సరుక్కై జగన్నాథన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సరుక్కై జగన్నాథన్ (1914 మే 18 - 1996) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదవ గవర్నరు. అతను 1970 జూన్ 16 నుండి [1] 1975 మే 19 వరకు గవర్నరుగా పనిచేసాడు.

మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్న జగన్నాథన్ ఇండియన్ సివిల్ సర్వీస్‌లో సభ్యుడు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేశాడు. ఆర్‌బీఐ గవర్నరు కాకముందు ప్రపంచ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. [2]

అతని పదవీకాలంలో 1970ల నాటి చమురు షాక్ వలన చాలా చురుకైన ద్రవ్య విధానాన్ని అవలంబించాడు. ప్రైవేట్ బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యాలయాల విస్తరణ అతను సాధించిన ఇతర విజయాలు.

క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలు ఆయన హయాంలో ఏర్పాటయ్యాయి. 20 50 నోట్లను అతని కాలం లోనే ప్రవేశపెట్టారు. వీటిపై అతని సంతకం ఉంటుంది. [3]


మూలాలు[మార్చు]

  1. "S Jagannathan". Reserve Bank of India. Archived from the original on 2008-09-16. Retrieved 2008-09-15.
  2. "List of Governors". Reserve Bank of India. Archived from the original on 2008-09-16. Retrieved 2006-12-08.
  3. Jain, Manik (2004). 2004 Phila India Paper Money Guide Book. Kolkata: Philatelia. pp. 45, 49.