కానూరు (పెనమలూరు)
Jump to navigation
Jump to search
కానూరు | |
— జనగణన పట్టణం — | |
శివాలయం, కానూరు | |
అక్షాంశరేఖాంశాలు: 16°29′42″N 80°41′21″E / 16.495071°N 80.689177°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | పెనమలూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | తుమ్మల సోమయ్య |
జనాభా (2011) | |
- మొత్తం | 49,006 |
- పురుషుల సంఖ్య | 26,574 |
- స్త్రీల సంఖ్య | 22,432 |
- గృహాల సంఖ్య | 11,330 |
పిన్ కోడ్ | 520 007 |
ఎస్.టి.డి కోడ్ | 0866 |
కానూరు, కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం లోని జనగణన పట్టణం. ఇది సముద్రమట్టంనుండి 19 మీ.ఎత్తులో ఉంది
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పట్టణ జనాభా మొత్తం 49,006. అందులో పురుషుల 26,574 మంది కాగా స్త్రీలు 22,432 మంది ఉన్నారు.గృహాల సంఖ్య 11,330
సమీప గ్రామాలు
[మార్చు]విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుడివాడ
సమీప మండలాలు
[మార్చు]కంకిపాడు, విజయవాడ, విజయవాడ గ్రామీణ, తాడేపల్లి
రవాణా సౌకర్యాలు
[మార్చు]బస్ 55, 55s, 2k, ప్రతి 10 నిమిషలుకు ఒక బస్ ఉంది. ఆటొ కామయ్యథొపు నుండి - Rs.6/- రైల్వేస్టేషన్; విజయవాడ 13 కి.మీ
విద్యా సౌకర్యాలు
[మార్చు]- పి వి పి ఎస్ ఐ టి ఇంజినీరింగ్ కళాశాల
- వి ఆర్ సిద్దార్దా ఇంజినీరింగ్ కళాశాల.
- వై.వి.రావు.సిద్ధార్ధ బి.యి.డి.కళాశాల.
- మ౦డల పరిషత్ ప్రాథమిక పాఠశాల
- అన్నె శివనాగేశ్వరరావు, అరుణ జిలా పరిషత్ హైసూలు
- కె.సి.పి.సిద్ధార్ధ ఆదర్శ పాఠశాల.
మౌలిక వసతులు
[మార్చు]ఆరోగ్య సంరక్షణ
[మార్చు]- నాగర్జున వైద్యశాల, 2.Dr.భాస్కరు, 3.తొలెతి శ్రీనివసరావు, 4.ప్రభుత్వ వైద్యశాల, 5.ఆయుర్వేద వైద్యశాల, 6.పశువుల వైద్యశాల
విద్యుత్తు
[మార్చు]ఈ గ్రామంలో 33/11 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషను ఉంది.
త్రాగునీటి సౌకర్యం
[మార్చు]స్థానిక సనత్ నగర్ లోని 8 మినార్ మసీదు కూడలిలో ఏర్పాటుచేసిన శుద్ధినీటి కేంద్రాన్ని (Mineral ater Plant), 2015, సెప్టెంబరు-27న ప్రారంభించారు.
కార్యాలయాలు, పరిశ్రమలు
[మార్చు]- నవతా ట్రాన్స్‌పోర్టు కేంద్ర కార్యాలయం కానూరులో ఉంది.
- కానూరులో క్యాటరింగ్ పరిశ్రమ ఎక్కువగా ఉంది.
గ్రామ పంచాయితి
[మార్చు]- కానూరు.. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పంచాయితి. కృష్ణా జిల్లాలో అత్యధిక ఓటర్లున్న గ్రామం. మొత్తం ఓటర్లు=30,999. దీనిలో పురుషులు15,748. స్త్రీలు15,241.
- ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో తుమ్మల సోమయ్య సర్పంచిగా ఎన్నికైనాడు.
కాలనీలు
[మార్చు]- మహాదేవపురం కాలనీ
- కె.సి.పి కాలనీ
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]సమీప దర్శనీయ ప్రదేశాలు
[మార్చు]- పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.
పట్టణం లోని దేవాలయాలు
[మార్చు]- శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం)
- మహాదేవపురం కాలనీ శివాలయం
- శ్రీ రామాలయం.
- శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గొపయ్య స్వామి దేవాలయం,కానూరు:- ఈ ఆలయంలో అమ్మవారి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం, ఫాలుణ మాసంలో పౌర్ణమి రోజున నిర్వహించెదరు.
- 5.శ్రీ సత్యభామా సమేత రాధా వేణుగోపాలస్వామివారి ఆలయం:- ఈ ఆలయం నిర్మించి 100 సంవత్సరాలకు పైగా అయినది. ఈ ఆలయ అబివృద్ధికి ప్రభుత్వం రు. 20 లక్షల నిధులు మంజూరు చేసింది. గ్రామస్థులు, దాతలు దీనిలో మూడవ వంతు నిధులు అందజేయాల్సి ఉండగా, ఇప్పటి వరకూ, ఇద్దరు దాతలు రు. 4.17లక్షలు విరాళంగా అందజేశారు. శ్రీ చిగురుపాటి జయరాం అను దాత ఒక్కరే రు. 6.66 లక్షలు విరాళంగా అందజేసినారు. ఈ ఆలయంలో కళ్యాణమండపం ఆధునీకరణకు, రాజగోపురం నిర్మాణానికీ, 2014, జూన్-7, శనివారం నాడు శంకుస్థాపన చేసారు.
- శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం.
- చర్చి
- మసీదు
- పెద్ద చెరువు
ప్రధాన వృత్తులు
[మార్చు]1. రీయల్ ఎస్టేట్ 2. వ్యవసాయం 3. ఆటొనగర్
ప్రముఖులు (నాడు/నేడు)
[మార్చు]- లయ (సినిమా నటి)