలకవర్గం ఈ విధింగా ఉంది
గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి (కొత్తది) · గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి (పాతది)
అవుట్ పేషంట్/దీర్ఘకాలం/పునరావాసం
నాగార్జున హాస్పిటల్స్ లిమిటెడ్ · మైనేని ఆసుపత్రి · ప్రశాంత్ ఆసుపత్రి · ప్రశాంతి ఆసుపత్రి · మోహన్ ఆసుపత్రి · కాకాని ఆసుపత్రి · సిహెచ్. ఆర్.కె. మెమోరియల్ హాస్పిటల్ · టైం హాస్పిటల్స్ ప్రెవేట్ లిమిటెడ్ · త్రిమూర్తి ఆసుపత్రి · ప్రజా ఆసుపత్రి అమ్మ హాస్పిటల్ · ఆంధ్ర హాస్పిటల్స్ · అనూ హాస్పిటల్స్ · ఆయుష్ ఎన్నారై ఎల్.ఈ.పి.ఎల్. హెల్త్ కేర్ ప్రెవేట్ లిమిటెడ్ · చరితశ్రీ హాస్పిటల్స్ లిమిటెడ్ · గ్లోబల్ మెడికల్ సెంటర్ · హెల్ప్ హాస్పిటల్స్ · లైఫ్ లైన్ త్రిమూర్తి హాస్పిటల్ · పూజిత హాస్పిటల్ · రాయల్ హాస్పిటల్స్ · సౌమ్య మెడికేర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · సెంటిని హాస్పిటల్స్ ప్రెవేట్ లిమిటెడ్ · శ్రీ రామ్ హాస్పిటల్స్ · సురక్ష హాస్పిటల్ · ట్రస్ట్ హాస్పిటల్ · విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ · విఘ్నేష్ సూపర్ స్పెషాలిటీస్ · పాజిటివ్ పల్స్ హాస్పిటల్స్ ప్రెవేట్ లిమిటెడ్ · మెహర్ హాస్పిటల్స్ · మెట్రో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ · లత సూపర్ స్పెషాలిటీస్ · మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (కొత్త పేరు-మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్) · పిన్నమనేని కేర్ హాస్పిటల్ · విజేత హాస్పిటల్ ·
సురక్షిత చిల్డ్రన్స్ హాస్పిటల్ · అయేషా చిల్డ్రన్ ఆసుపత్రి · బాల్య ఆసుపత్రి, ఫర్ చిల్డ్రన్ · డా. రామారావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ ·
రెయిన్బో చిల్డ్రన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
మాక్సివిజన్ లేజర్ సెంటర్ ప్రెవేట్ లిమిటెడ్ · ఎస్.కె. .సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ · భార్గవ్ నర్సింగ్ హోం & ఐ హాస్పిటల్ · చైతన్య ఐ హాస్పిటల్ · మీనాక్షి ఐ హాస్పిటల్ · మోడరన్ రెటినా సెంటర్ · శంకర ఐ హాస్పిటల్ · శ్రీదేవి ఐ హాస్పిటల్
సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల · సిబార్ దంత సంరక్షణ
నరములు
చెరుకూరి న్యూరో శస్త్రచికిత్స నర్సింగ్ హోమ్, · ఎస్.వి.ఆర్. న్యూరో హాస్పిటల్
స్త్రీ
ప్రసూతి & వంధ్యత్వం
శ్రీ హాస వంధ్యత్వం & ప్రసూతి ఆసుపత్రి
ప్రసూతి
శ్రీ వెంకటసాయి యూరాలజీ & ప్రసూతి సెంటర్
కిడ్నీ
అరుణ్ కిడ్నీ సెంటర్
కీళ్ళు
కమల కీళ్ళ నర్సింగ్ హోం · విజయ దుర్గ కీళ్ళ నర్సింగ్ హోం · విజయ్ ఆర్థోపెడిక్ & ప్రమాద రక్షణ · సిటీ ఆర్థోపెడిక్ సెంటర్ & మల్టీస్పెషాలిటీ
డయబెటిక్
డా.శ్రీకాంత్'స్ డయబెటీస్ స్పెషాల్టీస్ సెంటర్, [1]డా.శ్రీకాంత్'స్ డయబెటీస్ స్పెషాల్టీస్ సెంటర్ వెబ్సైట్ ఇక్కడ క్లిక్ చేయండి.
క్లినిక్‌లు
జానకీనాథ్ క్లినిక్ · స్కిన్ & వి డి క్లినిక్
ఇన్స్టిట్యూట్స్
హాస్పిటల్ డా. పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ · కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ · ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ · విజయవాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ ప్రెవేట్ లిమిటెడ్
చర్మవ్యాధులు
స్కిన్ కేర్ సెంటర్ · విపుల స్కిన్ హస్పిటల్ · డా.రాజశేఖర్ స్కిన్ హస్పిటల్ · A TO Z స్కిన్ హస్పిటల్ · విజయవాడ మెడికల్ సర్వీసెస్ · డా.శైలజ స్కిన్ హస్పిటల్ · మామిళ్ళ స్కిన్ హస్పిటల్
హోటల్ ఐలాపురం · హోటల్ జగపతి ఇంటర్నేషనల్ · వాసవీ రెస్టారెంట్ · ఎస్కిమో · హోటల్ గురు · వెల్కమ్ హోటల్
హనుమాన్‌పేట
హోటల్ శ్రీపాద · హోటల్ సింధూరి
బందర్ రోడ్డు (మహాత్మాగాంధీ రోడ్డు ) (ఎం.జి. రోడ్డు).
హోటల్ మనోరమ · హోటల్ శ్రీనివాస్ · హోటల్ క్వాలిటి ఇన్ · హోటల్ డి వి మనార్ · ది గేట్‌వే హోటల్ (తాజ్ గ్రూప్ హోటల్) · హోటల్ ఫార్చూన్ మురళి పార్క్ · హోటల్ సంగీత · హోటల్ మార్గ్ కృష్ణయ్య · హోటల్ షిర్డి హోటల్ · దక్షిణ గ్రాండ్ · హోటల్ శశి పారడైజ్ · హోటల్ సంక్రాంతి · హోటల్ మెడిసిటీ
ఏలూరు రోడ్డు
హోటల్ మమత · హోటల్ గ్రాండ్ రెసిడెన్సీ · హోటల్ కృష్ణా రెసిడెన్సీ · హోటల్ రాజ్ టవర్స్ · అజంతా హోటల్ · హోటల్ సరోవర్ · హోటల్ శాంతి
గవర్నర్‌పేట
హోటల్ స్వర్ణప్యాలెస్ · హోటల్ అభిలాష · హోటల్ మేనక · హోటల్ బాలాజీ రెసిడెంసీ అండ్ శ్రీ బాలాజీ · హోటల్ బృందావన్ లాడ్జి · హోటల్ శ్రీలేఖ · కృష్ణా రెసిడెంసీ · అనిల్ రెస్ట్‌హౌస్ · దుర్గావిలాస్ లాడ్జి · హోటల్ అప్సర · హోటల్ పెక్సో · మేనక లాడ్జి · రామకృష్ణా రెస్ట్ హౌస్
ఆర్టీసీ, పండిట్ నెహ్రూ బస్టాండ్, విజయవాడ ·డిజిపి కార్యాలయము, న్యాయస్థానముల సముదాయము ప్రక్కన, విజయవాడ · ఎసీబీ, పండిట్ నెహ్రూ బస్టాండ్, విజయవాడ ·డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం, విజయవాడ · ఎపీ పారా మెడికల్ బోర్డు, పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం, విజయవాడ ·సమాచార పౌర సంబంధాల శాఖ, రాష్ట్ర అతిథి గృహ ప్రాంగణం, విజయవాడ ·అగ్నిమాపక శాఖ, పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన, విజయవాడ ·ఎపిఐఐసీ, గురునానక్ కాలనీ రోడ్డు, విజయవాడ ·ఐటీ శాఖ, సిఎంవో, ఇందిరాగాంధీ మైదానం, విజయవాడ ·బీసీ కమిషన్, ట్రెండ్ సెట్ మాల్ ప్రక్క వీధి, బెంజి సర్కిల్, విజయవాడ ·ఈఎన్సీ, నీటిపారుదల శాఖ, నీటిపారుదల శాఖ కార్యాలయము, విజయవాడ ·రాష్ట్ర పణాళిక సంఘం కార్యాలయము, నారా చంద్రబాబు నాయుడు కాలనీ, బెంజి సర్కిల్, విజయవాడ ·గిరిజన సంక్షేమ శాఖ, మారుతీ నగర్, ఏలూరు రోడ్డు, విజయవాడ ·ఈఎన్సీ, పంచాయితీరాజ్, జిల్లా పరిషత్ అతిథి గృహం, ఎంజీ రోడ్డు, విజయవాడ ·డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, మ్యూజియం రోడ్డు, విజయవాడ ·పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, చరితశ్రీ ఆసుపత్రి భవనం, సూర్యారావు పేట, విజయవాడ ·రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, ఇందిరాగాంధీ మైదానము, విజయవాడ ·ఇంటర్ విద్యా కార్యాలయము, కరెన్సీ నగర్, విజయవాడ ·ఉపాధి కల్పన కార్యాలయము, ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణం, విజయవాడ ·కార్మిక శాఖ కార్యాలయము, పాపయ్య వీధి, సీతారాంపురం, విజయవాడ ·రవాణా శాఖ కమిషనరేట్, పండిట్ నెహ్రూ బస్టాండ్, విజయవాడ ·జైళ్ళ శాఖ, గులాబీతోట, విజయవాడ ·
విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతములు
ఆటోనగర్, విజయవాడ
డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్, ఆటోనగర్, విజయవాడ ·
గుణదల, విజయవాడ
తూనికలు, కొలతలు, ఈఎస్ఐ ఆసుపత్రి దగ్గర, గుణదల, విజయవాడ ·
భవానీపురం, విజయవాడ
సీఈ, సీడివో, భవానీపురం, విజయవాడ ·
గొల్లపూడి, విజయవాడ
ఈఎన్సీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, వసుధ కాంప్లెక్స్, గొల్లపూడి రోడ్-1, విజయవాడ ·
పౌరసరఫరాల శాఖ, అయ్యప్పస్వామి మందిరం దగ్గర, గొల్లపూడి, విజయవాడ ·
పరిశ్రమలు శాఖ, ఆంధ్రా ఆసుపత్రి దగ్గర, గొల్లపూడి, విజయవాడ ·
పెనమలూరు, విజయవాడ
మత్యశాఖ కార్యాలయం, పెనమలూరు, విజయవాడ ·
ప్రసాదంఫాడు, విజయవాడ
కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, దేవి ప్లాజా దగ్గర, ప్రసాదంఫాడు, విజయవాడ ·
ఎండీ, స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్, దేవి ప్లాజా దగ్గర, ప్రసాదంఫాడు, విజయవాడ ·ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, దేవి ప్లాజా దగ్గర, ప్రసాదంఫాడు, విజయవాడ ·
సాంకేతిక విద్యా శాఖ, ఎఎన్ఆర్ టవర్స్, ప్రసాదంఫాడు, విజయవాడ ·
పాయకాపురం, విజయవాడ
సాంఘిక సంక్షేమ శాఖ, బాలికల వసతి గృహం, పాయకాపురం, విజయవాడ (కొద్ది కాలము తదుపరి ఈ శాఖ కార్యలయం కనకదుర్గమ్మ వారధి దగ్గర ఉన్న మణిపాల్ ఆసుపత్రి దగ్గరకు మార్చబడుతుంది.) ·
యనమలకుదురు , విజయవాడ
వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయము, యనమలకుదురు రోడ్డు, విజయవాడ ·
వ్యవసాయ శాఖ డైరెక్టరేట్, మిర్చియార్డు, చుట్టుగుంట కూడలి, గుంటూరు ·మార్కెటింగ్, మిర్చియార్డు, చుట్టుగుంట కూడలి, గుంటూరు · సహకార శాఖ కార్యాలయము, శ్యామల నగర్, గుంటూరు ·చిన్న నీటిపారుదల, గుంటూరు ·
గోరంట్ల, గుంటూరు
పురపాలక సంచాలకులు, ఇన్నర్ రింగు రోడ్డు దగ్గర, గోరంట్ల, గుంటూరు ·పట్టణ పణాళిక విభాగ సంచాలకుల కార్యాలయం, ఇన్నర్ రింగు రోడ్డు దగ్గర, గోరంట్ల, గుంటూరు ·