Jump to content

ఫిర్యాది నైనవరం

అక్షాంశ రేఖాంశాలు: 16°34′25″N 80°38′21″E / 16.573509°N 80.639041°E / 16.573509; 80.639041
వికీపీడియా నుండి
ఫిర్యాది నైనవరం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఫిర్యాది నైనవరం is located in Andhra Pradesh
ఫిర్యాది నైనవరం
ఫిర్యాది నైనవరం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°34′25″N 80°38′21″E / 16.573509°N 80.639041°E / 16.573509; 80.639041
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం విజయవాడ గ్రామీణ
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ మాతంగి ఆంజనేయులు
జనాభా (2011)
 - మొత్తం 2,875
 - పురుషుల సంఖ్య 1,476
 - స్త్రీల సంఖ్య 1,399
 - గృహాల సంఖ్య 819
పిన్ కోడ్ 520012
ఎస్.టి.డి కోడ్ 0866

ఫిర్యాది నైనవరం, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉంది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.

విజయవాడ రూరల్ మండలం

[మార్చు]

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

ఈ గ్రామానికి ఆ పేరు రావటానికి గల కారణం ఏమిటంటే, పూర్వం ఈ వూరివారు ఎక్కువగా గొడవలు పడి, తరచూ పోలీసు కేసులు పెట్టుకొనేవారు. అనంతరం పోలీసులూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. కొత్తూరు అటవీ స్థలాన్ని ఆనుకొని ఉన్న ఈ గ్రామంలో నాటుసారా తయారీ ఎక్కువగా జరుగుతూ ఉండేది. దీంతో గ్రామంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. అప్పట్లో ఈ గ్రామం సుమారు 10 మైళ్ళ దూరంలోని గన్నవరం పోలీస్ స్టేషను పరిధిలో ఉండేది. దీంతో పోలీస్ స్టేషనుకు వెళ్ళేవారు, భోజనం గూడా వెంట తీసుకొని వెళ్ళేవారు. ఇలా గన్నవరం పోలీస్ స్టేషనుకు రోజూ ఎవరో ఒకరు ఈ గ్రామం నుండి వెళ్ళేవారు. దీంతో నైనవరంగా ఉన్న ఈ గ్రామాన్ని "ఫిర్యాదీ నైనవరం"గా పోలీసు రికార్డులలో నమోదు చేసినట్లు గ్రామస్థులు చెపుచున్నారు. అప్పటినుండి ఫిర్యాదీ నైనవరంగా పేరు మారిందని ఈ గ్రామంలోని వృద్ధులు వివరించుచున్నారు. అయితే గ్రామంలోఅక్షరాస్యత పెరగటం, పట్టణవాతావరణానికి అలవాటు పడటంతో, గ్రామంలో గొడవలు క్రమేపీ తగ్గినవి.

గ్రామ భౌగోళికం

[మార్చు]

ఇది సముద్ర మట్టంనుండి 21 మీ.ఎత్తులో ఉంది.

సమీప గ్రామాలు

[మార్చు]

విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుంటూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

విజయవాడ, ఎ.పి.ఎస్.ఆర్టీ.సి పెద్ద రోడ్డురవాణా సౌకర్యం గల పెద్ద సంస్థ

రైలు వసతి

[మార్చు]
  1. విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77213
  2. విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
  3. విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77206 (ఆదివారం తప్ప)
  4. గుంటూరు - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57381
  5. విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల. రవీంద్రభారతి హైస్కూల్, నున్న

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

[మార్చు]

వెలుగు ఆశ్రమం

[మార్చు]

ఈ ఆశ్రమంలో నాలుగు సంవత్సరాలుగా అనాథ వృద్ధమహిళలకు అండగా ఉంటూ వారికి ఉచిత సేవలందించుచున్నారు.

బ్యాంకులు

[మార్చు]

విజయా బ్యాంక్:- గ్రామంలో ఈ బ్యాంకు శాఖను 2016,సెప్టెంబరు-28న ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. 1980 నుండి 1995 వరకూ ఈ గ్రామ సర్పంచిగా సిరిపురపు వెంకటేశ్వరరావు పనిచేశారు. ఆ తరువాత 1995 నుండి ఈ గ్రామ సర్పంచిగా ఇతని తల్లి సిరిపురపు మణెమ్మ ఎన్నికై 2001 వరకూ పనిచేశారు.
  2. ఈ గ్రామానికి 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో మాతంగి ఆంజనేయులు సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు మూడు రోజులపాటు కన్నుల పండువగా నిర్వహించెదరు. ఈ మూడురోజులూ ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఈ వేడుకలలో భాగంగా ఉట్టికొట్టే కార్యక్రమం, కృష్ణుడి విగ్రహం ఊరేగింపు, తదుపరి అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించెదరు.

శ్రీ రామాలయం

[మార్చు]

గ్రామంలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ శివనాగేంద్రస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక సంబరాలు, 2017,మార్చి-18వతేదీ శనివారంనుండి 20వతేదీ సోమవారం వరకు వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించు ఈ సంబరాలకు, స్థానిక ప్రాంతాలనుండి భక్తులు పెద్దయెత్తున తరలివచ్చి అమ్మవారికి పూజలు చేసారు. ఈ సందర్భంగా అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [9]

గణాంకాలు

[మార్చు]

2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2875. ఇందులో పురుషుల సంఖ్య 1476, స్త్రీల సంఖ్య 1399, గ్రామంలో నివాస గృహాలు 819 ఉన్నాయి.

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2475. ఇందులో పురుషుల సంఖ్య 1238, స్త్రీల సంఖ్య 1237, గ్రామంలో నివాస గృహాలు 609 ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.

వెలుపలి లింకులు

[మార్చు]