సుచేతా దలాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుచేతా దలాల్
2006 లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుండి పద్మశ్రీ స్వీకరిస్తూ సుచేతా దలాల్
జననం1962
విద్యాసంస్థ
  • కర్ణాటక కాలేజీ, ధార్వాడ
  • ముంబై యూనివర్సిటీ
వృత్తివాణిజ్య పాత్రికేయురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
1992 భారత స్టాక్ మార్కెట్ కుంభకోణం
గుర్తించదగిన సేవలు
1992 సెక్యూరిటీల కుంభకోణం
జీవిత భాగస్వామిదేబషిస్ బాసు
పురస్కారాలు2006 లో పద్మశ్రీ

సుచేతా దలాల్ (జననం 1962) వాణిజ్య రంగ పాత్రికేయురాలు, రచయిత్రి. [1] ఆమె రెండు దశాబ్దాలుగా జర్నలిస్టుగా పనిచేస్తోంది. 2006లో జర్నలిజంలో చేసిన కృషికి గాను పద్మశ్రీ పురస్కారం అందుకుంది. [2] ఆమె 1998 వరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఎడిటర్‌గా ఉంది. ఆమె ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌లో కన్సల్టింగ్ ఎడిటర్‌గా ఉంటూ ఉండగా, 2008 వరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లకు కాలమ్‌లు రాసింది.

2006లో, ఆమె పెట్టుబడులపై పక్షపత్రిక అయిన మనీలైఫ్ లో కోసం రాయడం ప్రారంభించింది. అది, ఆమె భర్త దేబాషిస్ బసు ప్రారంభించినదే. ఆమె ఇప్పుడు మనీలైఫ్ మ్యాగజైన్‌కు మేనేజింగ్ ఎడిటర్. 2010లో, భారతదేశంలో ఆర్థిక అక్షరాస్యత తక్కువగా ఉండడంపై తమ వంతు కృషిగా, ఆమె, ఆమె భర్త ముంబైలో లాభాపేక్ష లేని సంస్థ, మనీలైఫ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఆమె ఆరేళ్లుగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ & ప్రొటెక్షన్ ఫండ్‌లో సభ్యురాలిగా ఉంది. 1992లో, ఆమెకు అత్యుత్తమ మహిళా మీడియా పర్సన్‌లకు ఇచ్చే చమేలీ దేవి జైన్ అవార్డు లభించింది . [3]

విద్య, వృత్తి

[మార్చు]

సుచేత బెలగావిలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. [4] ధార్వాడ్‌లోని కర్ణాటక కళాశాలలో B.Sc స్టాటిస్టిక్స్ చదివింది. LLభ్ పట్టా పొందిన ఆమె, శిక్షణ పొందిన న్యాయవాది. బాంబే యూనివర్సిటీ నుండి ఎల్‌ఎల్‌ఎం పట్టా పొందింది. [5]

1984లో సుచేత, ఫార్చ్యూన్ ఇండియా అనే పత్రికలో ఉద్యోగం చేయడం ద్వారా జర్నలిజంలో తన వృత్తిని ప్రారంభించింది. తరువాత, ఆమె బిజినెస్ స్టాండర్డ్, ది ఎకనామిక్ టైమ్స్ వంటి వార్తా సంస్థలలో పని చేసింది. [6] 1990ల ప్రారంభంలో దలాల్, ముంబైకి చెందిన ప్రముఖ వార్తాపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వారి వాణిజ్య, ఆర్థిక శాస్త్ర విభాగంలో పాత్రికేయురాలిగా చేరింది. అక్కడ ఆమె జర్నలిజం, యాక్టివిజం రంగాలలో అనేక కేసులను పరిశోధించింది. వాటితో ఆమె ప్రసిద్ధి గాంచింది. వీటిలో 1992 నాటి హర్షద్ మెహతా కుంభకోణం, ఎన్రాన్ కుంభకోణం, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కాం, 2001 నాటి కేతన్ పరేఖ్ స్కాం లు ఉన్నాయి. ఆమె దేబాషిస్ బసు, గిరీష్ సంత్, శంతను దీక్షిత్, ప్రద్యుమ్న కౌల్ వంటి జర్నలిస్టులు, విశ్లేషకులతో సన్నిహితంగా పనిచేసింది. ఆమె తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఎడిటర్‌గా పనిచేసింది. [7]

అవార్డులు, గుర్తింపు

[మార్చు]

సుచేతకు పద్మశ్రీ అవార్డు, మీడియా ఫౌండేషన్ స్థాపించిన చమేలీ దేవి అవార్డు, జర్నలిజంలో ఆమె అత్యుత్సాహంతో పనిచేసినందుకు ఫెమినా వుమన్ ఆఫ్ సబ్‌స్టన్స్ అవార్డులూ పొందింది. [6]

స్కామ్ 1992 అనేది హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఒక డాక్యుడ్రామా. ఆమె, దేబాసిస్ బసు రాసిన పుస్తకం ది స్కామ్ ఆధారంగా దాన్ని రూపొందించారు. ఇది 2020 అక్టోబరులో విడుదలైంది. అందులో దలాల్ పాత్రను శ్రేయా ధన్వంతరి పోషించింది.

కొన్ని ప్రచురణలు

[మార్చు]

జనాదరణ పొందిన సంస్కృతిలో

[మార్చు]
  • స్కామ్ 1992 లో సుచేతా దలాల్ పాత్రను నటి శ్రేయా ధన్వంతరి పోషించింది, ఇది సోనీ LIV వారి సిరీస్. సుచేతా రాసిన పుస్తకం ది స్కామ్: హూ వన్, హూ లాస్ట్, హూ గాట్ అవే ఆధారంగా దాన్ని రూపొందించారు .
  • నటి ఇలియానా డి'క్రూజ్ మీరా రావ్‌గా నటించింది. ఇది 2021 నాటి చలనచిత్రం ది బిగ్ బుల్‌లో సుచేతా దలాల్ స్ఫూర్తితో సృష్టించిన పాత్ర. దీన్ని కూడా అదే పుస్తకం ఆధారంగా రూపొందించారు. [8]

మూలాలు

[మార్చు]
  1. "Sucheta Dalal, Padma Shri". Express India. 27 Jan 2006. Archived from the original on 22 March 2016. Retrieved 21 May 2015.{{cite news}}: CS1 maint: unfit URL (link)
  2. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 21 July 2015.
  3. "Sucheta Dalal: Executive Profile & Biography". Bloomberg. Retrieved 9 March 2019.
  4. "St. Joseph's Convent School to celebrate 125 years on Friday". The Hindu (in Indian English). 21 January 2016.
  5. "Sucheta Dalal". Archived from the original on 6 మార్చి 2016. Retrieved 7 November 2016.
  6. 6.0 6.1 Mehrotra, Kriti (2020-11-11). "Sucheta Dalal Now: Where Is Journalist Who Broke Harshad Mehta Story Today?". The Cinemaholic (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-23.
  7. "Girish Sant memorial lecture 2015". Prayas (Energy Group). Archived from the original on 7 నవంబరు 2016. Retrieved 7 November 2016.
  8. Roy, Priyanka (10 April 2021). "The Big Bull romanticises a criminal in a half-baked story". Telegraph India. Retrieved 2021-04-14.

బాహ్య లింకులు

[మార్చు]