ప్రపంచ పర్యావరణ దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ పర్యావరణ దినోత్సవం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం
అధికారిక పేరుఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యావరణ దినోత్సవం
యితర పేర్లుఏకో డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, WED (world environment day)
రకంఅంతర్జాతీయ
ప్రాముఖ్యతపర్యావరణ పరిరక్షణ అవగాహన
జరుపుకొనే రోజుజూన్ 5
వేడుకలుపర్యావరణ పరిరక్షణ

ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు.[1] పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా నడపబడుతుంది.[2] ఈ రోజున మానవ పర్యావరణం పై ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభించింది. 1972 జూన్ 5 వ తేది నుంచి 16 వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవమును జూన్ 5 తేదిన వేర్వేరు నగరాలలో విభిన్న రీతులలో అంతర్జాతీయ వైభవంగా జరుపుకుంటున్నారు.

మునుపటి సంఘటనలు[మార్చు]

ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు ఆతిధ్యమిచ్చిన నగరాలు:

ఇవి కూడా చూడండి[మార్చు]

ధరిత్రి దినోత్సవం

మూలాలు[మార్చు]

  1. "ఐక్యరాజ్య సమితి". యూ యెన్ అధికారిక.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Environment, U. N. (2019-04-12). "World Environment Day". World Environment Day (in ఇంగ్లీష్). Retrieved 2021-06-05.