జూన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
<< జూన్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30
2024

జూన్ (June), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో ఆరవ నెల. ఈ నెల 30 రోజులును కలిగి ఉంది.జూలియన్, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జూన్ సంవత్సరంలో ఆరవ నెల.ఈ నెలకు రోమన్ దేవత జూనో పేరు పెట్టారు.ఆమె బృహస్పతి భార్య, గ్రీకు దేవత హేరాతో సమానం.ఈ నెల పేరు లాటిన్ వర్క్ యంగర్ వన్స్ నుండి వచ్చిందని మరొక నమ్మకం.యంగర్ వన్స్ అంటే “చిన్నవారు” అని అర్థం. మొదట రోమన్ క్యాలెండర్ ప్రకారం జూన్ నెల 30 రోజులతో నాలుగవ నెలగా ఉండేది. సా.శ.పూ. 450 లో క్యాలెండర్ సంస్కరణలు తరువాత 29 రోజుల పొడవుతో ఐదవ నెలగా అయ్యింది. జూలియన్ క్యాలెండర్లో జూన్ మళ్ళీ 30 రోజుల నిడివితో ఆరవనెలగా మారింది. [1]30 రోజుల పొడవు కలిగి ఉన్న నాలుగు నెలల్లో రెండవది. 31 రోజుల కన్నా తక్కువ పొడవు కలిగి ఉన్న ఐదు నెలలలో మూడవది.జూన్‌లో ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం, ఎక్కువ పగటి గంటలు ఉన్న రోజులు, దక్షిణార్ధగోళంలో శీతాకాలంలో తక్కువ పగటి గంటలు ఉన్న రోజులు (రెండు సందర్భాలలో ధ్రువ ప్రాంతాలను మినహాయించి) ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో జూన్ దక్షిణార్ధగోళంలో డిసెంబర్‌కు సమానమైన కాలానుగుణమైంది, దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో, సాంప్రదాయ ఖగోళ వేసవి ప్రారంభం జూన్ 21 (వాతావరణ వేసవి జూన్ 1 నుండి ప్రారంభమైంది).దక్షిణార్ధగోళంలో, వాతావరణ శీతాకాలం జూన్ 1 న ప్రారంభమవుతుంది.[2]

వేసవి సెలవుల తరువాత మళ్ళీ పాఠశాలలు తెరచే నెల ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో సాధారణంగా జూన్ 10 - 13 మధ్య పాఠశాలలు తెరుస్తారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల్లో నైఋతి ఋతుపవనాలు ప్రవేశించే నెల కూడా ఇదే. సాధారణంగా జూన్ మొదటి రెండవ వారంలో తొలకరి వానలు కురుస్తాయి.

బడికి వెళ్తున్న బాలికలు

కొన్ని ముఖ్యదినోత్సవాలు

[మార్చు]

జూన్ నెలలో ఇవి కొన్ని ముఖ్యమైన జాతీయ,అంతర్జాతీయ దినోత్సవాలుగా గుర్తించబడ్డాయి.[3][4]

జూన్ 1

[మార్చు]
  • ప్రపంచ పాల దినోత్సవం:ఇది పాడి రంగం సుస్థిర అభివృద్ధికి సహాయపడటం, ఆర్థిక అభివృద్ధికి సమాజంలో పాలు, ఇతర పాల ఉత్పత్తుల సహకారాన్ని గుర్తించింది.
  • ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం:ఇది ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులను వారి నిస్వార్థ ప్రేమ, పిల్లల పట్ల జీవితకాల మద్దతు కోసం గౌరవించటానికి గుర్తుగా జరుపుతారు.

జూన్ 2

[మార్చు]
  • అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ దినోత్సవం:1975 జూన్ 2 న 100 మంది సెక్స్ వర్కర్లు కలిసి వచ్చి వారి అగౌరవమైన పని, పరిస్థితులు, నీతి గురించి ఆందోళన వ్యక్తం చేశారు.ఆ సందర్బంగా దీనిని గుర్తించారు.
  • తెలంగాణ అవతరణ దినోత్సవం:పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలతో 29 వ రాష్ట్రం గుర్తించబడిన రోజుకు జ్ఞాపకార్థంగా తెలంగాణ ప్రజలు జరుపుకుంటారు.[5]

జూన్ 3

[మార్చు]
  • ప్రపంచ సైకిల్ దినోత్సవం: రవాణా మార్గంగా సైకిళ్ల బహుముఖ ప్రజ్ఞ, పర్యావరణ అనుకూల స్వభావాన్ని, ఆరోగ్యంగా ఉండటానికి గుర్తించడానికి ఈ రోజును యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రకటించింది.

జూన్ 4

[మార్చు]
  • దురాక్రమణ బాధితుల అంతర్జాతీయ దినం:జీవితంలో ఇలాంటి వేధింపులను ఎదుర్కొన్నఅమాయక పిల్లల గురించి అవగాహన పెంచడానికి, సమాజం నుండి ఇటువంటి అభ్యాసాన్ని నిర్మూలించడానికి దురాక్రమణ బాధితుల అంతర్జాతీయ దినోత్సవం జరుపుతారు.

జూన్ 5

  • ప్రపంచ పర్యావరణ దినోత్సవం:పర్యావరణం మానవాళి మనుగడకు ముఖ్యం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంవత్సరంలో గుర్తించదగిన రోజు.ఈ రోజున మన చుట్టూ ఉన్న పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అనేక అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి.

జూన్ 7

[మార్చు]
  • ప్రపంచ ఆహార భద్రత దినం:ఆహారం, దాని భద్రత మానవాళి జీవితాలకు చాలా ముఖ్యమైంది. అందువల్ల కలుషితమైన ఆహారం, కలుషిత నీటి వలన కలిగే హానికరమైన పరిణామాల గురించి తెలుసుకోవటానికి, ఈ రోజు ఆహార భద్రత దినోత్సవం జరుపుతారు. అలాగే, ఫుడ్ పాయిజనింగ్, కామెర్లు వంటి వ్యాధులను కూడా నిర్మూలించడం దీని లక్ష్యం.

జూన్ 8

[మార్చు]
  • ప్రపంచ మెదడు కణితి దినం: బ్రెయిన్ ట్యూమర్ వంటి వ్యాధి పట్ల ప్రజలకు వ్యాధి నివారణ, దాని చికిత్స గురించి అవగాహనా దృష్టిని కలిగించటానికి ‘ది వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే’ పాటిస్తారు.
  • ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం:సముద్రం, జలజీవుల పట్ల ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున సముద్ర పరిరక్షణకు,సముద్రాలు నీటి కాలుష్యం నుండి నిరోధించడానికి అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి.

జూన్ 12

[మార్చు]
  • బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం: 14 సంవత్సరంలలోపు బాలబాలికలను కార్మికులుగా వాడుకోవటానికి వ్యతిరేకంగా బాల కార్మికులకు వ్యతిరేకంగా దినోత్సవం జరుపుతారు.

జూన్ 14

[మార్చు]
  • ప్రపంచ రక్తదాతల దినోత్సవం: రక్తదానం లేదా రక్తదాత గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని జరుపుకుంటారు.అలాగే, సామాజిక ప్రయోజనం కోసం రక్తదాతలందరూ చేసిన కృషికి గుర్తింపు పొందుతారు.

జూన్ 15

[మార్చు]
  • ప్రపంచ పవన దినం: విద్యుత్ ఉత్పత్తి వంటి కార్యకలాపాలకు ప్రత్యామ్నాయంగా, పవన శక్తిని ప్రోత్సహించడానికి ప్రపంచ పవన దినోత్సవాన్ని జరుపుతారు.
  • ప్రపంచ పెద్దల దుర్వినియోగ అవగాహన దినం:పెద్దల శ్రేయస్సు,వారి ప్రాముఖ్యత గురించి యువ మనస్సులకు అవగాహన కల్పించడానికి ప్రపంచ పెద్దల దుర్వినియోగ అవగాహన దినోత్సవం జరుపుకుంటారు.

జూన్ 17

[మార్చు]
  • ఎడారీకరణ, కరువుతో పోరాడటానికి ప్రపంచ దినోత్సవం:కరువుల పరిణామాలు,ఎడారీకరణను ఎదుర్కోవటానికి మార్గాల గురించి అవగాహన కల్పించడానికి. ఎడారీకరణ, కరువుకు సంబంధించిన సమస్యలపై పోరాడటానికి ఈ రోజున వివిధ అసాధారణ మార్గాలు ద్వారా బోధిస్తారు. ఈ రోజును ఐరాస సర్వసభ్య సమావేశం అభివృద్ధి చేసింది. ఇది1994 నుండి జరుగుతుంది.

జూన్ 18

[మార్చు]
  • ఆటిస్టిక్ ప్రైడ్ డే:ఈ రోజున ఆటిస్టిక్ పిల్లలు, పెద్దలు వారి కుటుంబాలతో కలిసి అన్ని జీవిత పోరాటాలు, కష్టాలతో సంబంధం లేకుండా వారి జీవితాలను జరుపుకుంటారు.

జూన్ 18

[మార్చు]
  • అంతర్జాతీయ విహర దినోత్సవం:ఈ రోజును కుటుంబం, స్నేహితులతో కలసి ఆరుబయట విలువైన సమయాన్ని ఆస్వాదించడానికి ‘పిక్నిక్ డే’ జరుపుకుంటారు.

జూన్ 19

[మార్చు]
  • ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినం: సికిల్ సెల్ డిసీజ్ అనేది ఒక రకమైన వ్యాధి. ఇది మన శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిని భారీగా ప్రభావితం చేస్తుంది. ఇది మన శరీరంలో ఆక్సిజన్‌ను తగ్గిస్తుంది.దీని మీద తగిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పిస్తారు.

జూన్ 20

[మార్చు]
  • ప్రపంచ శరణార్థుల దినోత్సవం:ఈ రోజు ప్రతిరోజూ శరణార్థులు ఎదుర్కొంటున్న పరీక్షలు కష్టాలను గురించి ఈ రోజు విశదీకరిస్తుంది. ప్రజలు శరణార్థులకు సంక్షేమానికి ఎలా తోడ్పడాలి అనే దానిపై అవగాహన కల్పిస్తారు

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం

జూన్ 21

[మార్చు]
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం:ప్రతి సంవత్సరం జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన దైనందిన జీవితంలో యోగా చేర్చడం గురించి అవగాహన పెంచడానికి ఈ రోజు జరుపుకుంటారు.

23 జూన్

[మార్చు]
  • అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం: సాధారణ జీవితంలో క్రీడల యొక్క ప్రాముఖ్యతపై ప్రజల దృష్టిని ఆకర్షించడానికి జరుపుకుంటారు.
  • ఐక్యరాజ్యసమితి ప్రజా సేవా దినోత్సవం:సమాజం పట్ల ప్రభుత్వ ఉద్యోగుల కృషిని గుర్తించి, సులభతరం చేయడానికి ఐక్యరాజ్యసమితి ప్రజా సేవా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
  • అంతర్జాతీయ వితంతువు దినం:దురదృష్టవశాత్తు చాలా మంది ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న వితంతువులకు మానవ హక్కుల గురించి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ వితంతు దినోత్సవం జరుపుతారు

జూన్ 26

[మార్చు]
  • మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం:మాదకద్రవ్య రహిత సమాజాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ దీనిని సృష్టించింది.
  • హింస బాధితులకు మద్దతుగా అంతర్జాతీయ దినోత్సవం:శిక్ష, అమానవీయ చికిత్సలకు సంబంధించిన హింస,ఇతర భయానక కార్యకలాపాలను ఎదుర్కోవటానికి ‘హింస బాధితులకు మద్దతుగా దీనిని నిర్వహిస్తారు.

జూన్ 30

[మార్చు]
  • అంతర్జతీయ గ్రహశకల దినోత్సవం: సైబీరియన్ తుంగస్కా గ్రహశకలం గుర్తుకు, ప్రపంచ గ్రహశకల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున, గ్రహశకలాల అధ్యయనం గురించి అవగాహన కల్పించడానికి సంబంధించిన కార్యక్రమాలు ఆన్‌లైన్ విద్యను అందించడం ద్వారా యు.ఎన్. చేత నిర్వహించబడతాయి.

మూలాలు

[మార్చు]
  1. "The Month of June". www.timeanddate.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-29.
  2. "20 Juicy Facts About June". The Fact Site (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-06-01. Retrieved 2020-07-29.
  3. "Newsonline". News Online (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-28. Retrieved 2020-07-29.
  4. "June 2020: List of important National and International Days". Jagranjosh.com. 2020-06-03. Retrieved 2020-07-29.
  5. "Telangana Formation Day | ఆరేళ్ల తెలంగాణ.. నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం." News18 Telugu. 2020-06-02. Retrieved 2020-07-29.

వెలుపలి లంకెలు

[మార్చు]
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
"https://te.wikipedia.org/w/index.php?title=జూన్&oldid=4337218" నుండి వెలికితీశారు