Jump to content

మరకత రాజరాజేశ్వరీ దేవాలయం

వికీపీడియా నుండి

మరకత రాజరాజేశ్వరీ దేవాలయం విజయవాడ నగరంలోని పటమటలో గల దేవాలయం. ఇది శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ద్వారా 1979లో ప్రతిష్టించబడిన ఈ దత్త పీఠంలో ప్రధాన ఆలయంగా ఈ ఆలయం ఉంది.

విశేషాలు

[మార్చు]

ఈ దేవాలయం అపురూపమైన శిల్పకళతో తయారైనది. అమ్మవారి మూర్తి అపురూపమైన మరకత శిలతో(పచ్చ) చెక్కబడింది. అంతేకాక, ఆలయవు గోడలన్నీ రాతితో చెక్కబడి శ్రీచక్రం లోని వివిధ చక్రాలు, వాటిలోని దేవతలను అద్భుతంగా దర్శింపజేస్తూ ఉంటాయి. ఆలయ శిఖరం సుమేరు శ్రీచక్ర అకారంలో ఉంటుంది. అమ్మ వారి ముందు కూర్మం (తాబేలు) పై మాణిక్యం (కెంపు) తో చేసిన శ్రీచక్రం అలరారుతూ ఉంటుంది. 2002 లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చే ఈ గుడి కుంభాభిషేకం, ప్రతిష్ఠ జరుపబడింది.[1]

అమ్మవారి గర్భాలయ కుడ్యానికి అష్టలక్ష్ముల శిల్పాలు శోభాయమానంగా ఉన్నాయి. మంటప కుడ్యాలమీద గజరాజులు, గరుడ పక్షులు పూలమాలికలు దాల్చిన శిల్పాలున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. Sri Marakata Rajarajeswari Temple, విజయవాడ (05 September 2025). "Sri Marakata Rajarajeswari Temple". VIJAYAWADA ONLINE .IN. Archived from the original on 9 డిసెంబరు 2024. Retrieved 05 September 2025. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help); line feed character in |website= at position 11 (help)CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]