ఇలా భట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇలా భట్
జననం (1933-09-07) 1933 సెప్టెంబరు 7 (వయసు 90)
అహ్మదాబాద్
పౌరసత్వంఇండియన్
విద్యB.A., LL.B.; Diploma of Labor and Cooperatives;
విద్యాసంస్థSarvajanik Girls High School, Surat; M.T.B. College, Surat; Afro-Asian Institute of Labor and Cooperatives, Tel Aviv
వృత్తిలాయర్ , భారతీయ సహకార నిర్వాహకుడు
జీవిత భాగస్వామిరమేష్ భట్
పురస్కారాలుపద్మ శ్రీ, పద్మ విభూన్

ఇలా భట్ ( జననం: సెప్టెంబర్ 7, 1933) భారతీయ సహకార నిర్వాహకుడు, కార్యకర్త, గాంధేయన్.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఈమె 1972 లో స్వయం ఉపాధి మహిళల సంఘం (SEWA) ను స్థాపించారు. 1972 నుండి 1996 వరకు దాని ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈమె ప్రస్తుతం గుజరాత్ విద్యాపీట్ కి ఛాన్సలర్ ఉంది.[1]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఈమె 1933, సెప్టెంబర్ 7 న వనలీలా వ్యాస్, సుమంత్రాయ్ భట్ దంపతులకు అహ్మదాబాద్ లో జన్మించింది. ఈమె బాల్యం సూరత్ నగరంలో గడిచింది. ఈమె ప్రాథమిక విద్యను 1940 నుండి 1948 వరకు సర్వజానిక్ బాలికల ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. ఈమె 1952 లో సూరత్‌లోని దక్షిణ గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా అందుకుంది. 1954 లో హిందూ చట్టంపై న్యాయశాస్త్ర డిగ్రీని అభ్యసించి అందులో బంగారు పతకాన్ని అందుకుంది. ఈమె తండ్రి న్యాయవాది, తల్లి వనలీలా వ్యాస్ మహిళా ఉద్యమంలో చురుకుగా, కమలాదేవి చటోపాధ్యాయ స్థాపించిన ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్కు కార్యదర్శిగా కూడా ఉన్నారు.

కెరీర్

[మార్చు]

ఈమె ముంబైలోని ఎస్ఎన్డిటి ఉమెన్స్ యూనివర్శిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఈమె 1955 లో అహ్మదాబాద్‌లోని టెక్స్‌టైల్ లేబర్ అసోసియేషన్ (టిఎల్‌ఎ) లో లీగల్ విభాగంలో పనిచేశారు. ఈమె 1979 లో ఎస్తేర్ ఓక్లూ, మైఖేలా వాల్ష్ లతో కలిసి ఉమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకులలో ఒకరుగా ఉన్నారు. ఇంటర్నేషనల్ అలయన్స్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ యొక్క హోమ్ నెట్ యొక్క SEWA కోఆపరేటివ్ బ్యాంక్ చైర్ పర్సన్ గా పనిచేశారు. ఈమెకు జూన్ 2001 లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం హ్యూమన్ లెటర్స్‌లో గౌరవ డాక్టరేట్ డిగ్రీని ఇచ్చి సత్కరించింది. 2012 లో జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ హ్యూమన్ లెటర్స్లో నుండి గౌరవ డాక్టరేట్ ను, బెల్జియంలోని బ్రస్సెల్స్ యూనివర్సిటీ లిబ్రే డి బ్రక్సెల్లెస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆమె యేల్, నాటల్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్లను పొందారు. ఈమెకు 1985 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ, 1986 లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1977 లో కమ్యూనిటీ లీడర్‌షిప్ కోసం రామోన్ మాగ్సేసే అవార్డు, 1984 లో రైట్ లైవ్‌లిహుడ్ అవార్డును అందుకుంది. 2012 లో నిరుపేద మహిళలను సాధికారత సాధించిన కృషికి గాను 2010 కొరకు నివాానో శాంతి బహుమతికి ఎంపికైంది. నవంబరు 2010 న అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ భారతదేశంలో ఒక మిలియన్ మందికి పైగా పేద మహిళల సాధికారత కోసం సహాయం చేసినందుకు గ్లోబల్ ఫెయిర్‌నెస్ ఇనిషియేటివ్ అవార్డుతో సత్కరించారు. సమాజంలో గణనీయమైన ప్రభావాన్ని చూపిన మహిళలను ఉద్ధరించడానికి ఆమె చేసిన కృషికిగాను 2011 మే 27 న రాడ్‌క్లిఫ్ పతకంతో సత్కరించారు. ఈమె తన జీవితాన్ని అట్టడుగు వర్గాల మహిళల సాధికారపరచడంలో తన జీవితాన్ని అంకితం చేసినందుకు నవంబరు 2011 లో ఇందిరా గాంధీ బహుమతికి ఎంపికయ్యారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈమె 1956 లో రమేష్ భట్ ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు అమీమాయి (1958), మిహిర్ (1959) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం, ఈమె తన కుటుంబంతో కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నివసిస్తోంది. ఆమె తన 89వ యేట 2022 నవంబర్ 2న మరణించింది. [2]


మూలాలు

[మార్చు]
  1. "Awardees Biography". Ramon Magsaysay Award Foundation. Archived from the original on 10 June 2016. Retrieved 8 November 2013.
  2. "SEWA founder Elaben Bhatt passes away". DeshGujarat (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-11-02. Retrieved 2022-11-03.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇలా_భట్&oldid=3803629" నుండి వెలికితీశారు