గోసాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోసాల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పెనమలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,325
 - పురుషుల సంఖ్య 3,074
 - స్త్రీల సంఖ్య 3,251
 - గృహాల సంఖ్య 1,758
పిన్ కోడ్ 521151
ఎస్.టి.డి కోడ్ 0866

గోసాల, కృష్ణా జిల్లా, పెనమలూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 151., యస్.ట్.డీ కోడ్=0866.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టంనుండి 19 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో పునాదిపాడు, ఈడుపుగల్లు, గొల్లగూడెం, కంకిపాడు, గంగూరు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

పెనమలూరు, విజయవాడ, గన్నవరం, తోట్లవల్లూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కంకిపాడు, పెనమలూరు నుండి రొడ్దువణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్; విజయవాడ 18 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

హెచ్.యమ్.కె పబ్లిక్ స్కుల్, పద్మజా మోడల్ స్కూల్, గోసాల

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

కర్మాగారాలు[మార్చు]

గోసాల, పోరంకిలలో తినుబండారాల తయారీ కర్మాగారాలు ఇంటింటికి బాగా విస్తరించాయి.

వృద్ధుల ఆశ్రమం[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి చోడవరపు సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ కోనేరు కోటేశ్వరరావు, ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.

శ్రీ సీతా రామస్వామివారి అలయం[మార్చు]

గోసాలలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2014, జూన్-27, శుక్రవారం నాడు, ఆలయంలో విగ్రహప్రతిష్ఠ నిర్వహించి 16 రోజులు పూర్తి అయిన సందర్భంగా, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలకు మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. సాయత్రం ఆలయపూజారులు, అంతకుముందు పుట్టమన్నులో కలపగా మొలకెత్తిన ధాన్యాలను, మంత్రోచ్ఛారణల నడుమ, సమీపంలోని కృష్ణా నదిలో కలిపినారు. [3]

శ్రీ భద్రావతీ సమేత శ్రీ భావనాఋషిస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

పద్మశ్రీ వేగే కోటేశ్వరమ్మ:- వీరు మాంటిస్సోరి కోటేశ్వరమ్మగా వినుతికెక్కినారు. [5]

గ్రామ విశేషాలు[మార్చు]

శ్రీమతి చాగర్లమూడి అరుణ:- ఎo,ఎస్.సి.బోటనీ చదివిన ఈమె, భర్త శ్రీ కోటేశ్వరరావు ఉద్యోగరీత్యా 30 సంవత్సరాల క్రితమే విదేశాలలో స్థిరపడినారు. అక్కడ ఈమె చిత్రలేఖనంపై ప్రతేక కోర్సుల ద్వారా శిక్షణ తీసుకొని, భారతీయ జీవనశైలితో పలు చిత్రాలు గీసి, వాటిపై వచ్చిన ఆదాయంతో, ఈమె మాతృభూమిపై మమకారంతో, ఇక్కడ అనేక అభివృద్ధికార్యక్రమాలు నిర్వహించుచున్నారు. [4]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 6,325 - పురుషుల సంఖ్య 3,074 - స్త్రీల సంఖ్య 3,251 - గృహాల సంఖ్య 1,758

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4983.[2] ఇందులో పురుషుల సంఖ్య 2468, స్త్రీల సంఖ్య 2515, గ్రామంలో నివాస గృహాలు 1174 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 333 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Penamaluru/Gosala". Retrieved 18 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, జూన్-26; 2వపేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, జూన్-28; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2016,ఫిబ్రవరి-9; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2017,జనవరి-26; 1&19 పేజీలు.

"https://te.wikipedia.org/w/index.php?title=గోసాల&oldid=2563519" నుండి వెలికితీశారు