ప్రణయ్ రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రణయ్ రాయ్
జననం (1949-10-15) 1949 అక్టోబరు 15 (వయసు 74)
విద్యాసంస్థ
  • యూనివర్శిటీ ఆఫ్ లండన్ (BSc)
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ (CA)
  • ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (PhD)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మాజీ ఎగ్జిక్యూటివ్ కో-ఛైర్‌పర్సన్, ఎన్డీటీవీ
జీవిత భాగస్వామిరాధికా రాయ్
బంధువులు
  • పరేష్ లాల్ రాయ్ (తాత)
పురస్కారాలుఆసియన్ టెలివిజన్ అవార్డు; రెడ్ ఇంక్ అవార్డులు

ప్రణయ్ లాల్ రాయ్ (ఆంగ్లం: Prannoy Lal Roy; జననం 1949 అక్టోబరు 15) ఒక భారతీయ కమ్యూనిస్ట్ ఆర్థికవేత్త, చార్టర్డ్ అకౌంటెంట్, సైఫాలజిస్ట్, పాత్రికేయుడు, రచయిత. అతను ఎన్డీటీవీ (NDTV) మాజీ ఎగ్జిక్యూటివ్ కో-ఛైర్‌పర్సన్. అతని భార్య రాధికా రాయ్‌తో పాటు దాని సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఎన్డీటీవీ భారతదేశంలో మొదటి స్వతంత్ర వార్తా నెట్‌వర్క్. ప్రణయ్ రాయ్ దేశంలో అభిప్రాయ సేకరణలకు మార్గదర్శకత్వం వహించిన ఘనత కూడా ఉంది.

ఎన్డీటీవీ ఛానల్ ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ 2022 నవంబరులో ఆ ఛానల్ డైరెక్టర్‌ పదవులకు రాజీనామా చేసారు. ఇప్పటికే ఎన్డీటీవీ ప్రమోటింగ్‌ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను అదానీ కొనుగోలు చేయగా ఈ ఇద్దరూ నిష్క్రమించారు. ఇకపై ఎన్డీటీవి అదానీ గ్రూప్ సొంతం.[1]

ప్రారంభ జీవితం[మార్చు]

ప్రణయ్ రాయ్ పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో 1949 అక్టోబరు 15న జన్మించాడు. అతని తండ్రి పి.ఎల్. "హరికేన్" రాయ్‌ బహుళజాతి సంస్థలో ఎగ్జిక్యూటివ్. అతని తండ్రి తరఫు తాత పరేష్ లాల్ రాయ్, ట్రాఫిక్ సూపరింటెండెంట్. పరేష్ లాల్ రాయ్ ఔత్సాహిక బాక్సర్, దేశంలో క్రీడను ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు "భారత బాక్సింగ్ పితామహుడు" అని పిలుస్తారు. తన మనవడు ప్రణయ్ ని చిన్నతనంలో "టెంపెస్ట్" అని పిలిచేవాడు.[2]

ప్రణయ్ రాయ్ లా మార్టినియర్ కలకత్తాలో విద్యను అభ్యసించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఆయన ఉత్తరప్రదేశ్‌లోని డెహ్రాడూన్‌లో (ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉంది) ది డూన్ స్కూల్ అనే బాలుర బోర్డింగ్ పాఠశాలలో చదువుకున్నాడు. ఆ సమయంలో అతను రాధికా దాస్‌ని కలుసుకున్నాడు. కలకత్తాకు చెందిన ఆమె కూడా డెహ్రాడూన్‌లోని మరొక బోర్డింగ్ పాఠశాల అయిన వెల్హామ్ బాలికల పాఠశాలలో చదువుకుంది.[2]

ప్రణయ్ రాయ్, రాధిక దాస్‌ ఇద్దరూ ఉన్నత విద్య కోసం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌కు వెళ్లారు. ప్రణయ్ రాయ్ ఎ-స్థాయి హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ విద్యకు హైలీబరీ అండ్ ఇంపీరియల్ సర్వీస్ కాలేజ్ స్కాలర్‌షిప్‌ సాధించాడు.[3] ఆ తరువాత క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో చేరిన అతను 1973లో ఆర్థిక శాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టభద్రుడయ్యాడు.[4] ఆ తర్వాత అతను సర్టిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ అవడమేకాకుండా 1975లో ఇంగ్లండ్ అండ్ వేల్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్‌లో ఫెలో అయ్యాడు.[5] ప్రణయ్ రాయ్, రాధిక దాస్‌ లండన్‌లో వివాహం చేసుకున్నారు. తరువాత భారతదేశానికి తిరిగి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు.[6]

ప్రణయ్ రాయ్ ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ కజిన్.[7]

కెరీర్[మార్చు]

ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో తన అధ్యయనాలకు 1978లో వ్యవసాయ ఆర్థిక శాస్త్రం(Agricultural economics)లో ప్రణయ్ రాయ్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (PhD) పొందాడు.[4] డాక్టరేట్ గౌరవం తర్వాత ఆయన ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ ఇండియాలో కన్సల్టెంట్ గా 1979 నుండి 1983 వరకు పనిచేశాడు.[5]

తన చిన్ననాటి నుండి ఎన్నికల ఫలితాల పట్ల మక్కువ చూపే ఆయన 1977 భారత సార్వత్రిక ఎన్నికల కోసం తన మొదటి ఎగ్జిట్ పోల్స్ రూపొందించారు. మెయిన్ స్ట్రీమ్ మ్యాగజైన్ లో ఈ ఫలితాలు ప్రచురించారు, తన అంచనా ప్రకారమే జనతా పార్టీ విజయం సాధించింది.[8] 1980వ దశకంలో ఆక్స్‌ఫర్డ్ రాజకీయ శాస్త్రవేత్త డేవిడ్ బట్లర్, భారతీయ ఆర్థికవేత్త అశోక్ లాహిరితో కలిసి భారతదేశంలోని సెఫాలజీ రంగాన్ని ప్రధాన స్రవంతి చేసే ప్రయత్నం ఆయన ప్రారంభించాడు.

ఈ త్రయం మూడు పుస్తకాలను రూపొందించింది. పైగా ఆయన ఇండియా టుడే మ్యాగజైన్‌కు ఎన్నికల విశ్లేషకుడిగా మారాడు.[9] 1984 భారత సార్వత్రిక ఎన్నికలకైతే మరింత కచ్చితమైన ఎన్నికల అంచనాను ఆయన రూపొందించాడు, 400 సీట్లతో భారత జాతీయ కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. ఈ అంచనా అతనికి భారతదేశంలో అత్యంత విజయవంతమైన సైఫాలజిస్ట్‌గా పేరు తెచ్చిపెట్టింది.[8] 1980, 1995 మధ్య భారతదేశంలో అభిప్రాయ సేకరణకు మార్గదర్శకత్వం వహించినందుకు ప్రణయ్ రాయ్ ఘనత పొందాడు.[5]

న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (NDTV) 1984లో అంతర్జాతీయ వార్తా ప్రసారకర్తలు, పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్ కోసం ఒక నిర్మాణ సంస్థగా స్థాపించబడింది.[10] దీనికి రాధిక రాయ్, ప్రణయ్ రాయ్ సహ వ్యవస్థాపకులు.[11] దేశీయ వార్తలను కవర్ చేయడానికి ప్రైవేట్ ప్రొడక్షన్ హౌస్‌లను అనుమతించిన దూరదర్శన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ కోసం ది వరల్డ్ దిస్ వీక్ అనే అంతర్జాతీయ వార్తా కార్యక్రమాన్ని రూపొందించడానికి NDTV ఒప్పందం చేసుకుంది.[2] వరల్డ్ దిస్ వీక్ కార్యక్రమం దూరదర్శన్‌లో అత్యధిక వీక్షకులలో ఒకటిగా నిలిచింది.[12][13]

అవార్డులు[మార్చు]

  • ప్రణయ్ రాయ్ అకడమిక్ పురస్కారాలలో లెవర్ హల్మే ట్రస్ట్ (యుకె) ఫెలోషిప్, బిఎస్సి ఫలితాలలో క్వీన్ మేరీ ప్రైజ్ సాధించాడు. హైలీబరీ కళాశాలలో చదువుకోవడానికి డూన్ స్కూల్ లో ఒపిఒఎస్(OPOS) స్కాలర్ షిప్ అందుకున్నాడు.
  • జర్నలిజంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆయనకు 2015 రెడ్‌ఇంక్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.[14] ముంబై ప్రెస్ క్లబ్ చే ఇండియన్ జర్నలిజంలో ఎక్సలెన్స్ కోసం రెడ్ ఇంక్ అవార్డులు ప్రధానం చేస్తారు.

బిబ్లియోగ్రఫీ[మార్చు]

  • 1984 ఎ కాంపెండియం ఆఫ్ ఇండియా ఎన్నికలు (A Compendium of Indian Elections)
  • 1989 ఇండియా డిసైడ్స్: ఎన్నికలు 1952-1989 (India Decides: Elections 1952–1989)
  • 1995 ఇండియా డిసైడ్స్: ఎన్నికలు 1952-1995 (India Decides: Elections 1952–1995)
  • 2019 ది వర్డిక్ట్: డీకోడింగ్ ఇండియాస్ ఎన్నికలు (The Verdict: Decoding India's Elections)

మూలాలు[మార్చు]

  1. "Prannoy Roy: ఎన్డీటీవీకి ప్రణయ్ రాయ్ గుడ్‌బై.. ఇక ఎన్డీటీవీకి అదానీ మాటే శాసనం..! | NDTV founders Prannoy Roy and his wife Radhika Roy have resigned as the directors ssr". web.archive.org. 2022-11-30. Archived from the original on 2022-11-30. Retrieved 2022-11-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 2.2 Kaushik, Krishn (1 December 2015). "The Tempest". The Caravan (in ఇంగ్లీష్). p. 2. Retrieved 29 June 2021.
  3. "The Roy family". Media Ownership Monitor. Reporters Without Borders. 2019.
  4. 4.0 4.1 "Dr. Prannoy Roy". BBC World. Archived from the original on 28 October 2006. Retrieved 1 December 2020.
  5. 5.0 5.1 5.2 "Prannoy Roy". World Economic Forum. Retrieved 29 June 2021.
  6. Karmali, Naazneen (8 September 2006). "News Delhi TV". Forbes (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2020.
  7. Nayare Ali (14 July 2002). "There's something about Mary". Times of India. Archived from the original on 4 January 2016. Retrieved 12 January 2022.
  8. 8.0 8.1 "Smart People". Business Standard (published 6 February 2013). 19 April 2004. Retrieved 29 June 2021.
  9. Vardhan, Anand (20 May 2019). "Prannoy Roy and Dorab Sopariwala's new book chronicles change and continuity in India's electoral scene". Newslaundry. Retrieved 29 June 2021.
  10. Shrivastava, K M (2010). Broadcast Journalism in the 21st Century (in ఇంగ్లీష్). Sterling Publishing. pp. 36–37. ISBN 978-81-207-3597-2.
  11. Rodrigues, Usha M.; Ranganathan, Maya (2014). Indian News Media: From Observer to Participant (in ఇంగ్లీష్). SAGE Publications. p. 71. ISBN 978-93-5150-464-1.
  12. Kaushik, Kshama; Dutta, Kaushik (2012). India Means Business: How the elephant earned its stripes (in ఇంగ్లీష్). Oxford University Press. pp. 277–281. doi:10.1093/acprof:oso/9780198072614.001.0001. ISBN 978-0-19-908851-5 – via Oxford Scholarship Online.
  13. Batabyal, Somnath (2014). Making News in India: Star News and Star Ananda (in ఇంగ్లీష్). Routledge. p. 44. ISBN 978-1-317-80972-2.
  14. PTI (26 April 2015). "NDTV's Prannoy Roy bags RedInk award for lifetime achievement". Business Standard India. Retrieved 23 August 2020.