షీలా దీక్షిత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షీలా దీక్షిత్
షీలా దీక్షిత్

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి
పదవీ కాలము
3 డిసెంబర్ 1998 – 8 డిసెంబర్ 2013
ముందు సుష్మా స్వరాజ్
తరువాత అరవింద్ కేజ్రివాల్

శాసనసభ సభ్యులు
న్యూఢిల్లీ
గోల్ మార్కెట్ (1998-2008)
పదవీ కాలము
3 డిసెంబర్ 1998 – 8 డిసెంబర్ 2013
ముందు కీర్తి ఆజాద్
తరువాత అరవింద్ కేజ్రివాల్

పదవీ కాలము
1984 – 89
ముందు చహోతేయ్ సింగ్ యాదవ్
తరువాత చహోతేయ్ సింగ్ యాదవ్

భారత ప్రతినిధి బృందంలో సభ్యురాలు
మహిళల హోదా ఐక్యరాజ్యసమితి కమిషన్
పదవీ కాలము
1984 – 89
ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ
రాజీవ్ గాంధీ

వ్యక్తిగత వివరాలు

జననం (1938-03-31) 1938 మార్చి 31 (వయస్సు: 80  సంవత్సరాలు)
కపుర్తల, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి వినోద్ దీక్షిత్
సంతానము 2
పూర్వ విద్యార్థి ఢిల్లీ విశ్వవిద్యాలయం
13 ఆగష్టు, 2012నాటికి

మూలం: Government of Delhi

షీలా దీక్షిత్ 1998 నుండి 2013 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన భారతదేశ రాజకీయ నాయకురాలు. ఈమె భారత జాతీయ కాంగ్రెసు పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన మూడు వరుస ఎన్నికలలో విజయాన్ని సాధించి రికార్డ్ సృష్టించారు. ఈమె ఢిల్లీ శాసనసభలో న్యూఢిల్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈమె డిసెంబరు 2013 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయింది.

ప్రారంభ సంవత్సరాలు[మార్చు]

షీలా దీక్షిత్ ఒక పంజాబీ ఖత్రి కుటుంబంలో భారతదేశం యొక్క పంజాబ్ రాష్ట్రంలో కపుర్తలలో జన్మించారు. ఈమె న్యూఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ స్కూల్ లో కాన్వెంట్ విద్యనభ్యసించారు మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మిరాండా హౌస్ నుండి చరిత్రలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీలో పట్టభద్రులైనారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవో జిల్లాకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) గా పనిచేసిన వినోద్ దీక్షిత్ తో ఈమె వివాహం జరిగింది.

వృత్తి జీవితం[మార్చు]

దీక్షిత్ మహిళా సంఘం అధ్యక్షురాలిగా అయ్యారు మరియు 1970 లలో ఢిల్లీలో మహిళల పని కోసం అత్యంత విజయవంతమైన వసతిగృహాలు రెండు ఏర్పాటయ్యేందుకు కారణమయ్యారు. ఈమె తరువాత ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా పనిచేశారు.

రాజకీయ జీవితం[మార్చు]

1984 మరియు 1989 మధ్య కాలంలో, ఈమె ఉత్తరప్రదేశ్ కనౌజ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంట్ సభ్యురాలిగా, ఈమె లోక్ సభ అంచనాల కమిటీకి సేవలందించారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]