బి.జి.వర్గీస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బూలి జార్జ్ వర్గీస్
జననం(1926-06-21)1926 జూన్ 21
Maymyo, Burma
మరణం2014 డిసెంబరు 30(2014-12-30) (వయసు 88)
న్యూఢిల్లీ, ఇండియా
విద్యడూన్ పాఠశాల
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
వృత్తిజర్నలిస్టు, సంపాదకుడు

బూలి జార్జ్ వర్గీస్(21 జూన్ 1927 – 30 డిసెంబరు 2014) 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్', 'హిందూస్థాన్ టైమ్స్' ఆంగ్ల పత్రికల ఎడిటర్‌గా ఆయన పనిచేశారు.[1][2] 1975 లో ఆయనకు రామన్ మెగసెసే అవార్డు జర్నలిజం సేవలకుగానూ వచ్చింది. 1986 తరువాత ఆయన న్యూఢిల్లీ థింక్ టాంక్(సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్]] కు సహకారం అందించారు.[3] [4]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన డూన్ స్కూల్ లో చదివారు. తరువాత సెయింట్స్ స్టీఫెన్ కళాశాల,న్యూఢిల్లీ లో ఆర్థికశాస్త్రాన్ని అభ్యసించారు. కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కాలేజీ లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.[5]

వర్గీస్ 1966 నుంచి 1969 వరకూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి సమాచార వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించారు[6] .1969 నుండి 1975 వరకు హిందూస్థాన్ టైమ్స్ కు ఎడిటరుగా పనిచేసారు. అయితే, 1975లో ఇందిర అత్యయిక పరిస్థితి విధించడాన్ని ఆయన వ్యతిరేకించారు[7].అందువల్ల ఉద్యోగాన్ని కోల్పోయారు. పౌరహక్కుల రక్షణకోసం ఆయన ఎంతో కృషిచేశారు.1982 నుండి 1986 వరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కు ఎడిటరుగా వ్యవహరించారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై ఏర్పాటైన ఎడిటర్స్ గిల్డ్ నిజనిర్ధారణ సంఘంలో సభ్యుడుగా ఉన్నారు. 'వాటర్స్ ఆఫ్ హోప్', 'ఇండియాస్ నార్త్ ఈస్ట్' 'ఫోర్త్ ఎస్టేట్(2005)' వంటి పుస్తకాలు రాశారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వర్గీస్‌కు భార్య జమీలా, కుమారులు విజయ్, రాహుల్ ఉన్నారు.

మరణం

[మార్చు]

రెండు వారాలుగా డెంగీ జ్వరం, శారీరక బలహీనతతో బాధపడిన వర్గీస్ క్రమంగా వ్యాధినిరోధక శక్తి క్షీణించడంతో 2014 డిసెంబరు 30 మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.[8]

మూలాలు

[మార్చు]
  1. "ప్రముఖ జర్నలిస్తు బీజీ వర్గీస్ కన్నుమూత". Archived from the original on 2016-03-05. Retrieved 2015-08-02.
  2. "BIOGRAPHY of Boobli George Verghese". Ramon Magsaysay Award Foundation. September 1975. Archived from the original on 2012-04-02. Retrieved 2011-09-25.
  3. "Be armed with facts on J&K: B.G. Verghese". The Hindu. Chennai, India. 8 October 2006. Archived from the original on 7 డిసెంబరు 2007. Retrieved 2 ఆగస్టు 2015.
  4. "Endgame looms as nuclear deal strains Indian government". Reuters. 19 August 2007.
  5. BG Verghese Writings and Commentaries
  6. BG Verghese Writings and Commentaries - Outlook magazine excerpt on the 1966 rupee devaluation rollercoaster, from B G Verghese's memoirs, First Draft: The Making of Modern In...
  7. The essential BG Verghese - Bangalore - DNA
  8. ప్రముఖ జర్నలిస్ట్ వర్గీస్ కన్నుమూత[permanent dead link]