Jump to content

ఎస్.వెంకిటరమణన్

వికీపీడియా నుండి
శ్రీ వెంకిటరమణన్
భారతీయ రిజర్వు బ్యాంకు 18 వ గవర్నరు
In office
1990 డిసెంబరు 22 – 1992 డిసెంబరు 20
అంతకు ముందు వారుఆర్.ఎన్.మల్హోత్రా
తరువాత వారుసి.రంగరాజన్
వ్యక్తిగత వివరాలు
జననం1930 జనవరి 28[1]
నాగర్‌కోయిల్, టిరువాన్కూరు సంస్థానం
మరణం2023 నవంబరు 18(2023-11-18) (వయసు 93)
చెన్నై
జాతీయతభారతీయుడు

శ్రీ వెంకిటరమణన్ (1930 జనవరి 28 - 2023 నవంబరు 18) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు పద్దెనిమిదవ గవర్నరు. అతను 1990 నుండి 1992 వరకు 2 సంవత్సరాల పాటు గవర్నరుగా పనిచేశాడు. [2] అంతకుముందు, 1985 నుండి 1988 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక కార్యదర్శిగా పనిచేశారు [3]

1980ల చివరలో, 1990ల ప్రారంభంలో భారతదేశంలో చెల్లింపుల సంక్షోభం ఏర్పడినపుడు, అద్భుతమైన పనితీరు చూపినవాడిగా వెంకిటరమణన్‌ను చూస్తారు. [4] [5] భారతదేశ విదేశీ-మారకం నిల్వలు దాదాపు అడుగంటిన సమయంలో అతని సమయానుకూలమైన, నిర్ణయాత్మకమైన చర్యలు సంక్షోభం నుండి దేశాన్ని బయట పడవేయడానికి పునాది వేసాయి. [4] [5]

తొలి జీవితం, నేపథ్యం

[మార్చు]

అతను కేరళ తిరువనంతపురం లోని యూనివర్శిటీ కాలేజ్ నుండి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందాడు[6] పిట్స్బర్గ్ లోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుండి పారిశ్రామిక పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందాడు.[7]

అయ్యేయెస్

[మార్చు]

వెంకిటరమణన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యుడు. [8] అతను వివిధ సమయాల్లో భారత ప్రభుత్వం లోను, తమిళనాడు రాష్ట్రం లోనూ పనిచేసాడు. కర్ణాటక ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేశాడు. [9]

ఆర్థిక కార్యదర్శి

[మార్చు]

అతను 1985 నుండి 1988 వరకు మూడు సంవత్సరాల పాటు భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక కార్యదర్శిగా పనిచేశాడు [7]

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్

[మార్చు]

1990 డిసెంబరు 20 నుండి 1992 డిసెంబరు 22 వరకు వెంకిటరమణన్ భారత రిజర్వు బ్యాంకు గవర్నరుగా పనిచేశాడు. [10] గవర్నర్‌గా నియామకం సమయంలో, భారతదేశం వేగంగా క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలతో చెల్లింపుల సంక్షోభంలో ఉంది. [10] అతని నిర్ణయాత్మక చర్యలు భారతదేశం సంక్షోభాన్ని అధిగమించడానికి సహాయపడ్డాయి. [5] [4] [10] ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న సమయం లోనే సుచేతా దలాల్, హర్షద్ మెహతా స్కామ్‌ను బయటపెట్టింది.

మలి జీవితం

[మార్చు]

పదవీ విరమణ తర్వాత, వెంకిటరమణన్, అశోక్ లేలాండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, న్యూ తిరుపూర్ ఏరియా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అశోక్ లేలాండ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థలకు చైర్మన్‌గా పనిచేశాడు. [7] అతను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, SPIC, పిరమల్ హెల్త్‌కేర్ లిమిటెడ్, తమిళనాడు వాటర్ ఇన్వెస్ట్‌మెంట్ కో. లిమిటెడ్, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బోర్డులలో కూడా పనిచేశాడు.[7]

అతని కుమార్తె గిరిజా వైద్యనాథన్, 1981 సంవత్సరపు తమిళనాడు కేడర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆమె తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసింది. [11]

ప్రచురించిన పుస్తకాలు

[మార్చు]

వెంకిటరమణన్ మూడు పుస్తకాలను ప్రచురించాడు. అవి: ఇండియన్ ఎకానమీ: రివ్యూస్ అండ్ కామెంటరీస్ - వాల్యూం I, ఇండియన్ ఎకానమీ: రివ్యూస్ అండ్ కామెంటరీస్ - వాల్యూం II, ఇండియన్ ఎకానమీ: రివ్యూస్ అండ్ కామెంటరీస్ - వాల్యూమ్ III.

జనాదరణ పొందిన సంస్కృతిలో

[మార్చు]

నటుడు అనంత్ మహదేవన్ స్కామ్ 1992 సినిమాలో వెంకిటరమణన్ పాత్రను పోషించాడు. ఇది 1992 నాటి హర్షద్ మెహతా భారతీయ స్టాక్ మార్కెట్ స్కామ్ ఆధారంగా సోనీ లివ్ నిర్మించిన అసలు వెబ్ సిరీస్. [12]

మరణం

[మార్చు]

ఎస్.వెంకటరమణన్ 92 సంవత్సరాల వయసులో అనారోగ్యం కారణంగా చెన్నైలోని తన నివాసంలో 18.11.2023 న తుదిశ్వాస విడిచాడు. ఆయనకు భార్య గిరిజా వైద్యనాథన్‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[13]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2020-10-22. Retrieved 2022-02-05.
  2. "List of Governors". Reserve Bank of India. Archived from the original on 2008-09-16. Retrieved 2006-12-08.
  3. "S Venkitaramanan". indian-coins.com. Archived from the original on 2018-07-12. Retrieved 2022-02-05.
  4. 4.0 4.1 4.2 Balakrishnan, Pulapre (23 August 2016). "Looking for some change, Governor". The Hindu – via www.thehindu.com.
  5. 5.0 5.1 5.2 "In fact: RBI head and crisis manager during 1991 BOP turmoil". 5 April 2017.
  6. "Archived copy". Archived from the original on 2 May 2014. Retrieved 2 May 2014.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  7. 7.0 7.1 7.2 7.3 "Americas". www.bloomberg.com.
  8. "SUPREMO". supremo.nic.in. Retrieved 2016-12-24.
  9. "Urjit Patel resigns: From Osborne Smith to Shaktikanta Das, here's a list of the men who have held the top post at Mint Street". Moneycontrol.
  10. 10.0 10.1 10.2 "Reserve Bank of India - Governors". Rbi.org.in. Retrieved 2019-03-20.
  11. "5 things you need to know about new Chief Secretary of Tamil Nadu Girija Vaidyanathan | Latest News & Updates at Daily News & Analysis". dna (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-12-22. Retrieved 2016-12-24.
  12. "Real Vs. Reel: Characters In 'Scam 1992: The Harshad Mehta Story' & Their Real-Life Counterparts". ScoopWhoop. 17 October 2020. Retrieved 11 April 2021.
  13. "ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వెంకట రమణన్‌ కన్నుమూత | former rbi governor s venkitaramanan dies at 92". web.archive.org. 2023-11-18. Archived from the original on 2023-11-18. Retrieved 2023-11-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)