అక్షాంశ రేఖాంశాలు: 16°34′35″N 80°41′07″E / 16.5763°N 80.6854°E / 16.5763; 80.6854

నున్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Nunna
నున్న
Nunna is located in ఆంధ్రప్రదేశ్
Nunna
Nunna
Location in Andhra Pradesh, India
Coordinates: 16°34′35″N 80°41′07″E / 16.5763°N 80.6854°E / 16.5763; 80.6854
Countryభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా జిల్లా
మండలంVijayawada (rural)
జనాభా
 (2011)[1]
 • Total14,176
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
521212
టెలిఫోన్ కోడ్0866
Vehicle registrationAP–16
Lok Sabha constituencyMachilipatnam
Vidhan Sabha constituencyGannavaram

నున్న, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన గ్రామం. విజయవాడ పొరుగు ప్రాంతం.

మామిడిపళ్ళ మార్కెట్ యార్డు

సమీప గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో సూరంపల్లి, ముస్తాబాద్, అంబాపురం, పాయకపురం గ్రామాలు ఉన్నాయి.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉంది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.

విజయవాడ రూరల్ మండలం

[మార్చు]

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

మెట్రోపాలిటన్ ప్రాంతం

[మార్చు]

2017 మార్చి 23 న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్ జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.[3]

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

ఒకప్పుడు ఈ గ్రామంలో నూనె గానుగలు (అంటే వివిధ రకాల విత్తనాలతో నూనె తయారుచేసే యంత్రం లేక వ్యవస్థ) ఎక్కువగా ఉండేవి, ఆ క్రమంలో నూనె అనే పదము కాల క్రమేణా నున్నగా రూపాంతరం చెందింది

గ్రామ భౌగోళికం

[మార్చు]

ఇది సముద్ర మట్టంనుండి 21 మీ.ఎత్తులో ఉంది.

నున్న గ్రామం విజయవాడ - నూజివీడు మార్గంలో, విజయవాడ పట్టణం నుండి సుమారుగా 12కిలోమీటర్ల దూరములో ఉంది. విజయవాడ నగర పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామం గనుక పట్టణం రూపురేఖలు ప్రబలంగా కనిపిస్తాయి.

సమీప గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో సూరంపల్లి, ముస్తాబాద్, అంబాపురం, పాతపాడు, అడివి నెక్కలం గ్రామాలు ఉన్నాయి.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

విజయవాడ రైల్వస్టేషన్ గ్రామం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, 15 నిముషాల జర్నీ సమయం పడుతుంది, విజయవాడ విమానాశ్రయం గ్రామానికి 20 కిలోమీటర్ల దూరమలో ఉంది, విజయవాడ లోని పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ నుంచి సౌత్ ఇండియా మొత్తానికి ఎటు వైపు అయినా వెళ్లగలిగే వీలు ఉంది, వీటితో పాటు అనేక ప్రయివేట్ ట్రావెల్స్ సంస్థల బస్సులు అందుబాటులో ఉన్నాయి.రామవరప్పాడు, గుణదల నుండి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. ఇది నూజీవీడు - విజయవాడ రాష్ట్ర రహదారిపై ఉంది. నున్న నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీపంలోని విజయవాడ నున్నకు సమీప నగరంగా ఉంది. ఈ గ్రామానికి గుణదల, ముస్తాబాద రైల్వే స్టేషన్లు అనేవి సమీప రైల్వే స్టేషన్లు.

రైలు వసతి

[మార్చు]
  • విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77213
  • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
  • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77206 (ఆదివారం తప్ప)
  • గుంటూరు - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57381
  • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, షోఘి కాన్వెంట్, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, కెన్నడీ హైస్కూల్, రవీంద్ర భారతి స్కూల్, వికాస్ కాలేజ్ అఫ్ ఎడ్యుకేషన్ ( మెడిసిన్ తప్ప అన్ని రకాల విద్యా కోర్సులు అందిస్తుంది),

గ్రామంలో మౌలిక వసతులు

[మార్చు]
  1. గ్రంథాలయం:- నాలుగు సంవత్సరాల క్రితం మూసివేసిన ఈ గ్రంథాలయం, 2014, సెప్టెంబరు-26న పునఃప్రారంభమైనది.
  2. శుద్ధినీటి కేంద్రం:- నున్న పి.యే.సి.ఎస్.ఆధ్వర్యంలో ఎన్.టి.అర్.సుజలస్రవంతి పథకం క్రింద నిర్మించిన మంచినీటి శుద్ధికేంద్రాన్ని, 2015,నవంబరు-25న ప్రారంభించారు. దీనిద్వారా 20 లీటర్ల శుద్ధిచేసిన త్రాగునీటిని 3 రూపాయలకే అందించెదరు.

గ్రామ పంచాయతీ

[మార్చు]
ఇది విజయవాడ రాబడి విభాగంలో విజయవాడ (గ్రామీణ) మండలం ప్రధాన కార్యాలయం.[1][4]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ రామాలయం

[మార్చు]

ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయo

[మార్చు]

నున్న గ్రామానికి శివారు గ్రామమైన బోడపాడు గ్రామంలో, శ్రీ భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం 2014,ఫిబ్రవరి-13,గురువారం నాడు, ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకం, పంచామృత కలశాభిషేకం, సహస్ర తులసీదళార్చన పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మూడు వేల మందికి అన్నదానం చేశారు.

శ్రీ అన్నపూర్ణా సమేత కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]
  • ఎంతో చరిత్రయున్న, నున్న గ్రామంలోని కుమ్మరి వీధిలో నెలకొన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, ఫాల్గుణ పౌర్ణమి రోజున, స్వామివారి కళ్యాణం, వేదమంత్రాల నడుమ, వైభవంగా నిర్వహించెదరు.
  • రాతికట్టడంతో ఉన్న ఈ ఆలయాన్ని ఒకటిన్నర కోట్ల రూపాయలతో పునఃప్రతిష్ఠ చేసేటందుకు, 2015,ఫిబ్రవరి-28వ తేదీనాడు, శంకుస్థాపన నిర్వహించారు. మహాబలిపురంలోని రాతి స్తంభాలను ప్రత్యేకంగా తయారుచేయిచుచున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ ఆలయాన్ని, కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ, 2015,జూన్-7వ తేదీ ఆదివారంనాడు, సందర్శించి, ఈ ఆలయం మహాక్షేత్రంగా వర్ధిల్లితుందని వ్యాఖ్యానించారు.
  • ఈ ఆలయానికి పూర్వ వైభవం తెచ్చేటందుకు కలకోటి నాగిరెడ్డి వంటి భూరి దాతలు నిర్వాహకులు ఎనలేని కృషిచేసారు. తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం నుండి, ముఖమండపానికి 16 స్తంభాలు తెచ్చారు. ఆ స్థంబాల మీద 24 బీములు వచ్చినవి. వాటిపఈ శివపురాణానికి చెందిన 248 శిల్పాలు చెక్కించారు. ఆ శిలపాలను రాజమండ్రికి చెందిన శ్రీనివాస అను శిల్పి చెక్కినారు. ఆయన ఇంతవరకు 150 ఆలయాలకు శిల్పాలు చెక్కిన ఘనుడు. ఈ శిల్పాలలో నంది, రెండు సింహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుచుచున్నవి. పునర్నిర్మించిన ఈ ఆలయంలో, 2016,మార్చి-28,ఫాల్గుణ బహుళ పంచమి, సోమవారంనాడు, శివలింగ ప్రతిష్ఠామహోత్సవం నిర్వహించెదరు. అదే రోజున 20,000 మందికి అన్నదానం నిర్వహించెదరు.

శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయం స్థానిక పంచాయతీ ఆఫీసు ప్రక్కన ఉంది.

శ్రీ పేరంటాళ్ళమ్మ తల్లి

[మార్చు]

నున్న గ్రామంలో వేంచేసియున్న శ్రీ పేరంటాళ్ళమ్మ తల్లి తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం చైత్రమాసంలో, ఐదు రోజులపాటు నిర్వహించెదరు. మొదటిరోజున ఉదయం 8 గంటలకు మానుపూజ, సాయంత్రం 5 గంటల నుండి మేళతాళాలతో దేవతామూర్తులైన వీరమ్మ, చింతయ్య, పార్వతమ్మ, గోపిరెడ్డి, నాగమ్మ, రామిరెడ్డి పేరంటాళ్ళను గ్రామ ప్రధాన వీధులలో ఊరేగించెదరు.రెండవ రోజున సాయంత్రం ఆరు గంటలకు భజన కార్యక్రమం, మూడవరోజున నంబళ్ళ యే అంకమ్మ తల్లి పురం ఏర్పాటు, నాల్గవరోజున అంకమ్మ తల్లి జీవిత చరిత్ర విశ్లేషణ, పూజాకార్యక్రమాలు, ఐదవ రోజున సిడిబండి ఊరేగింపు నిర్వహించెదరు. [6]

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం

[మార్చు]

సాయి మందిరం, పిట్టల వీరస్వామి కుటుంబం స్థలప్రధానం చేయగా, గ్రామంలో వితరణశీలుల దానాలతో, సహాయంతో, అందమగా, అద్భుతంగా సాయి బాబా మందిరం నిర్మించారు అందమైన శిరిడి సాయి మందిరం, నిత్య పూజలతో శోభాయమానంగా ఉంటుంది

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మొక్కజొన్న, చెఱుకు, పొగాకు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, మామిడి, జామ

ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]

కోలాటం పంతులుగా అందరికీ చిరపరిచితులైన శ్రీ కొండేటి కోటయ్య గారు ఈ గ్రామస్తులే. కోలాటం అంటే తెలియని ఆ రోజులలో, ఎంతోమంది విద్యార్థులకు ఈయన కోలాటం నేర్పినారు. విజయవాడ గ్రామీణ మండలంలోని గ్రామాలతోపాటు, చుట్టుప్రక్కల అనేక గ్రామాలలో గూడా "కోలాటం పంతులు"గా పేరు తెచ్చుకున్నారు. వీరు తన 77వ ఏట 29-11-2013న దివంగతులైనారు.[3]

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12390. ఇందులో పురుషుల సంఖ్య 6304, స్త్రీల సంఖ్య 6086, గ్రామంలో నివాస గృహాలు 2883 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 4184 హెక్టారులు.

2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,766. ఇందులో పురుషుల సంఖ్య 7328, స్త్రీల సంఖ్య 6848, గ్రామంలో నివాస గృహాలు 3917 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 4184 హెక్టారులు.

వ్యవసాయం, జల వనరులు

[మార్చు]

వరి, మామిడి, ముఖ్యమైన పంట.

వ్యాపారం

[మార్చు]

నున్నలో ఉన్న మార్కెట్ యార్డు చాలా పెద్దది.

మరి కొన్ని చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "District Census Handbook - Krishna" (PDF). Census of India. p. 17,36. Retrieved 18 January 2015.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.
  3. Reporter, Staff. "Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 27 March 2017.
  4. "Krishna District Mandals" (PDF). Census of India. p. 494,526. Retrieved 18 January 2015.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నున్న&oldid=4007906" నుండి వెలికితీశారు