పెద్దపులిపాక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెద్దపులిపాక
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పెనమలూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ పులిపాక ఇర్మియ
జనాభా (2001)
 - మొత్తం 2,571
 - పురుషుల సంఖ్య 1,221
 - స్త్రీల సంఖ్య 1,221
 - గృహాల సంఖ్య 625
పిన్ కోడ్ 521137
ఎస్.టి.డి కోడ్ 0866

పెద్దపులిపాక, కృష్ణా జిల్లా, పెనమలూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 137., ఎస్.టి.డి.కోడ్ = 0866.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఈ గ్రామాన్ని "పులిపాక" అని గూడా అంటారు.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టంనుండి 19 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

చలసాని నగర్ 2కి.మీ, పోరంకి 2 కి.మీ, అశోక్ నగర్ 2 కి.మీ, కృష్ణలంక 2 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

విజయవాడ, విజయవాడ గ్రామీణ, కంకిపాడు, తాడేపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

తాడిగడప, పోరంకి నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 10 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యయులు శ్రీ సి.హెచ్.వెంకటనారాయణ ఎంతగానో కృషిచేస్తున్నారు. వీరి కృషి వలన ఈ పాఠశాల విద్యార్థుల సంఖ్య 4 సంవత్సరాలలో 30 నుండి 130 కి పెరగటమే ఇందుకు నిదర్శనం. [9]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

సూరప్ప చెరువు:- పెదపులిపాక, చోడవరం, పెనమలూరు గ్రామాల మధ్య ఉన్న ఈ చెరువు 9 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. [2]

గ్రామంలో రాజకీయాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామానికి 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో శ్రీ పులిపాక ఇర్మియ సర్పంచిగా గెలుపొందారు.ఉప సర్పంచిగా శ్రీ ఇబ్రహీం ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ పరివార ప్రయుక్త కోదండరామాలయం[మార్చు]

ఈ ఆలయం శిథిలావస్థకు చేరటంతో, గ్రామస్థుల రు. 60 లక్షల విరాళంతో, నూతన ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయ, శిఖరధ్వజ పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు, 2014, జూన్-5,6,7 తేదీలలో నిర్వహించారు. ఈ మూడురోజులూ జరిగిన అధ్యాత్మిక కార్యక్రమాలలో, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2014, జూన్-7వ తేదీ శనివారం నాడు, వేదపండితులు నిర్ణయించిన శుభముహూర్తం, ఉదయం 8-45 గంటలకు విమానశిఖర, జీవధ్వజ, శ్రీ వినాయక, శ్రీ భక్తాంజనేయ, ద్వారపాలకా సహిత శ్రీ కోదండరామస్వామివార్ల శిలా విగ్రహ ప్రతిష్ఠాకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భాన్ని కనులారా వీక్షించదానికి, గ్రామంతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, పెద్ద సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. ధ్వజస్తంభం పునాదులలో పసుపు, కుంకుమ, బంగారం, వెండి, చిల్లర నాణ్యాలు నింపటానికి భక్తులు పోటీ పడినారు. అనంతరం ఆలయ మండపంలో శ్రీ సీతారాముల శాంతికల్యాణం జరిపినారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. [6]

ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు, 2015, మే-27వ తేదీనాడు వైభవంగా నిర్వహించారు. [8]

శ్రీ విజయరాజరాజేశ్వరీ శ్రీ విద్యాపీఠం[మార్చు]

  1. ఈ గ్రామంలోని శ్రీ విజయరాజరాజేశ్వరీ శ్రీ విద్యాపీఠంలో, 2013 నవంబరు 16,17,18వ తేదీలలో శ్రీ మహాపాశుపత మృత్యుంజయ రుద్రహోమం నిర్వహించెదరు. ఆలయ నిర్మాణం 6నెలలలో పూర్తి చేసెదరు. [4]
  2. ఈ ఆలయంలో శ్రీ విజయరాజరాజేశ్వరీదేవి విగ్రహప్రతిష్ఠా మాహాకుంభాభిషేకాలు, 2016, ఫిబ్రవరి-21,22 తేదీలలో (మాఘశుద్ధ చతుర్దశి, పౌర్ణమి ఆది, సోమవారాలలో) వైభవోపేతంగా నిర్వహించారు. [10]
  3. శ్రీ విజయరాజరాజేశ్వరీదేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవం 2017, ఫిబ్రవరి-21వతేదీ మంగళవారం నుండి 25వతేదీ శనివారం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా 21న, 108 కలశాలతో పూజ, హనుమాన్‌చాలీసా పారాయణం, శ్రీ లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. [11]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

  1. పెదపులిపాక గ్రామానికి చెందిన శ్రీ ముసునూరి బ్రహ్మేశ్వరరావు, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రాష్ట్రమంతటికీ కలిపి ఉన్న ఒకే ఒక సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సీటుని కైవసం చేసుకున్నారు. [2]
  2. పెదపులిపాక గ్రామంలో రు. 7.35 లక్షా వ్యయంతో నూతనంగా నిర్మించిన మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం భవనాన్ని, 2014, మార్చి-31న ప్రారంభించారు. ఈ భవన నిర్మానానికి రు. 2.85 లక్షల వ్యయాన్ని సంఘం భరించగా, మిగిలిన రు. 4.5 లక్షలనూ, ఈ గ్రామానికి చెందిన దాత శ్రీ ముసునూరి శ్రీనివాసరావు, తమ తండ్రి వరప్రసాద్ ఙాపకార్ధం, విరాళంగా అందజేశారు. [5]
  3. ఈ గ్రామంలోని తెల్ల రేషన్ కార్డుదారులందరూ ఎన్.టి.ఆర్ వైద్యసేవ పరిధిలోనికి వచ్చారు. ఉద్యోగులు సహా మరికొందరు ఆరోగ్య సంరక్షణ పథకం పరిధిలోనికి వచ్చారు. ఈ గ్రామంలో ఇంకా మిగిలిపోయిన 240 కుటుంబాలకు, మేడి మాధవి అను అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రురాలు, తన స్వంత గ్రామానికి ఆరోగ్య భరోసా కలిపించాలనే ఉద్దేశంతో, ఆరోగ్య రక్ష బీమా ప్రీమియం డబ్బులను చెల్లించారు. ఈ పథకం వలన, వీరందరికీ వేయి రకాల వ్యాధులకు, రాష్ట్రంలోని 432 కార్పొరేట్ ఆసుపత్రులలోనూ 80 ప్రభుత్వ ఆసుపత్రులలోనూ వైద్యం పొందేటందుకు అవకాశం కలుగుతుంది. దీనితో రాష్ట్రంలోనే అందరికీ ఆరోగ్య భరోసా బీమా ఉన్న తొలి గ్రామఘా చరిత్రకెక్కినది. [12]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2442.[2] ఇందులో పురుషుల సంఖ్య 1221, స్త్రీల సంఖ్య 1221, గ్రామంలో నివాస గృహాలు 625 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 969 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Penamaluru/Pedapulipaka". Retrieved 18 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-02.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రధానసంచిక; 2012, జూన్-22; 5వపేజీ. [3] ఈనాడు కృష్ణా/పెనమలూరు; 2013, ఆగస్టు-13; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/పెనమలూరు, 2013, నవంబరు-15; 1వపేజీ. [5] ఈనాడు విజయవాడ; 2014, ఏప్రిల్-1; 3వపేజీ. [6] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, జూన్-8; 9వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015, మే-13; 21వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015, మే-28; 21వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-11; 31వపేజీ. [10] ఈనాడు కృష్ణా; 2016, ఫిబ్రవరి-22; 10వపేజీ. [11] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017, ఫిబ్రవరి-20; 1వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2017, ఏప్రిల్-15; 10వపేజీ.