Jump to content

శక్తికాంత దాస్

వికీపీడియా నుండి
శక్తికాంత దాస్
భారతీయ రిజర్వ్ బ్యాంకు 25 వ గవర్నరు
ప్రధాన మంత్రినరేంద్ర మోడీ
అంతకు ముందు వారుఉర్జిత్ పటేల్
భారత ప్రభుత్వ ఫెర్టిలైజర్స్ శాఖ
వ్యక్తిగత వివరాలు
జననం (1957-02-26) 1957 ఫిబ్రవరి 26 (వయసు 67)
భువనేశ్వర్ , ఒడిషా, భారత్
వృత్తివిశ్రాంత ఐఏఎస్ అధికారి

శక్తికాంతా దాస్(జననం 1957 ఫిబ్రవరి 26) 1980 బ్యాచ్ తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్నాడు, ఇంతకు పూర్వం భారత 15వ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా ఉన్నాడు.[1]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

దాస్ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జన్మించాడు.[2]  భువనేశ్వర్లో  పాఠశాల విద్యను పూర్తి చేసుకొని ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలు అయిన సెయింట్ స్టీఫెన్ కళాశాల నుండి  చరిత్ర అంశంలో బి.ఏ ఇంకా ఏం.ఏ  పట్టాలను పొందాడు.[3]

కెరీర్

[మార్చు]

ఐఏఎస్ అధికారిగా

[మార్చు]

దాస్ ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం అలాగే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాల శాఖ సెక్రటరీగా రెవెన్యూ శాఖ సెక్రటరీగా ఇంకా వివిధ బాధ్యతలు చేపట్టాడు. ఇతను అంతర్జాతీయ ద్రవ్య నిధి, జీ20, బ్రిక్స్, సార్క్ సమావేశాలకు భారతదేశం తరఫనుండి ప్రతినిధిగా హాజరయ్యాడు.

రిజర్వు బ్యాంకు గవర్నరుగా

[మార్చు]

2018 డిసెంబర్ 11న భారత రిజర్వ్ బ్యాంక్ 24వ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో శక్తి కాంతా దాస్ ని భారత ప్రభుత్వం ఆ పదవిలో నియమించింది.

మూలాలు

[మార్చు]
  1. "Reserve Bank of India". rbi.org.in. Retrieved 2021-04-29.
  2. Siddharta; Gupta, Surojit (12 December 2018). "Shaktikanta Das: A budget veteran comes to Mint Street". టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 12 December 2018.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Shaktikanta Das – Executive Record Sheet". Department of Personnel and Training,. Retrieved 16 December 2018.{{cite web}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: url-status (link)