అరవింద్ కేజ్రివాల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అరవింద్ కేజ్రివాల్
ArvindKejriwal2.jpg
8వ ఢిల్లీ ముఖ్యమంత్రి
పదవీ కాలం
రెండవ పర్యాయం
In office
15 ఫిబ్రవరి 2014 – ప్రస్తుత
Preceded by రాష్ట్రపతి పాలన
7వ ఢిల్లీ ముఖ్యమంత్రి
పదవీ కాలం
మొదటి పర్యాయం
In office
28 డిసెంబర్ 2013 – 14 ఫిబ్రవరి 2014
Preceded by షీలా దీక్షిత్
శాసనసభ్యుడు
పదవీ కాలం
రెండవ పర్యాయం
In office
14 ఫిబ్రవరి 2014 – ప్రస్తుతం
నియోజకవర్గం న్యూ ఢిల్లీ
శాసనసభ్యుడు
పదవీ కాలం
మొదటి పర్యాయం
In office
డిసెంబర్ 2013 – ఫిబ్రవరి 2015
Preceded by షీలా దీక్షిత్
నియోజకవర్గం న్యూ ఢిల్లీ
వ్యక్తిగత వివరాలు
జననం (1968-08-16) ఆగష్టు 16, 1968 (వయస్సు: 47  సంవత్సరాలు)
హిసార్, హర్యానా
భాగస్వామి సునీత కేజ్రివాల్
సంతానం 2
నివాసం ఢిల్లీ,భారతదేశం
Alma mater ఐఐటి,ఖరగ్‌పూర్

అరవింద్ కేజ్రివాల్ భారతీయ సామాజికవేత్త మరియు రాజకీయ నాయకుడు. హర్యానా లో జన్మించిన కేజ్రివాల్ ఐఐటి ఖరగపూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులు అయ్యారు. మొదట భారతీయ రెవెన్యూ సర్వీసులో కొంతకాలం పనిచేశారు. జన లోకపాల్ బిల్లు కోసం అన్నా హజారే తో కలిసి చేసిన పోరాటం మరియు సమాచార హక్కు చట్టం కోసం చేసిన పోరాటంతో ఈయన దేశవ్యాప్తం గా మంచి ప్రాముఖ్యత సంపాదించారు. సమాచార హక్కు చట్టం తీసుకురావటం మరియు పేదవారి స్థోమత పెంచడానికి చేసిన కృషికి 2006 లో రామన్ మెగసెసే పురస్కారం లభించింది. 2012 లో ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ స్తాపించిన తరువాత జరిగిన తొలి ఎన్నికలైన 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఢిల్లీ 7వ ముఖ్యమంత్రిగా పదవి చేబట్టారు. కేజ్రివాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో అత్యంత పిన్నవయస్కుడు.[1]

బాల్యము[మార్చు]

అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.గోబింద్ రామ్ కేజ్రివాల్ ను గీతా దేవికి పుట్టిన మూడు పీల్లలలో పెద్ద వాడు. ఐ.ఐ.టీ. ఖరగ్పూర్ లో ఇంజనీరింగ్ చదువుకున్నాడు.

ఉద్యోగము[మార్చు]

ఇంజనీరింగ్ పూర్తవగానే టాటా స్టీల్ కంపెనీలో, ౧౯౮౯లో జేరాడు. ౧౯౯౨లో మానేసాడు. అప్పుడే సివిల్ సర్వీసెస్ పరీక్షలు వ్రాసి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. డిల్లీలోని ఆదాయపు పన్ను కార్యాలయంలో జాయింట్ కమీషనర్ ఉద్యోగంలో చేరారు.

సామాజిక పోరాటాలు[మార్చు]

పరివర్తన్[మార్చు]

1999 డిసెంబర్ లో కేజ్రివాల్ రెవెన్యూ సర్వీసులో ఉండగానే ,పరివర్తన్ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి ఢిల్లీలోని ప్రజలకు పన్నులు, విద్యుత్తు, ఆహార పంపిణి విషయాల గురించి అవగాహన కలిగించడం లో సహాయం చేశారు. కేజ్రివాల్ "మార్పు చిన్న చిన్న విషయాలతో ప్రారంభం అవుతుంది "అని నమ్మేవారు. 2008 లో ఈ సంస్థ ఢిల్లీ నకిలీ రేషను కార్డు స్కాం ను బట్ట బయలు చేసింది.

సమచార హక్కు చట్టం[మార్చు]

సమచార హక్కు చట్టం వినియోగించి ఢిల్లీ లోని ప్రభుత్వ సంస్థలలో అవనినీతిని వెలికితీశారు.

జన లోక్ పాల్ బిల్లు[మార్చు]

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే తో కలిసి జన లోక్ పాల్ బిల్లు బిల్లు కోసం పోరాడారు.

రాజకీయ జీవితం[మార్చు]

2012 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు[మార్చు]

2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీ ని ఢిల్లీలో స్థాపించారు. 2013 డిసెంబర్ 4 న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి గా పనిచేసిన షీలా దీక్షిత్ పై 25,864 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు[2].జన్ లోక్‌పాల్ బిల్లు ఢిల్లీ అసెంబ్లీలో ఆమోదం పొందకపోవడంతో కేజ్రీవాల్ 49 రోజుల తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.[3]

2014 పార్లమెంటు ఎన్నికలు[మార్చు]

2014 పార్లమెంటు ఎన్నికలలో వారణాసి పార్లమెంటు బరిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పై అరవింద్ కేజ్రివాల్ పోటిపడ్డాడు.[4].ఢిల్లీలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి తప్పుకున్న కేజ్రీవాల్ వారణాసిలో భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్రమోడీకి పోటీగా బరిలోకి దిగారు. కానీ ఆయన చేతిలో 3,71,784 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు[5].[6]

2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు[మార్చు]

2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుండి నదిపించారు. 70 స్థానాలలో 67 స్థానాలు పొంది అనూహ్య విజయం సాధించడంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు. కేజ్రివాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 31,583 వోట్ల ఆధిక్యంతో గెలిచారు.

రచనలు[మార్చు]

2012 లో స్వరాజ్ అనే పుస్తకాన్ని ప్రచురించారు.

బిరుదులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్
 2. http://www.thehindu.com/news/cities/Delhi/aap-to-play-the-role-of-constructive-opposition-kejriwal/article5436803.ece
 3. కేజ్రీ..రాజీనామా
 4. http://www.sakshi.com/news/national/i-will-defeat-narendra-modi-never-join-bjp-arvind-kejriwal-118549
 5. http://www.firstpost.com/politics/live-modi-beats-kejriwal-in-varanasi-nda-leads-in-332-1524969.html
 6. http://eciresults.nic.in/ConstituencywiseS2477.htm?ac=77
 7. "CNN-IBN Indian of the Year". Retrieved 25 August 2011. 
 8. "Indian of the Year: Big winners". New Delhi: IBNLive.in.com. Jun 20, 2007. Retrieved September 24 2013.  Check date values in: |accessdate= (help)
 9. "Distinguished Alumnus of IIT Kharagpur". Retrieved 22 August 2011. 
 10. "Association for India's Development". Retrieved 1 November 2011. 
 11. "ET Awards: The top 10 of 2010". The Economic Times. 7 October 2010. Retrieved 30 June 2013. 
 12. "NDTV Indian of the Year 2011". NDTV. 18 October 2011. Retrieved 30 June 2013. 
 13. "సిఎన్ఎన్-ఐబిఎన్ ఇండియన్ అఫ్ ది ఇయర్". cnn-ibn. 20 December 2013. 
 14. "Indian Politician Arvind Kejriwal Wins TIME 100 Readers’ Poll". టైమ్స్. April 23, 2014.