వాణిజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
16వ శతాబ్దంలో జర్మనీలో వాణిజ్యం

వాణిజ్యం లేదా వర్తకం అంటే సరుకులను లేదా సేవలను ఒకచోటు నుంచి మరొక చోటుకు బదిలీ చేయడం. ఇందులో తరచుగా డబ్బు చేతులు మారుతుంది. వాణిజ్యం జరగడానికి వీలు కల్పించే వ్యవస్థను మార్కెట్ అని ఆర్థికవేత్తలు వ్యవహరిస్తారు. వాణిజ్యం చేసేవారు వర్తకులు లేదా వ్యాపారులు.

తొలినాళ్ళలో వాణిజ్యం అంటే ఇరు పక్షాల వారు డబ్బుతో అవసరం లేకుండా నేరుగా వస్తువులు, సేవలు ఇచ్చి పుచ్చుకునేవారు. దీన్నే వస్తుమార్పిడి పద్ధతి అని కూడా అంటారు.[1] అధునాతన యుగంలో వర్తకులు వస్తువులు, సేవలను ఇచ్చి పుచ్చుకునేందుకు తరచుగా డబ్బునే వాడుతున్నారు. ఇద్దరు వర్తకుల మధ్య జరిగేది ద్వైపాక్షిక వాణిజ్యం (Bilateral trade). రెండు కంటే ఎక్కువ వర్తకుల మధ్య జరిగేది బహుళ పక్ష వాణిజ్యం (Multilateral trade).

మూలాలు

[మార్చు]
  1. Samuelson, P (1939). "The Gains from International Trade". The Canadian Journal of Economics and Political Science. 5 (2): 195–205. doi:10.2307/137133. JSTOR 137133.
"https://te.wikipedia.org/w/index.php?title=వాణిజ్యం&oldid=4234040" నుండి వెలికితీశారు