Jump to content

బెంజ్ సర్కిల్

అక్షాంశ రేఖాంశాలు: 16°29′54″N 80°39′21″E / 16.4982196°N 80.655764°E / 16.4982196; 80.655764
వికీపీడియా నుండి
బెంజ్ సర్కిల్
విజయవాడలో బెంజ్ సర్కిల్
పటం
ప్రదేశం
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
అక్షాంశ,రేఖాంశాలు16°29′54″N 80°39′21″E / 16.4982196°N 80.655764°E / 16.4982196; 80.655764
జంక్షన్ వద్ద
రహదార్లు
ఎన్‌హెచ్ 16 (పాత ఎన్‌హెచ్ 5)
ఎన్‌హెచ్ 65 (పాత ఎన్‌హెచ్ 9)
నిర్మాణం
రకంగుండ్రనిచుట్టు

బెంజ్ సర్కిల్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని బందరు రోడ్‌లో ఉన్న ఒక ప్రముఖ చౌరాస్తా.[1] ఈ రహదారిలో రెండు రహదారులు ఎన్‌హెచ్ 16 (పాత ఎన్‌హెచ్ 5), ఎన్‌హెచ్ 65 (పాత ఎన్‌హెచ్ 9) ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

ఇంతకు మునుపు బెంజ్ కంపెనీ (టాటా మోటార్స్-మెర్సిడెస్ బెంజ్ జాయింట్ వెంచర్) ఈ జంక్షన్తో ఉంది. ఈ జంక్షన్‌ను బెంజ్ సర్కిల్‌గా పిలిచారు. తర్వాతి కాలంలో కంపెనీని తొలగించారు, కాని ఈ సర్కిల్కి బెంజ్ సర్కిల్‌గా, బస్ స్టాప్‌గా ప్రజలు "బెంజ్ కంపెనీ బస్టాప్"గా పేర్కొన్నారు.

ట్రాఫిక్

[మార్చు]

బెంజ్ సర్కిల్ నుండి రోజువారీ సగటున 57,000 వాహనాలు వెళ్ళతాయి. విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే జంక్షన్‌గా చెప్పవచ్చు.[2] బెంజ్ సర్కిల్‌కు సమీపంలో రహదారి విస్తృత ప్రాజెక్టులో భాగంగా కొత్తగా ఒక ఫ్లైఓవర్ నిర్మాణం కూడా పనిలో చేర్చబడింది. తూర్పు దిశగా బెంజ్ సర్కిల్ తరువాత "విజయవాడ-మచిలీపట్నం హైవే" విస్తరణ జరిగింది. ఈ రహదారి విస్తరణ తరువాత ఫ్లైఓవర్ నిర్మాణం రద్దు చేయబడింది.[3]

ఆస్తి విలువ

[మార్చు]

రాజధానిని ప్రకటించిన తరువాత విజయవాడ ప్రాంతంలో, బెంజ్ సర్కిల్‌కు సమీపంలో ఉన్న భూమి విలువ చదరపు అడుగుకి 1.2 లక్షలకు పెరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ లోను, కామన్ రాజధానిగా ఉన్న హైదరాబాదు ప్రాంతంలో కంటే అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉంది.[4]

మూలాలు

[మార్చు]
  1. M. Srinivas. "Benz Circle turns major traffic bottleneck". The Hindu.
  2. Rajulapudi Srinivas. "'57,000 vehicles cross Benz Circle daily'". The Hindu.
  3. "Pending road projects pile up". The Times of India.
  4. "Benz Circle beats Banjara Hills!". The Times of India.