శ్రేయా ధన్వంతరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రేయా ధన్వంతరి
శ్రేయా ధన్వంతరి (సోహో హౌజ్ వద్ద)
జననం1990/1991 (age 33–34)[1]
వృత్తిభారతీయ సినిమా నటి, మోడల్, రచయిత్రి, దర్శకురాలు
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
వై చీట్ ఇండియా
ది ఫ్యామిలీ మాన్
స్కామ్ 1992
ఎత్తు1.73 మీ[1]

శ్రేయా ధన్వంతరి, భారతీయ సినిమా నటి, మోడల్, రచయిత్రి, దర్శకురాలు. తెలుగు, హిందీ భాషా చిత్రాలలో, వెబ్ సిరీస్‌లతో నటించిన శ్రేయా తెలుగులో జోష్, స్నేహగీతం చిత్రాలలో నటించింది. 2019లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో జోయా పాత్రలో, 2020లో సోనీ ఎల్ఐవి వారి స్కామ్ 1992 వెబ్ సిరీస్ లో సుచేతా దలాల్ పాత్రలో నటించింది.[2]

జీవిత విషయాలు[మార్చు]

హైదరాబాదులోని తెలుగు కుటుంబంలో జన్మించిన శ్రేయా ధన్వంతరి, ఢిల్లీ నగరంలో పెరిగింది. వరంగల్లులోని నిట్ లో ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసింది.[3]

సినిమారంగం[మార్చు]

శ్రేయా, ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం విద్యార్థిగా ఉన్నప్పుడు ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొన్నది. ఈ పోటీలో శ్రేయా 2వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మిస్ ఇండియా 2008 పోటీలో ఫైనలిస్ట్‌గా పోటీ పడింది. [4]

ఎయిర్‌టెల్, పాంటలూన్స్, సఫీ, ప్రోవోగ్, వోగ్ ఐవేర్, గీతాంజల్ మాయ బంగారు ఆభరణాలు, డిడామాస్ ఆభరణాలు, జాష్న్ చీరలు, లిబర్టీ ఫుట్వేర్ వంటి సంస్థల ప్రచార చిత్రాలలో నటించింది.

మిస్ ఇండియా 2008 పోటీ తరువాత, స్నేహగీతం సినిమాలో నటించింది. ఇమ్రాన్ హష్మి నటించిన వై చీట్ ఇండియా చిత్రంతో హిందీ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[5][6]

ఫేడ్ టు వైట్ అనే పుస్తకాన్ని కూడా రాసింది.[7]

2020లో స్కామ్ 1992 వెబ్ సిరీస్ లో సుచేతా దలాల్ పాత్రను పోషించింది.[8]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర విభాగం ఇతర వివరాలు
2009 జోష్ భావన నటి తెలుగు చిత్రం
2010 స్నేహగీతం శైలు నటి తెలుగు చిత్రం
2012 ది గర్ల్ ఇన్ మీ టీనా/తారా నటి లఘుచిత్రం
2017 యాంటీ సైబర్ బుల్లింగ్ పిఎస్ఏ (ముంబై పోలీసుల సహకారంతో) దెబ్బతిన్న అమ్మాయి పాత్రలో దర్శకురాలు, రచయిత్రి, నిర్మాత, నటి పిఎస్ఎ షార్ట్
2019 వై చీట్ ఇండియా నూపూర్ నటి హిందీ చిత్రం

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర వేదిక ఇతర వివరాలు
2016 లేడీస్ రూం రాధిక ఖన్నా వై ఫిల్మ్స్ 6 ఎపిసోడ్లు
2018 ది రీయూనియన్ దేవాన్షి టైలర్ ది జూమ్ స్టూడియోస్ 10 ఎపిసోడ్లు
2019 ది ఫ్యామిలీ మ్యాన్ జోయా ప్రైమ్ వీడియో 10 ఎపిసోడ్లు
2020 ఎ వైరల్ వెడ్డింగ్ నిషా అహుజా ఇరోస్ నౌ దర్శకురాలు, రచయిత్రి, నిర్మాత, నటి
2020 స్కామ్ 1992 సుచేతా దలాల్ సోనీలైవ్ సోనీ లివ్‌లో 10 ఎపిసోడ్‌లు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Shreya Dhanwanthary". The Times of India. 8 January 2012. Retrieved 26 December 2020.
  2. "Seven times Scam 1992 actor Shreya Dhanwanthary impressed us with her personal style". The Indian Express. 17 November 2020. Retrieved 26 December 2020.
  3. "స్టార్స్‌ చెప్పే దాంట్లో నిజం ఉండదు". Sakshi. 6 September 2020. Retrieved 26 December 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "PFMI South '08". The Times of India. Retrieved 26 December 2020.
  5. TNN (3 August 2018). "Shreya Dhanwanthary to star opposite Emraan Hashmi in 'Cheat India'". The Times of India. Retrieved 26 December 2020.
  6. "Shreya Dhanwanthary: I Am Open to Doing Commercial Movies That Have Good Stories". News18. Retrieved 26 December 2020.
  7. "Fade to White". www.goodreads.com. Retrieved 26 December 2020.
  8. Cyril, Grace (9 December 2020). "Scam 1992 tops IMDb's Top 10 Indian Web Series of 2020 list with 9.2 rating". India Today. Retrieved 26 December 2020.

ఇతర లంకెలు[మార్చు]