సి.డి.దేశ్‌ముఖ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sir Chintaman Dwarakanath Deshmukh CIE, ICS
సి.డి.దేశ్‌ముఖ్

C. D. Deshmukh


పదవీ కాలం
May 29, 1950[1]–1957
ప్రధాన మంత్రి Jawaharlal Nehru
ముందు John Mathai
తరువాత T. T. Krishnamachari

పదవీ కాలం
1943–49
ముందు James Braid Taylor
తరువాత Benegal Rama Rau

వ్యక్తిగత వివరాలు

జననం (1896-01-14)1896 జనవరి 14
Nate, Mahad, Raigad, Maharastra
మరణం 1982 అక్టోబరు 2(1982-10-02) (వయస్సు 86)
జాతీయత Indian
పూర్వ విద్యార్థి University of Cambridge
మతం Hindu

సి.డి.దేశ్‌ముఖ్ (జనవరి 14, 1896 - అక్టోబరు 2, 1982) పూర్తి పేరు చింతమన్ ద్వారకానాథ్ దేశ్‌ముఖ్ (Chintaman Dwarakanath Deshmukh). వీరు భారతీయ రిజర్వ్ బాంక్ మూడవ గవర్నర్, స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నర్. ఇతడు 1943, ఆగష్టు 11 నుంచి 1949, జూన్ 30 వరకు ఈ పదవిని నిర్వహించాడు. ఆ తర్వాత దేశ్‌మూఖ్ భారత దేశానికి ఆర్థిక మంత్రిగా నియమితులైనాడు.

జననం[మార్చు]

1896, జనవరి 14 న జన్మించాడు. 1920లో రోసినా ఆర్థర్ విల్కాక్స్ అనే ఆంగ్ల వనితను వివాహమాడాడు. 1949లో తొలి భార్య మరణించింది. వీరి కుమార్తె ప్రిమ్‌రోజ్ ఇంగ్లాండులో నివసిస్తుంది.[2] ఆ తరువాత 1953లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలైన దుర్గాబాయి దేశ్‌ముఖ్ను వివాహం చేసుకున్నాడు.

ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడైన దేశ్‌ముఖ్ కు 1939 నుంచే రిజర్వ్ బ్యాంక్తో సంబంధం ఉంది. 1941లో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి గవర్నర్ గా నియమించబడ్డాడు. August, 1943. ఆ తర్వాత జేమ్స్ టేలర్ నుంచి 3 వ గవర్నర్ గా బాధ్యతలు పొందినాడు. దేశ్‌ముఖ్ గవర్నర్ గా ఉన్న సమయంలో ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థిక పరిణామాలు సంభవించాయి. జూలై 1944లో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సమావేశంలో అతడు కూడా భారత దేశం తరఫునన పాల్గొన్నాడు. ఈ సమావేశమే అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (International Monetary Fund-IMF), ప్రపంచ బ్యాంకు (International Bank for Reconstruction and Development-IBRD) ఏర్పడడానికి కారణమైంది. ఈ రెండు సంస్థల లోనూ దేశ్‌ముఖ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ గా పదేళ్ళ పాటు పనిచేశాడు. 1950లో పారిస్లో జరిగిన ఈ రెండు సంస్థల వార్షిక సంయుక్త సమావేశంలో ఇతడు చైర్మెన్ గా వ్యవహరించాడు.[3]

అవార్డులు[మార్చు]

మరణం[మార్చు]

1982, అక్టోబరు 2న మరణించారు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-22. Retrieved 2014-01-12.
  2. "BIOGRAPHY of Chintaman Dwarkanath Deshmukh". Archived from the original on 2008-10-17. Retrieved 2013-04-16.
  3. "Chintaman Deshmukh Memorial Lectures". Reserve Bank of India. Retrieved 2006-12-08.