ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా)
![]() | ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
ఇబ్రహీంపట్నం | |
— జనగణన పట్టణం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°35′33″N 80°31′13″E / 16.592468°N 80.520409°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | ఇబ్రహీంపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | అజ్మీరా స్వర్ణ |
జనాభా (2011) | |
- మొత్తం | 29,432 |
- పురుషుల సంఖ్య | 13,690 |
- స్త్రీల సంఖ్య | 15,742 |
- గృహాల సంఖ్య | 5,572 |
పిన్ కోడ్ | 521 456 |
ఎస్.టి.డి కోడ్ | 0866 |
ఇబ్రహీంపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన జనగణన పట్టణం.ఇబ్రహీంపట్నం మండలానికి పరిపాలనా కేంద్రం
జనాభా గణాంకాలు[మార్చు]
2011 జనాభా గణాంకాల ప్రకారం జనాభా -మొత్తం 29432 -పురుషులు 13690 -స్త్రీలు 15742 -గృహాలు 5572 -అక్షరాస్యులు 20673 2001జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 91245 -పురుషులు 46772 -స్త్రీలు 44482
సమీప గ్రామాలు[మార్చు]
గుంటుపల్లి 4 కి.మీ, తేలప్రోలు 4 కి.మీ, బత్తినపాడు 5 కి.మీ, రాయనపాడు 6 కి.మీ, కొండపల్లి 3 కి.మీ[1]
రవాణా సౌకర్యాలు[మార్చు]
ఇబ్రహీంపట్నం, కొండపల్లి నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 17 కి.మీ
విద్యాసౌకర్యాలు[మార్చు]
- ఎఎఐఎంఎస్:- ఇబ్రహీంపట్నం కృష్ణానదీ శివారు ప్రాంతంలో, 2017, జూన్ 14 న అమరావతి అమెరికన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (A.A.I.M.S) స్థాపనకు శంకుస్థాపన నిర్వహించెదరు.
- జాకీర్ హుస్సేన్ కళాశాల.
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న వై.వి.నారాయణరావు, ఇటీవల బీహరు రాష్ట్ర బాల్ బ్యాడ్ మింటన్ అసోసిసియేషన్ నిర్వహించిన పోటీలలో రిఫరీగా వ్యవహరించి, మన్ననలు పొంది, జాతీయస్థాయి రిఫరీగా ఎంపికైయ్యాడు.
- గిరిజన బాలుర వసతి గృహం.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ప్రసాదునగర్.
- అన్నమ్మ బధిరుల పాఠశాల.
మౌలిక వసతులు[మార్చు]
ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం[మార్చు]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, ఈ వైద్యశాలను కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ వైద్యశాల వైద్యులు పద్మావతి, ఈ పురస్కారాన్ని, 2017, ఏప్రిల్ 7న విజయవాడలో, కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ గంధం చంద్రుడు చేతులమీదుగా అందుకున్నారు.
బ్యాంకులు[మార్చు]
సాగునీటి సౌకర్యం[మార్చు]
గజరాజు చెరువు.
గ్రామ పంచాయితీ[మార్చు]
- 20 వార్డులున్న ఈ గ్రామ పంచాయతీ ఏర్పడిన తొలిరోజులలో ఆవుల స్వరాజ్యలక్ష్మి 5 నెలలు ఈ గ్రామ సర్పంచిగా పనిచేసింది. 2001 లో జోగి నాగమణి, 2006 లో మల్లెల అనంతపద్మనాభరావు ఈ గ్రామానికి సర్పంచులుగా ఎన్నికైనాడు.
- 2013 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో అజ్మీరా స్వర్ణ సర్పంచిగా గెలుపొందింది. ఉపసర్పంచిగా కనకదుర్గ ఎన్నికైంది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం: స్థానిక ఏ-కాలనీలోని ఈ ఆలయంలో, 2017,జూన్-15వతేదీ గురువారంనాడు, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, స్వామివారికి గరుడోత్సవ సేవలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా, మద్యాహ్నం సమయంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించుచున్నారు.
శ్రీ అభయసాయి మందిరం: ఈ ఆలయం స్థానిక ఎ-కాలనీలో ఉంది.
శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం: ఈ ఆలయం స్థానిక ఎ-కాలనీలో ఉంది.
శ్రీ అంకమ్మతల్లి ఆలయం: ఈ ఆలయం స్థానిక ఫెర్రీ వద్ద ఉంది.
శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం, శ్రీ నరసింహస్వామివారి ఆలయం: గ్రామంలోని శ్రీ అంకమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఈ రెండు ఆలయాలు నెలకొనియున్నవి.
ప్రధాన పంటలు[మార్చు]
ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయాధారిత వృత్తులు .
గ్రామ ప్రముఖులు[మార్చు]
- ఆచంట వెంకటరత్నం నాయుడు, పౌరాణిక కళాకారుడు.
గ్రామ విశేషాలు[మార్చు]
గన్నవరానికి చెందిన నిడమర్తి నానితావర్మ అనే విద్యార్థిని, స్థానిక పాఠశాలలో ఏడవ తరగతి చదివే సమయంలో. 2017, మార్చిలో "నాసా" నిర్వహించిన ఒక పరీక్ష వ్రాసి, అర్హత సాధించి 2017, మే నెలలో అమెరికా వళ్ళి, అక్కడ నాసాలో "ప్రపంచంపై కాలుష్యం ప్రభావం" అను అంశంపై మాట్లాడింది.
మూలాలు[మార్చు]
- ↑ "ఇందుపల్లి". Retrieved 14 June 2016.