Coordinates: 16°33′49″N 80°37′27″E / 16.563541°N 80.624137°E / 16.563541; 80.624137

అంబాపురం (విజయవాడ గ్రామీణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబాపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
అంబాపురం is located in Andhra Pradesh
అంబాపురం
అంబాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°33′49″N 80°37′27″E / 16.563541°N 80.624137°E / 16.563541; 80.624137
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం విజయవాడ గ్రామీణ
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ తోడేటి విజయకుమార్
జనాభా (2011)
 - మొత్తం 2,247
 - పురుషుల సంఖ్య 1,123
 - స్త్రీల సంఖ్య 1,124
 - గృహాల సంఖ్య 606
పిన్ కోడ్ 520012
ఎస్.టి.డి కోడ్ 0866

అంబాపురం లేదా అంబాపూర్ విజయవాడలోని ప్రాంతం

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఈ ఊరి పేరు అంబ + పురం అనే రెండు తెలుగు పదాల కలయికతో ఏర్పడింది. అంబ అనగా స్త్రీదేవత అయిన పార్వతి. నిఘంటువు ప్రకారం దీనికి అమ్మ అనే అర్ధం వచ్చేటట్లు పేర్కొన్నారు.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఇది సముద్రమట్టానికి 21 మీ,ఎత్తులో ఉంది

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో పి.ఎన్.టి కాలని, రామక్రిష్ణాపురం, అయోధ్యనగర్, ఫ్రైజర్ పేట గ్రామాలు ఊన్నాయి.

రవాణా సౌకర్యాలు[మార్చు]

చిట్టీనగర్, ఎపిఎస్ ఆర్టీసి బస్ స్టేషన్ విజయవాడ. రైల్వేస్టేషన్: మేజర్ రైల్వేజంక్షన్, విజయవాడ

విద్యా సౌకర్యాలు[మార్చు]

  • ఎ.ఎస్ఎం..జూనియర్ కాలేజి, నున్న.
  • నారాయణ జూనియర్ కాలేజి, గొల్లపూడి.
  • ఎన్.ఆర్.ఐ. ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పోతవరప్పాడు.
  • హార్వెస్ట్ ఇండియా పబ్లిక్ స్కూల్, అంబాపురం.

మౌలిక వసతులు[మార్చు]

త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామంలో ఒక నీటిశుద్ధి పథకం రూపుదిద్దుకున్నది. సురక్షిత త్రాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్.టి.ఆర్. సుజలధార నీటి శుద్ధి పథకంలోభాగంగా మంజూరయిన ఆర్.ఓ.ప్లాంటు నిర్మాణం పూర్తి అయినది. నాలుగు లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన ఈ పథకం ద్వారా 20 లీటర్ల ఫ్లూరైడ్ రహిత శుద్ధినీటిని, రెండు రూపాయలకే అందించెదరు. ఈ పథకాన్ని, 2014, అక్టోబరు-2న గాంధీ జయంతి రోజున ప్రారంభించారు. [5]

అంగనవాడీ కేంద్రం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కొడాలి దయాకర్, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచ్ గా బాడిశ నాగేంద్రమ్మ ఎన్నికైంది.

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు[మార్చు]

శ్రీ రామాలయం[మార్చు]

ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు.

జైన గుహాలయం[మార్చు]

అంబాపురం కొండల ప్రక్కన జైన గుహాలయం ఉంది. సా.శ.7, 8 శతాబ్దాల నడుమ వేంగీ చాళుక్యుల గులాలయ వాస్తు దీనిలో కనబడటం విశేషం.

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో, మూడురోజులపాటు అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాలు, 2017,మార్చి-17వతేదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ గ్రామములోని ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ ఉత్సవలు నిర్వహించుచున్నారు.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

మూలాలు[మార్చు]


వెలుపలి లింకులు[మార్చు]