ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
Service overview
IAS (Central Association) logo.jpeg
నినాదం: योगः कर्मसु कौशलम् (సంస్కృతం)
"Unity implies Excellence at Work"
స్థాపన1858; 163 సంవత్సరాల క్రితం (1858)
IAS
1950 జనవరి 26; 71 సంవత్సరాల క్రితం (1950-01-26)
దేశం India
స్టాఫ్ కాలేజీలాల్ బహాదుర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్సోరీ, ఉత్తరాఖండ్
కేడర్ కంట్రోలింగ్ అథారిటీడిపార్టుమెంటు ఆఫ్ పర్శనల్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పెర్సొనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్
భాద్యతగ మంత్రినరేంద్రమోదీ, భారత ప్రధాన మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ పెర్సొనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్
Legal personalityGovernmental; Civil Service
Duties
Cadre strength4,926 members (3,511 officers directly recruited by the Union Public Service Commission and 1,415 officers promoted from state civil services)[1][2]
SelectionCivil Services Examination
AssociationIAS (Central) Association
Head of the civil services
Cabinet Secretary of IndiaRajiv Gauba, IAS

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అనగా భారత ప్రభుత్వ ప్రీమియర్ పరిపాలనా పౌర సేవ. ఐఏఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, పబ్లిక్ రంగ సంస్థలలో పట్టున్న, వ్యూహాత్మక స్థానాలున్నవారు. ఈ అధికారులు ప్రభుత్వ విధానాలను అమలు పరచి పర్యవేక్షిస్తారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సమాజంలో పేరు ప్రఖ్యాతలున్న గొప్ప సేవగా గుర్తింపు పొందింది. ఈ సేవ ద్వారా ప్రధాన విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలుగుతారు, అమలు పరచగలుగుతారు. ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ జిల్లా, రాష్ట్రం, దేశం, మూడు స్థాయిల్లోనూ పనిచేయగలిగిన ఏకైక సర్వీసు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ఎంపికైనవారు మొదట అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత పదోన్నతుల ద్వారా వరుసగా పై హోదాలకు చేరుకుంటారు.

ఉదాహరణకు:-

  • అసిస్టెంట్ కలెక్టర్‌ → కలెక్టర్ → డిప్యూటీ కమిషనర్ → డిప్యూటీ సెక్రటరీ → డిప్యూటీ డెరైక్టర్
  • అసిస్టెంట్ కలెక్టర్‌ → కలెక్టర్ → డిప్యూటీ కమిషనర్ → అడిషనల్ సెక్రటరీ → జాయింట్ సెక్రటరీ → డెరైక్టర్
  • అసిస్టెంట్ కలెక్టర్‌ → సెక్రటరీ → కమిషనర్ అండ్ సెక్రటరీ → ప్రిన్సిపల్ సెక్రటరీ → ఫైనాన్షియల్ కమిషనర్ → చీఫ్ సెక్రటరీ → చైర్మన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్

జిల్లా కలెక్టరు , జిల్లా మెజిస్ట్రేట్[మార్చు]

జిల్లా కలెక్టర్ సాధారణంగా కలెక్టర్ గానే సూచించబడతారు, ఇతను ఒక భారతీయ జిల్లా ముఖ్య పరిపాలకుడు, రెవిన్యూ అధికారి. కలెక్టర్ అలాగే జిల్లా మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్, కొన్ని జిల్లాల్లో డిప్యూటీ డెవలెప్మెంట్ కమిషనర్ గాను సూచింపబడతారు. జిల్లా కలెక్టర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యుడు, కేంద్ర ప్రభుత్వంచే నియమింపబడతాడు.

సివిల్ సర్వీస్ పరీక్ష[మార్చు]

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎంపికకు సివిల్ సర్వీస్ పరీక్ష వ్రాయాలి. ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు డిగ్రీ ప్రధాన అర్హత. వయస్సు 21-32 సంవత్సరాలలోపు ఉండాలి.

మూలాలు[మార్చు]

  1. "CADRE STRENGTH OF INDIAN ADMINISTRATIVE SERVICE (AS ON 01.01.2017)" (PDF). Department of Personnel and Training, Government of India. 1 January 2017. Archived from the original (PDF) on 17 May 2017. Retrieved 21 January 2018.
  2. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; :3 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు

వెలుపలి లంకెలు[మార్చు]