మన్మోహన్ సింగ్

వికీపీడియా నుండి
(మన్‌మోహన్ సింగ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మన్మోహన్ సింగ్ 
పార్లమెంటు సభ్యుడు
మన్మోహన్ సింగ్

2009 లో మన్మోహన్ సింగ్


పదవీ కాలం
2004 మే 22 – 2014 మే 26
రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్
ప్రతిభా పాటిల్
ప్రణబ్ ముఖర్జీ
ముందు అటల్ బిహారీ వాజపేయి
తరువాత నరేంద్ర మోదీ

రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
1998 మే 21 – 2004 మే 21
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు సికందర్ భక్త్
తరువాత జస్వంత్ సింహ

భారతదేశ ఆర్థిక మంత్రి
పదవీ కాలం
1991 జూన్ 21 – 1996 మే 16
ప్రధాన మంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు
ముందు యశ్వంత్ సిన్హా
తరువాత జస్వంత్ సింహ

ప్లానింగ్ కమీషన్ డిప్యూటీ చైర్మన్
పదవీ కాలం
1985 జనవరి 15 – 1987 ఆగస్టు 31
ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ
ముందు P. V. Narasimha Rao
తరువాత పి. శివశంకర్

పదవీ కాలం
1982 సెప్టెంబరు 15 – 1985 జనవరి 15
ముందు ఐ.జె.పటేల్
తరువాత అమితావ్ ఘోష్

భారత పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ)
పదవీ కాలం
1991[1] – 2019
నియోజకవర్గం అస్సాం

భారత పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ)
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019
నియోజకవర్గం రాజస్థాన్

వ్యక్తిగత వివరాలు

జననం (1932-09-26) 1932 సెప్టెంబరు 26 (వయసు 92)
పంజాబ్ (ఇప్పటి చక్వాల్ , పాకిస్తాన్)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి
సంతానం ఉపీందర్ సింహ, దమన్ సింహ, అమృత్
నివాసం 3, మోతీలాల్ నెహ్రూ మార్గ్, న్యూఢిల్లీ [2][3]
పూర్వ విద్యార్థి పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీఘర్
సెయింట్ జోసెఫ్ కళాశాల, కేంబ్రిడ్జ్
నూఫిల్డ్ కళాశాల, ఆక్స్‌ఫర్డు
వృత్తి ఆర్థికవేత్త, రాజకీయనాయకుడు
మతం సిక్కులు

15వ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ భారత దేశానికి 17వ ప్రధాన మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా 2004 మే 22 లో బాధ్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల సింహ 1991లో ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు., ఇంతటి విద్యా, సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటో అతిశయోక్తిగాదు.

తొలి జీవితము, కుటుంబము

[మార్చు]

1932 సెప్టెంబరు 26 లో పంజాబ్ (ఇప్పటి చక్వాల్, పాకిస్తాన్) లో ఒక కోహ్లీ కుటుంబములో జన్మించారు. 14వ, ప్రస్తుత ప్రధానమంత్రి. 1958 లో గురుషరణ్ కౌర్తో వివాహమాడిన డా.సింహకు ముగ్గురు కుమార్తెలు. వాళ్ళు ముగ్గురూ మతాంతర వివాహాలే చేసుకోవడం విశేషం.[4]

విద్య

[మార్చు]

అర్థశాస్త్రములో 1952 లో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పంజాబ్ విశ్వవిద్యాలయము, ఛండీగడ్ నుండి చేసారు. ఆ తరువాత

ఉద్యోగాలు

[మార్చు]
  • 1957-59 : సీనియర్ లెక్చరర్, ఆర్థికశాస్త్రం.
  • 1959-63 : రీడర్, ఆర్థికశాస్త్రం.
  • 1963-65 : ప్రొఫెసర్, ఆర్థికశాస్త్రం, పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్.
  • 1969-71 : ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం.
  • 1976 : గౌరవ ప్రొఫెసర్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం.

రాజ్యసభ సభ్యుడిగా

[మార్చు]

మన్మోహన్ సింగ్ 1991 అక్టోబరు 1 నుండి 2019 జూన్ 14 వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత ఆయన 2019 ఆగస్టు 20 నుండి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు.[5][6]

సేవలు

[మార్చు]
  • 1971-72: ఆర్థిక సలహాదారు, విదేశీ వాణిజ్య మంత్రాలయం.
  • 1972-76: ప్రధాన విత్త సలహాదారుడు, ఆర్థిక మంత్రిత్వ శాఖ.
  • 1976-80: భారత రిజర్వు బ్యాంకు డైరెక్టర్.
  • డైరెక్టర్, భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు.
  • ఆసియాభివృద్ధి బ్యాంకుకు భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నరు.
  • బర్డ్, ప్రత్యామ్నాయ గవర్నరు.
  • 1976 నవంబరు - 1980 ఏప్రిల్: కార్యదర్శి, భారత ఆర్థిక శాఖ.
  • సభ్యుడు, ఆర్థిక శాఖ, అణుశక్తి కమిషను, అంతరిక్ష కమిషను.
  • 1980 ఏప్రిల్ - 1982 సెప్టెంబరు 15 : ప్లానింగ్ కమిషన్ సభ్యుడు-కార్యదర్శి
  • 1980-83: ఛైర్మన్, భారత్-జపాన్ జాయింట్ స్టడీ కమిటీ యొక్క భారత కమిటీ.
  • 1982 సెప్టెంబరు 16 - 1985 జనవరి 14 : రిజర్వ్ బ్యాంకు గవర్నరు.
  • 1982-85: ఐ.ఎమ్.ఎఫ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నరు.
  • 1983-84: సభ్యుడు, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల కౌన్సిల్.
  • 1985: అధ్యక్షుడు, ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్.
  • 1985 జనవరి 15 - 1987 జూలై 31 : డిప్యూటి ఛైర్మన్, ప్లానింగ్ కమిషన్
  • 1987 ఆగస్టు 1 - నవంబరు 10, 19! 90: సెక్రటరి జనరల్, కమీషనర్, సౌత్ కమిషన్, జెనీవా.
  • 1990 డిసెంబరు 10 - 1991 మార్చి 14 : ప్రధానమంత్రి సలహాదారుడు, ఆర్థిక విషయాలు.
  • 1991 మార్చి 15 - 1991 జూన్ 20 : యూనివర్సిటి గ్రాంట్స్ కమిషన్ (UGC) ఛైర్మన్.
  • 1991 జూన్ 21 - 1996 మే 15 : కేంద్ర ఆర్థిక మంత్రి.
  • 1991 అక్టోబరు: అస్సాం నుండి కాంగ్రెస్ టికెట్ మీద రాజ్యసభ సభ్యుడిగా గెలుపు.
  • 1995 జూన్: రాజ్యసభ సభ్యుడిగా తిరిగి ఎన్నిక.
  • 1996 ఆతరువాత : సభ్యుడు, కాన్సులేటివ్ కమిటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ.
  • 1996 ఆగస్టు 1 - 1997 డిసెంబరు 4 : ఛైర్మన్, వ్యాపారరంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.
  • 1998 మార్చి 21 ఆతరువాత : రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు.
  • 1998 జూన్ 5 ఆతరువాత : సభ్యుడు, ఆర్థికంపై కమిటీ.
  • 1998 ఆగస్టు 13 ఆతరువాత : సభ్యుడు, కమిటీ ఆన్ రూల్స్.
  • 1998 ఆగస్టు-2001 : సభ్యుడు, కమిటీ ఆఫ్ ప్రివిలైజెస్.
  • 2000 ఆ తరువాత : సభ్యుడు, ఎక్జిక్యూటివ్ కమిటీ, ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్.
  • 2001 జూన్: రాజ్యసభకు తిరిగి ఎన్నిక.
  • 2001 ఆగస్టు తరువాత : సభ్యుడు, జనరల్ పర్పస్ కమిటీ.

రచనలు

[మార్చు]
  • ఇండియాస్ ఎక్స్‌పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్టస్ ఫార్ సెల్ఫ్-సస్టైన్‌డ్ గ్రోత్ : క్లారెండోన్ ప్రెస్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, 1964.
  • అనేక ఆర్థిక జర్నల్స్ కొరకు అనేకానేక ఆర్టికల్స్.

పురస్కారాలు

[మార్చు]
  • ఆడమ్ స్మిత్ ప్రైజ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం - 1956
  • పద్మవిభూషణ్ - 1987
  • యూరో మనీ అవార్డు, 1993 ఉత్తమ ఆర్థికమంత్రి.
  • ఏషియా మనీ అవార్డు, ఆసియా కొరకు ఉత్తమ ఆర్థిక మంత్రి - 1993, 1994
  • ఇందిరా గాంధీ బహుమతి -2017

అంతర్జాతీయ అసైన్‌మెంట్లు

[మార్చు]
  • 1966 : ఆర్థిక వ్యవహారాల ఆఫీసరు.
  • 1966-69 : యు.ఎన్.సి.టి.ఏ.డి. (UNCTAD), ఛీఫ్, ఫైనాన్సింగ్ ఫర్ ట్రేడ్ సెక్షన్.
  • 1972-74 : ఐ.ఎమ్.ఎఫ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫోరమ్ కొరకు, భారత తరఫున డిప్యూటీ.
  • 1977-79 : ఎయిడ్-ఇండియా కన్సార్టియమ్ మీటింగుల కొరకు భారత రాయబారి.
  • 1980-82 : ఇండో-సోవియట్ జాయింట్ ప్లానింగ్ గ్రూప్ మీటింగ్
  • 1982 : ఇండో-సోవియట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్
  • 1993 : సైప్రస్ లో జరిగిన కామన్వెల్తు హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, హ్యూమన్ రైట్స్ వర్‌ల్డ్ కాన్ఫరెన్సు, వియన్నా.

వినోదాలు క్రీడలు

[మార్చు]
  • జిమ్‌ఖానా క్లబ్, న్యూఢిల్లీ శాశ్వత సభ్యుడు.
  • ఇండియా ఇంటర్నేషనల్ సెంటరు న్యూఢిల్లీ, శాశ్వత సభ్యుడు.

మూలాలు

[మార్చు]
  1. "Prime Minister Manmohan Singh files Rajya Sabha nomination papers amid protests". NDTV. 15 May 2013. Retrieved 21 April 2015.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-07-06. Retrieved 2018-10-16.
  3. http://www.thehindu.com/news/cities/Delhi/manmohan-singh-moves-into-new-house-on-3-motilal-nehru-marg/article
  4. మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...
  5. The Economic Times (16 February 2024). "Manmohan Singh to end 33 years stint in Rajya Sabha on Apr 3; Sonia Gandhi to begin first". Archived from the original on 18 February 2024. Retrieved 18 February 2024.
  6. Eenadu (3 April 2024). "రాజ్యసభతో మన్మోహన్‌ 33 ఏళ్ల అనుబంధానికి నేటితో తెర". Archived from the original on 3 April 2024. Retrieved 3 April 2024.



ఇంతకు ముందు ఉన్నవారు:
అటల్ బిహారీ వాజపేయి
భారత ప్రధానమంత్రి
22 మే 2004—26 మే 2014
తరువాత వచ్చినవారు:
నరేంద్ర మోదీ