Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

బ్రిక్స్

వికీపీడియా నుండి
బ్రిక్స్ సమావేశం లో

బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా అనే ఐదు ప్రధాన జాతీయ ఆర్థిక వ్యవస్థల అనుబంధానికి సంక్షిప్త రూపం, బ్రిక్స్. వాస్తవానికి మొదటి నలుగురిని 2010 లో దక్షిణాఫ్రికా ప్రవేశానికి ముందు " బ్రిక్ "గా వర్గీకరించారు. [1] ప్రాంతీయ వ్యవహారాలపై వాటికున్నగణనీయమైన ప్రభావానికి గాను బ్రిక్స్ సభ్యులు ప్రసిద్ధి చెందాయి. ఇవన్నీ జి20 లో సభ్యులే. [2] ఈ ఐదు దేశాలు కలిసి ద్వైపాక్షిక, వాణిజ్య తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చిస్తుంటాయి. ఈ సదస్సులో ఐదు దేశాలకు చెందిన దేశాధినేదలు పాల్గొంటూ వుంటారు. 2009 నుండి, బ్రిక్స్ దేశాలు ఏటా అధికారిక శిఖరాగ్ర సమావేశాలలో కలుస్తున్నాయి. బ్రిక్స్‌ దేశాల 6వ సమావేశం 2014 జూలై 13 నుంచి 17 వరకు బ్రెజిల్‌లో ఫోర్టాలెజా, బ్రసీలియాలో జరగింది. 2017 సెప్టెంబరు న జియామెన్‌లో 9 వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి చైనా ఆతిథ్యం ఇవ్వగా, [3] బ్రెజిల్ 13- 2019 నవంబరు 14 న 11 వ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది.

2015 లో, ఐదు బ్రిక్స్ దేశాలు 310 కోట్లకు పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించాయి. ప్రపంచ జనాభాలో ఇది 41%. ఐదుగురు సభ్యులలో నలుగురు (దక్షిణాఫ్రికా మినహా - అది 24 స్థానంలో ఉంది) జనాభా ప్రకారం ప్రపంచంలో మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి . 2018 నాటికి, ఈ ఐదు దేశాల నామమాత్రపు జిడిపి 18.6 ట్రిలియన్ డాలర్లు. స్థూల ప్రపంచ ఉత్పత్తిలో ఇది 23.2%. సంయుక్త జిడిపి (పిపిపి) సుమారు 40.55 ట్రిలియన్ డాలర్లు (ప్రపంచ జిడిపి పిపిపిలో ఇది 32%). వీటి సంయుక్త విదేశీ మారక నిల్వలు US$46 4.46 ట్రిలియన్లు. [4] [5] బ్రిక్స్ అనేక వ్యాఖ్యాతల నుండి ప్రశంసలను విమర్శలనూ అందుకుంది. [6] [7] [8] బ్రిక్స్ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను జోక్యం చేసుకోని, సమానత్వంతో కూడిన, పరస్పర ప్రయోజనాల ఆధారంగా నిర్వహించుకుంటాయి .

ఐదు దేశాలలోని బ్యాంకుల ఆర్థికాభివృద్ధికి ఆయా దేశ ప్రధాన మంత్రుల బృందం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచబ్యాంక్ వంటి అంతర్జాతీయ బ్యాంకులకు దీటుగా ప్రత్యేక అభివృద్ధి బ్యాంక్‌ను నెలకొల్పేందుకు బ్రిక్స్ దేశాలు సన్నద్ధమవుతున్నాయి.

సభ్య దేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాల్లో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడం బ్రిక్స్ లక్ష్యం.

చరిత్ర

[మార్చు]

"బ్రిక్" అనే పదాన్ని 2001 లో అప్పటి గోల్డ్మన్ సాచ్స్ అసెట్ మేనేజ్మెంట్ ఛైర్మన్ జిమ్ ఓ'నీల్ తన బిల్డింగ్ బెటర్ గ్లోబల్ ఎకనామిక్ బ్రిక్స్ అనే పుస్తకంలో ఉపయోగించాడు. [9] కానీ, వాస్తవానికి, అసలు నివేదికలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా ఉన్న రూప పురుషోత్తమన్ ఈ పదాన్ని కాయించింది. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; పేరు లేని ref లలో తప్పనిసరిగా కంటెంటు ఉండాలి ప్రారంభ నాలుగు బ్రిక్ జనరల్ దేశాల (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) విదేశాంగ మంత్రులు న్యూయార్క్ నగరంలో 2006 సెప్టెంబరులో ఐరాస అసెంబ్లీ జనరల్ డిబేట్ సమయంలో సమావేశమయ్యారు. వరుస ఉన్నత స్థాయి సమావేశాలను ప్రారంభించారు. [10] 2009 జూన్ 16 న రష్యాలోని యెకాటెరిన్‌బర్గ్‌లో పూర్తి స్థాయి దౌత్య సమావేశం జరిగింది. [11]

మొదటి బ్రిక్ శిఖరాగ్ర సమావేశం

[మార్చు]

యెకాటెరిన్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్ మొట్టమొదటి అధికారిక శిఖరాగ్ర సమావేశం 2009 జూన్ 16 న ప్రారంభమైంది, [12] లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, డిమిత్రి మెద్వెదేవ్, మన్మోహన్ సింగ్, హు జింటావో హాజరయ్యారు. [13] ప్రపంచ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ఆర్థిక సంస్థలను సంస్కరించడం వంటి మార్గాలపై శిఖరాగ్ర సమావేశం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో నాలుగు దేశాలు ఎలా బాగా సహకరించుకోగలవో చర్చించారు. [12] [13]  

యెకాటెరిన్బర్గ్ శిఖరాగ్ర సమావేశం తరువాత, బ్రిక్ దేశాలు కొత్త గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అవసరాన్ని ప్రకటించాయి, ఇది "విభిన్నంగా, స్థిరంగా, ఊహించగలిగేలా" ఉండాలి. [14] ఈ ప్రకటనలో యుఎస్ డాలర్ "ఆధిపత్యాన్ని" ప్రత్యక్షంగా విమర్శించనప్పటికీ (రష్యా గతంలో విమర్శించింది) ఇది డాలర్ విలువలో పతనానికి దారితీసింది. [15]

దక్షిణాఫ్రికా చేరిక

[మార్చు]

2010 లో, దక్షిణాఫ్రికా బ్రిక్ సమూహంలో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. దాని అధికారిక ప్రవేశం ఆ సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైంది. [16] చేరాలని చైనా అధికారికంగా ఆహ్వానించిన తరువాత, 2010 డిసెంబరు 24 న దక్షిణాఫ్రికా అధికారికంగా సభ్య దేశంగా మారింది [17] తరువాత ఇతర బ్రిక్ దేశాలు అంగీకరించాయి. [16] సమూహం యొక్క విస్తరించిన సభ్యత్వాన్ని ప్రతిబింబించేలా ఈ బృందానికి బ్రిక్స్ అని పేరు పెట్టారు - దక్షిణాఫ్రికా కొరకు "ఎస్" చేరింది. [18] 2011 ఏప్రిల్ లో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా, చైనాలోని సాన్యాలో జరిగిన 2011 బ్రిక్స్ సదస్సుకు పూర్తి సభ్యునిగా హాజరయ్యాడు. [19] [20] [21]

సమావేశాలు

[మార్చు]
  • బ్రిక్ మొదటి సమావేశం - 2009 జూన్‌లో రష్యాలోని యెకటేరిన్ బర్గ్‌లో జరిగింది.
  • రెండో సమావేశం - బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో 2010 ఏప్రిల్‌లో జరిగింది. ఈ సమావేశంలో దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్ కాస్తా బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది.
  • మూడో సమావేశం - చైనాలోని సన్యాలో 2011 ఏప్రిల్‌లో జరిగింది.
  • నాలుగో సమావేశం - న్యూఢిల్లీలో 2012 మార్చిలో జరిగింది.
  • ఐదో సమావేశం - దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో 2013 మార్చిలో జరిగింది.
  • ఆరో సమావేశం - బ్రెజిల్‌లోని ఫోర్ట్‌లెజాలో 2014 జూలైలో జరిగింది. ఈ సమావేశంలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నారు.
  • ఏడో సమావేశం - రష్యాలోని ఉఫాలో 2015 జూలైలో జరిగింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లకు ప్రత్యామ్నాయంగా న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు, కంటింజెన్సీ రిజర్వులను ఏర్పాటు చేశారు.
  • ఎనిమిదో సమావేశం - గోవాలో 2016 అక్టోబర్‌లో జరిగింది.
  • తొమ్మిదో సమావేశం - చైనాలోని జియోమెన్ నగరంలో 2017 సెప్టెంబర్‌లో జరిగింది.


మూలాలు

[మార్చు]
  1. "New era as South Africa joins BRICS" Archived 18 ఏప్రిల్ 2011 at the Wayback Machine . SouthAfrica.info. 11 April 2010. Retrieved 2 December 2012.
  2. China, Brazil, India and Russia were all deemed to be growth-leading countries by the BBVA: "BBVA EAGLEs Annual Report (PPT)" Archived 10 మే 2013 at the Wayback Machine . BBVA Research. 2012. Retrieved 16 April 2012.
  3. "Xiamen, host city of next annual BRICS summit". Archived from the original on 9 January 2017. Retrieved 9 January 2017.
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; IMFApr2013 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. "Amid BRICS' rise and 'Arab Spring', a new global order forms" Archived 20 అక్టోబరు 2011 at the Wayback Machine . Christian Science Monitor. 18 October 2011. Retrieved 20 October 2011.
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; BRICS Peace Defender అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. "Brics summit exposes the high wall between India and China" Archived 2 ఏప్రిల్ 2012 at the Wayback Machine . Asia Times. 2 April 2012. Retrieved 10 July 2013.
  8. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; USINPAC అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. Jim O' Neill (2001). "Building Better Global Economic BRICs" Archived 14 జూలై 2014 at the Wayback Machine . Goldman Sachs. Retrieved 13 February 2015. jai shree ram
  10. "Information about BRICS". Brics6.itamaraty.gov.br. 2013-03-27. Archived from the original on 2015-07-10. Retrieved 2017-09-04.
  11. "Cooperation within BRIC" Archived 19 జూన్ 2009 at the Wayback Machine . Kremlin.ru. Retrieved 16 June 2009.
  12. ఇక్కడికి దుముకు: 12.0 12.1 "First summit for emerging giants". BBC News. 16 June 2009. Archived from the original on 18 June 2009. Retrieved 16 June 2009.
  13. ఇక్కడికి దుముకు: 13.0 13.1 Bryanski, Gleb (26 June 2009). "BRIC demands more clout, steers clear of dollar talk". Reuters. Archived from the original on 19 June 2009. Retrieved 16 June 2009.
  14. "BRIC wants more influence". Euronews. 16 June 2009. Retrieved 16 June 2009.
  15. Zhou, Wanfeng (June 16, 2009). "Dollar slides after Russia comments, BRIC summit". Reuters. Archived from the original on 24 September 2015. Retrieved July 6, 2014.
  16. ఇక్కడికి దుముకు: 16.0 16.1 "BRIC Becomes BRICS: Changes on the Geopolitical Chessboard". Foreign Policy Journal. 21 January 2011. Retrieved 14 April 2011.
  17. "China invites South Africa to join BRIC: Xinhua". Reuters (in ఇంగ్లీష్). 2010-12-24. Retrieved 2019-06-09.
  18. Blanchard, Ben and Zhou Xin (14 April 2011). "UPDATE 1-BRICS discussed global monetary reform, not yuan" Archived 20 జూన్ 2017 at the Wayback Machine . Reuters Africa. Retrieved 26 April 2013.
  19. "South Africa joins BRIC as full member". Xinhua. 24 December 2010. Retrieved 14 April 2011.
  20. "BRICS countries need to further enhance coordination: Manmohan Singh". 12 April 2011. Retrieved 14 April 2011.
  21. "BRICS should coordinate in key areas of development: PM". 10 April 2011. Retrieved 14 April 2011.
"https://te.wikipedia.org/w/index.php?title=బ్రిక్స్&oldid=4235123" నుండి వెలికితీశారు