రవీశ్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవీశ్ కుమార్
జననం
రవీష్ కుమార్ పాండే

(1974-12-05) 1974 డిసెంబరు 5 (వయసు 49)
జిత్వార్పూర్, తూర్పు చంపారన్, బీహార్, భారతదేశం
విద్యాసంస్థఢిల్లీ విశ్వవిద్యాలయం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్
వృత్తిజర్నలిస్ట్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఎన్డీటీవీ (1994-2022)
జీవిత భాగస్వామినయన దాస్ గుప్తా
పిల్లలు2
తల్లిదండ్రులు
  • బలిరామ్ పాండే (తండ్రి)
పురస్కారాలు• రామన్ మెగసెసే అవార్డు (2019)

• రామ్నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డులు (2013, 2017)

• రెడ్ ఇంక్ అవార్డు (2016)

రవీశ్‌ కుమార్‌ (ఆంగ్లం: Ravish Kumar; 1974 డిసెంబరు 5) ఒక భారతీయ పాత్రికేయుడు, రచయిత, మీడియా వ్యక్తి. అతను ఎన్డీటీవి ఇండియాకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేశాడు.[1] అతను ఆ ఛానెల్ ప్రధాన వీక్‌డే షో ప్రైమ్ టైమ్, హమ్ లాగ్, రవీశ్ కి రిపోర్ట్, దేస్ కీ బాత్‌తో సహా అనేక కార్యక్రమాలను హోస్ట్ చేసాడు.[2]

రవీశ్ కుమార్ రెండుసార్లు రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డును ఉత్తమ జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా పొందాడు. 2019లో రామన్ మెగసెసే అవార్డును అందుకున్న ఐదవ భారతీయ జర్నలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.[3][4]

బాల్యం, విద్య

[మార్చు]

రవీశ్ కుమార్ 1974 డిసెంబరు 5న బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో అరేరాజ్ సమీపంలోని జిత్వార్‌పూర్ గ్రామంలో జన్మించాడు.[5][6][7] పాట్నాలోని లయోలా హై స్కూల్ లో అతను ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్లాడు. ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న దేశ్‌బంధు కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. అతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (IIMC) నుండి హిందీ జర్నలిజంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందాడు.[8]

కెరీర్

[మార్చు]

1994 నుండి 2022 వరకు రవీశ్ కుమార్ ఎన్డీటీవి ఇండియాలో ఉద్యోగంలో చేరి సీనియర్ డైరెక్టర్‌గా ఎదిగాడు.[9] అతను ఛానెల్ ప్రధాన వీక్‌డే షో ప్రైమ్ టైమ్, హమ్ లాగ్,[10] రవీశ్ కి రిపోర్ట్,[11] దేస్ కీ బాత్‌[12]తో సహా అనేక కార్యక్రమాలను హోస్ట్ చేశాడు.

ఎన్డీటీవీ ఛానల్ ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ 2022 నవంబరులో ఆ ఛానల్ డైరెక్టర్‌ పదవులకు రాజీనామా చేసారు. ఎన్డీటీవీ ప్రమోటింగ్‌ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను అదానీ కొనుగోలు చేయగా ఈ ఇద్దరూ నిష్క్రమించారు. ఇకపై ఎన్డీటీవి అదానీ గ్రూప్ సొంతం.[13][14] ఈ నేపథ్యంలో 2022 నవంబరు 30న రవీశ్ కుమార్ కూడా ఎన్డీటీవి నుండి వైదొలిగాడు.[15][16]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రవీశ్ కుమార్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ (LSR)లో చరిత్ర బోధించే నయన దాస్‌ గుప్తాను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కూతుళ్లు.[17]

మూలాలు

[మార్చు]
  1. PTI (9 September 2019). "Indian journalist Ravish Kumar receives 2019 Ramon Magsaysay Award". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 28 December 2019. Retrieved 13 April 2021.
  2. Puri, Anjali (2 December 2019). "Ravish Kumar: The rooted anchor". Business Standard (in ఇంగ్లీష్). Retrieved 13 April 2021.
  3. "Ramnath Goenka Excellence in Journalism Awards: Full list of winners". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 22 December 2017. Retrieved 14 May 2020.
  4. ""Truth Essential To Democracy": Ravish Kumar Receives Magsaysay Award". NDTV.com. Retrieved 7 December 2021.
  5. PTI (2 August 2019). "NDTV's Ravish Kumar wins the 2019 Ramon Magsaysay Award". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 13 April 2021.
  6. PTI (2 August 2019). "Journalist Ravish Kumar wins 2019 Ramon Magsaysay Award". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 13 April 2021.
  7. "Know about the elder brother of journalist Ravish Kumar". Jansatta. 16 October 2020.
  8. "दिल्ली में बंगाल की नयना पर दिल हार बैठे थे रवीश कुमार, तमाम मुश्किलों को पार कर रचाई शादी". Jansatta (in హిందీ). 4 August 2020. Retrieved 27 August 2020.
  9. "NDTV - The Company". NDTV. Retrieved 28 August 2016.
  10. "NDTV.com". www.ndtv.com. Retrieved 28 August 2016.
  11. "Ravish Ki Report". www.ndtv.com. Retrieved 2022-11-30.
  12. "Des Ki Baat". NDTV. Retrieved 24 July 2020.
  13. "Prannoy Roy: ఎన్డీటీవీకి ప్రణయ్ రాయ్ గుడ్‌బై.. ఇక ఎన్డీటీవీకి అదానీ మాటే శాసనం..! | NDTV founders Prannoy Roy and his wife Radhika Roy have resigned as the directors ssr". web.archive.org. 2022-11-30. Archived from the original on 2022-11-30. Retrieved 2022-11-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  14. "Media freedom fears in India after Modi ally Adani buys 29% stake in NDTV". the Guardian (in ఇంగ్లీష్). 2022-08-24. Retrieved 2022-11-30.
  15. "Ravish Kumar: ఎన్డీటీవీకి రవీశ్‌కుమార్‌ గుడ్‌బై.. ఇకపై యూట్యూబ్‌లోనే." web.archive.org. 2022-12-02. Archived from the original on 2022-12-02. Retrieved 2022-12-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  16. "Senior journalist Ravish Kumar resigns from NDTV". Indian Express. 30 November 2022. Retrieved 2022-11-30.
  17. Joshi, Namrata (12 October 2015). "The Peace Maker". Outlook. Retrieved 17 March 2021.