ప్రపంచ యోగ దినోత్సవం
అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారు. భద్రతా కమిషన్‌లో శాశ్వత సభ్యులుగా ఉన్న భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు కూడా ఈ తీర్మానానికి సహ ప్రతినిధులు. విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014 లో ఆమోదించబడింది. 2015 జూన్ 21 న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు.[1] జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోదీ సూచించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు
[మార్చు]2015
[మార్చు]ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2015 జూన్ 21న నిర్వహించారు. భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించారు. ఆ వేడుకలకు చాలా దేశాలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.[2] 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు మొత్తం 35,985 మంది యోగా చేసి రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పారు.[3][4] అప్పటి నుండి ప్రతి సంవత్సరం భారతదేశంలోని, ప్రపంచంలోని నగరాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.[5][6][7][8][9][10]
2016
[మార్చు]రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవన్ని చండీగఢ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచుమించు 30,000 హాజరయ్యారు.[11]
2017
[మార్చు]మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవన్ని ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.50వేలమంది మధ్య యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.[12][13] అలాగే, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీలోని కనౌట్ ప్రాంతంలో యోగా వేడుకల్లో పాల్గొన్నారు.
2018
[మార్చు]4 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో పాల్గొన్నారు. ఈ ఏడాది శాంతి కోసం యోగా పేరుతో నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు కలిసి దేశవ్యాప్తంగా దాదాపు 5,000 యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. డెహ్రాడూన్‌లో కార్యక్రమంలో 55 వేల పాల్గొన్నారు.
2019
[మార్చు]5 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జార్ఖండ్ రాజధాని రాంచీలో నిర్వహించారు.[14] ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, యోగా గురువులు, సహా దాదాపు 40,000 మంది హాజరయ్యారు.[15]
2020
[మార్చు]ఆరవ అంతర్జాతీయ యోగ దినోత్సవం కొవిడ్-19 వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎవరి ఇళ్లలో వారు నిర్వహించుకోవాలని ‘ఆయుష్’ మంత్రిత్వశాఖ సూచించింది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా యోగా వేడుకల్లో ఈసారి బృందాలుగా పాల్గొనే అవకాశం లేనందున, సాంకేతిక వేదికల(డిజిటల్ ప్లాట్‌ఫామ్స్) ద్వారా ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.[16][17]
2024
[మార్చు]పదవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్లొన్నారు.శారీరక మానసిక ఆరోగ్యం ప్రదాయనిగా, ఒత్తిడి నివారిణిగా యోగా విశిష్టత ఎనలేనిది ప్రధాని అన్నారు.[18]
2025
[మార్చు]ఆంధ్రప్రదేశ్ లో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు.
మూలాలు
[మార్చు]- ↑ "RESS RELEASE : United Nations General Assembly adopts Resolution on International Day of Yoga with a record number of 175 country co-sponsors". Archived from the original on 2015-01-09.
- ↑ Network, Newsroom24x7 (2015-06-21). "Massive turnout on International Day of Yoga in India". Newsroom24x7 (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-26. Retrieved 2020-06-24.
{{cite web}}:|first=has generic name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Largest yoga lesson". Guinness World Records (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-06-24.
- ↑ http://www.ndtv.com/cheat-sheet/sushma-swaraj-addresses-the-united-nations-in-new-york-on-international-yogaday-highlights-773899
- ↑ "PM Modi To Attend International Yoga Day At Chandigarh". NDTV. 22 May 2016. Retrieved 13 June 2016.
- ↑ Shylaja Varma (21 June 2017). "International Yoga Day 2017: Rainy Start To Yoga Day, PM Narendra Modi Leads Asanas In Lucknow – Highlights". Ndtv.com. Retrieved 12 April 2018.
- ↑ "International Yoga Day 2017: A Look at the Celebrations Around the World". Zenyogastrap.com. 7 June 2016. Archived from the original on 20 జూన్ 2018. Retrieved 24 జూన్ 2020.
- ↑ "International Yoga Day: Record 10,000 people participate in event in China's largest ever congregation". Firstpost.com. 25 June 2017. Retrieved 12 April 2018.
- ↑ "International Yoga Day | Rajasthan records biggest yoga gathering". The Hindu (in Indian English). 21 June 2018. ISSN 0971-751X. Retrieved 15 April 2019.
- ↑ "International Yoga Day 2019: 5th International Yoga Day Celebrations in Chandigarh" (in English). Archived from the original on 21 జూన్ 2019. Retrieved 21 June 2019.
{{cite web}}: CS1 maint: unrecognized language (link) - ↑ "PM Modi To Attend International Yoga Day At Chandigarh". NDTV.com. Retrieved 2020-06-24.
- ↑ Shylaja Varma (21 June 2017). "International Yoga Day 2017: Rainy Start To Yoga Day, PM Narendra Modi Leads Asanas In Lucknow – Highlights". Ndtv.com. Retrieved 12 April 2018.
- ↑ "Thousands join India's Modi, hit the mat for International Yoga Day". Reuters.com. 21 June 2017. Retrieved 12 April 2018.
- ↑ https://timesofindia.indiatimes.com/india/live-updates-pm-modi-to-lead-international-yoga-day-celebrations-in-ranchi/liveblog/69883012.cms
- ↑ https://www.jagranjosh.com/current-affairs/international-yoga-day-2019-narendra-modi-will-perform-yoga-in-ranchi-1561006441-1
- ↑ "International Yoga Day 2020 India: Theme,Importance,History,Quotes". S A NEWS (in అమెరికన్ ఇంగ్లీష్). 19 June 2020. Retrieved 20 June 2020.
- ↑ "International Yoga Day 2020: Video Contest, Yoga at Home, Yoga with Family Theme Campaign Launched Get Details". Jagranjosh.com. 18 June 2020. Retrieved 20 June 2020.
- ↑ Desk, HT Telugu. "International Yoga Day 2024: అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారు?". Hindustantimes Telugu. Archived from the original on 2024-06-21. Retrieved 2024-06-21.
{{cite web}}:|last=has generic name (help)