నందిగామ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నందిగామ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నందిగామ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 953
 - పురుషుల సంఖ్య 472
 - స్త్రీల సంఖ్య 481
 - గృహాల సంఖ్య 237
పిన్ కోడ్ 521 185
ఎస్.టి.డి కోడ్ 08678
నందిగామ
—  మండలం  —
కృష్ణా జిల్లా జిల్లా పటములో నందిగామ మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో నందిగామ మండలం యొక్క స్థానము
నందిగామ is located in Andhra Pradesh
నందిగామ
ఆంధ్రప్రదేశ్ పటములో నందిగామ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°47′00″N 80°18′00″E / 16.7833°N 80.3000°E / 16.7833; 80.3000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము నందిగామ
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 85,405
 - పురుషులు 43,579
 - స్త్రీలు 41,826
అక్షరాస్యత (2001)
 - మొత్తం 63.09%
 - పురుషులు 71.99%
 - స్త్రీలు 53.79%
పిన్ కోడ్ 521185

నందిగామ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక పట్టణము, మండలము. పిన్=521 185., ఎస్.టి.డి.కోడ్=08678.

ఎంతోకాలముగా మేజరు పంచాయతీగా ఉన్న నందిగామను మున్సిపాలీటీగా మార్చాలని చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వము నుండి 2011 సం.న ఆమోదము లభించినది. 2011 సంవత్సరానికి మొత్తము జనాభా షుమారు 50,000. మొత్తము వార్డులు 21. వార్షిక ఆదాయము షుమారు 2 కోట్లు.

నందిగామలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

 1. శివాలయం:- వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, షుమారుగా 400 సంవత్సరాల క్రితం కట్టించారు.ఈ దేవాలయము (పంచలింగక్షేత్రము)గా ప్రసిద్ధిచెందిన మహా శివక్షేత్రము ఉన్నది. అందువలన (నందిగామ) అను పేరువచ్చినది ఈఆలయము ఇప్పుడు దేవాదాయధర్మాదాయ శాఖవారి ఆధీనములోఉండి వాసిరెడ్డి రామనాథ బాబుధర్మ కర్తగా ఉన్నారు. ఈ దేవాలయములో ప్రతిపూర్ణిమకు మరియు మాసశివరాత్రికి ప్రత్యేకపూజలు జరుగుతాయి కార్తీకమాసమందు నెలరోజుల పాటు భక్తుల గోత్ర నామములతో అభిషేకములు, కార్తీక పూర్ణిమ రోజు జ్వాలాతోరణము, కార్తీక మాస శివరాత్రిరోజు లక్షబిళ్వార్చన చాలా బాగా జరుగును.
 2. రామాలయం:- రామాలయము శ్రీరామనవమికి కళ్యాంణము జరుగును. 2011వ సంవత్సరములో జరిగిన కల్యాణము, మన గవర్నరు, ఇ.యస్.యన్.ల్. నరసింహన్ గారి చేతుల మీదుగా బ్రహ్మాండముగా జరిగినది.
 3. మరిడ్డి మహాలక్ష్మి దేవాలయం:- ఈ దేవాలయమును రాష్ట్ర ప్రథమస్పీకరు అయిన శ్రీఅయ్యదేవర కాలేస్వరరావుపంతులుగారు నిర్మించారు. ఈదేవాలయము శిథిలము చెందగా, మరల వారికుమారులు క్రిష్ణమోహనరావుగారు శ్రీ దుర్భాకుల సుబ్రహ్మణ్యకామేశ్వర ఘనపాఠిగారి పర్యవేక్షణలో పునర్నిర్మాణముకావించీ మరియు అమ్మవారి మూల విరాట్టుతో సహా ప్రతిష్ఠలు చేయించి అత్యంత సుందరముగా తీర్చిదిద్దినారు.
 4. శ్రీ గోవిందమాంబా సమేత శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి 325వ ఆరాధనోత్సవాలు 2015,మార్చ్-15వ తేదీ ఆదివారం ప్రారంభమైనవి. ఈ సందర్భంగా మూలవిరాట్టులకు పంచామృతాభిషేకం నిర్వహించారు. నూతన వస్త్రాలు, పుష్పాలతో అలంకరించారు. దంపతులతో శాంతిహోమం చేయించారు. విచ్చేసిన భక్తులతో ఆలయం క్రిక్కిరిసిపోయినది. [6]
 5. శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం:- నందిగామ చందమామపేటలోని ఈ పురాతన ఆలయంలో, దాతల ఆర్ధిక సహకారంతో, పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుచున్నవి. [7]
 6. శ్రీ సాయి అయ్యప్ప ఆలయం:- ఈ ఆలయ చతుర్ధ వార్షికోత్సవాలు, 2015,మే నెల-21,22,23 తేదీలలో వైభవంగా నిర్వహించెదరు. మూడవరోజు, 23వ తేదీ శనివారంనాడు, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [8]
 7. శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయం:- నందిగామ పాత బస్సుస్టాండులోని ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2015,మే నెల-23వ తేదీ శనివారంనాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, కాణిపాకం ఆలయంలో మాదిరిగా, ఈ ఆలయంలో, సిద్ధి, బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి కళ్యాణాన్ని, వేదపండితుల ఆధ్వర్యంలో, వేదోక్తంగా నిర్వహించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చుని, కన్యాదాతలుగా వ్యవహరించారు. అనంతరం, విచ్చేసిన భక్తాదులకు అన్నసమారధన నిర్వహించారు. [9]
 8. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయం నందిగామ చెరువు బజారులో ఉన్నది.

ప్రముఖులు[మార్చు]

 • అయ్యదేవర కాళేశ్వరరావు వీరు రాష్ట్ర శాసనసభకు ప్రథమ స్పీకరు. నందిగామ గ్రామం మొత్తం అయ్యదేవర వంశీకుల అగ్రహార గ్రామము. అయ్యదేవర కాళేశ్వరరావు (జనవరి 22,1882 - ఫిబ్రవరి 26,1962) స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు. వీరు కృష్ణా జిల్లా నందిగామ లో లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు 1882 సంవత్సరంలో జన్మించారు. 1901 లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత బి.ఎల్. పరీక్షలో నెగ్గి విజయవాడలో న్యాయవాదిగా పనిచేశారు. జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేశారు.స్వాతంత్ర్యానంతరం1955లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు అయ్యదేవర కాళేశ్వరరావును తొలి స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ స్పీకరుగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు, కానీ ఫలితాలు వెలువడడానికి ముందురోజే తుదిశ్వాస వదిలాడు.విజయవాడలో పేరొందిన మునిసిపల్ మార్కెట్ ఈయన పేరు మీదుగా నిర్మించారు అదే కాళేశ్వరరావు మార్కెట్.

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

పూర్తి వ్యాసం నందిగామ శాసనసభ నియోజకవర్గం లో చూడండి.

సమీప గ్రామాలు[మార్చు]

[1] జగ్గయ్యపేట, కోదాడ్, సత్తెనపల్లి, మంగళగిరి

సమీప మండలాలు[మార్చు]

చందర్లపాడు, వీరుళ్ళపాడు, కంచికచెర్ల, పెరుగంచిప్రోలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

జగ్గయ్యపేట నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు. విజయవాడ రైల్వేస్టేషన్ 50 కి.మీ

విద్యా సౌకర్యాలు[మార్చు]

నందిగామలో మొదట్లో ఎన్.టి.రామారావుగారి పేరిట కాలేజీని స్థాపించారు. కానీ ఆ మహానటుడి నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందకపోవడంతో ఆ తరువాత ఈ కాలేజీని ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కాకాని వెంకటరత్నం గారి పేరిట కె.వీ.ఆర్ కాలేజీగా మార్చారు. ఈ కాలేజీలో చదవి ఐఐఎస్, డాక్టర్లు, ఇంకా జర్నలిస్టులు వంటి అనేక రంగాల్లో ప్రముఖులైన వారు ఉన్నారు. ప్రస్తుతం ఈ కాలేజీకి తుర్లపాటి కోటేశ్వరరావు ప్రిన్స్ పాల్ గా ఉన్నారు. తుర్లపాటి నాగభూషణ రావు కేవీఆర్ కాలేజీలో చదివి (బీఎస్సీ ఫస్ట్ బ్యాచ్- 1975 - 78) అనంతరం జర్నలిస్ట్ గా ఈనాడు, ఆంధ్రప్రభ, టివీ5 వంటి సంస్థల్లో పనిచేశారు. వీరు యునెసెఫ్, నంది అవార్డులు అందుకున్నారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

 1. 2001లో నందిగామ మేజరు పంచాయతీ గా ఉన్నాప్పుడు, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, 27 ఏళ్ళ వయసు లోనే శాఖమూరి స్వర్ణలత సర్పంచిగా పోటీచేసి గెలుపొందారు. గెలవగానే ఈమె మిగతావారిలాగా భర్తకు పెత్తనమిచ్చి ఇంటికే పరిమైతం కాలేదు. తన బాధ్యతలను తానే నిర్వహించారు. వీధి దీపాల సమస్య రాకుండా చూశారు. అంతర్గత రహదారులు అభివృద్ధి చేయటంతో పాటు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. యాభై వేల జనాభా ఉన్న నందిగామలో మహిళ అయినప్పటికీ ప్రజలకుఅందుబాటులో ఉంటూ పనిచేయటంతో రెండుసార్లు కలెక్టర్, ఒకసారి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారి చేతులమీదుగా ఉత్తమ సర్పంచి పురస్కారం అందుకున్నారు. [2]
 2. రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న నందిగామ పంచాయతీకి స్వతంత్రంగా పోటీచేసి, మూడుసార్లు సర్పంచిగా ఎన్నికై రికార్డు సృష్టించారు, శ్రీ యరగొర్ల వెంకటనరసింహంగారు. రాజకీయ ఉద్దండులు నిలబెట్టిన అభ్యర్ధులపై విజయం సాధించి, 1981 మే 30 నుండి 2001 ఆగష్టు 14 వరకూ, వరుసగా 20 ఏళ్ళపాటు ఈ గ్రామ సర్పంచిగా పని చేశారు. ప్రస్తుత పంచాయతీ భవననిర్మాణం, కీసర నుండి నందిగామ వరకూ మఛ్నీటి పధకం ఆయన చేయించినవే. మునిసిపల్ కాంప్లెక్స్ నిర్మాణం ఈయన హయాంలో జరిగినవే.

సాంస్కృతిక సంస్థలు[మార్చు]

బళ్ళారి రాఘవ కళాసమితి[మార్చు]

తెలుగు పద్య నాటకం ఉన్నంత వరకు, బళ్ళారి రాఘవ పేరు చిరస్థాయిగా నిలిచిపోవును. నందిగామలో ఆ మహానుభావుని పేరుమీద, ఈ సంస్థను 50 సంవత్సరాలక్రితం స్థాపించారు. దీని వ్యవస్థాపకులు గోపాల కృష్ణసాయి. ఈ సంస్థలో ప్రతి సంవత్సరం బళ్ళారి రాఘవ జయంతిని ఘనంగా నిర్వహించుచున్నారు. ఈ సంస్థ స్థాపించినప్పటి నుండి, దాతల సహకారంతో, కళారంగంలో పేరుపొందిన ప్రముఖుల జయంతి, వర్ధంతులను క్రమం తప్పకుండా నిర్వహించుచున్నారు. ఈ సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు, 2014, ఆగష్టు-9న స్థానిక ఏ.ఎం.సి. కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి శ్రీ వసంత నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో, ఆంష్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ ప్రసంగించి, బళ్ళారి రాఘవ నాటకరంగానికి చేసిన కృషిని కొనియాడినారు. ఆరోజు సాయంత్రం ఆరు గంటలకు కళాకారులు జాతీయ, దేశభక్తి, అభ్యుదయ గీతాలు ఆలపించారు. అనంతరం ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నవి. [4] & [5]

అనాసాగారం[మార్చు]

అనాసాగారం గ్రామం జాతీయ రహదారి 9కి ఆనుకొని వున్నది మరియు నందిగామ నుండి రెండు కి.మీ.ల దూరంలో వున్నది. ఇప్పుడు ఈ గ్రామం నందిగామలో పూర్తిగా కలిసిపోయినది. ఈ గ్రామం ఇప్పుడు నందిగామలో ఒక వార్డుగా వున్నది. అనాసాగారంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 తరగతి వరకు విద్యాబోధన జరుగుతున్నది. ఇతర గ్రామాల నుండి కూడా విద్యార్థులు ఈ పాఠశాలకు హాజరు అవుతున్నారు. ఈ పాఠశాల కొర్లపాటి చిన్నమల్లయ్యగారి ప్రోద్భలముతో నిర్మించబడినది. ఆ తరువాత వివిధ రాజకీయ నాయకులు దీని అభివృద్దికి తొడ్పడినారు.

గ్రామాలు[మార్చు]

జనాభా[మార్చు]

 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా పట్టిక :[2]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అడవిరావులపాడు 452 1,916 974 942
2. అంబారుపేట 440 1,941 975 966
3. చందాపురం 416 1,700 856 844
4. దాములూరు 427 1,791 897 894
5. గోళ్ళమూడి 495 2,127 1,101 1,026
6. ఐతవరం 524 2,157 1,122 1,035
7. జొన్నలగడ్డ 459 1,994 1,031 963
8. కంచల 718 2,769 1,401 1,368
9. కేతవీరుని పాడు 439 1,931 947 984
10. కొణతమాత్మకూరు 471 1,704 874 830
11. కొండూరు 404 1,743 895 848
12. లచ్చపాలెం 73 301 144 157
13. లింగాలపాడు 471 1,908 997 911
14. మాగల్లు 884 3,758 1,914 1,844
15. మునగచెర్ల 363 1,419 731 688
16. నందిగామ 8,478 37,569 19,262 18,307
17. పల్లగిరి 391 1,673 872 801
18. పెద్దవరం 1,060 4,488 2,303 2,185
19. రాఘవాపురం 1,001 4,079 2,035 2,044
20. రామిరెడ్డిపల్లి 584 2,401 1,184 1,217
21. రుద్రవరం 430 1,878 975 903
22. సత్యవరం 42 252 129 123
23. సోమవరం 354 1,506 739 767
24. తక్కెళ్ళపాడు 471 1,663 844 819
25. తొర్రగుడిపాడు 185 737 377 360

చిత్రమాలిక[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 953 - పురుషుల సంఖ్య 472 - స్త్రీల సంఖ్య 481 - గృహాల సంఖ్య 237
జనాభా (2001) -మొత్తం 37569 -పురుషులు 19262 -స్త్రీలు 18307 -గృహాలు 8478 -హెక్టార్లు 2590

తెలుగు ప్రధానభాష

మూలాలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Nandigama/Nandigama". Retrieved 12 June 2016. 
 2. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

బయటి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013,జులై-15; 8వ పేజీ. [3] ఈనాడు కృష్ణా; 2013,జులై-16; 8వ పేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,ఆగష్టు-3; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2014,ఆగష్టు-10; 16వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2015,మార్చ్-16; 3వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015,మే నెల-12వతేదీ; 34వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,మే నెల-20వతేదీ; 37వపేజీ. [9] ఈనాడు కృష్ణా; 2015,మే నెల-24వతేదీ; 17వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=నందిగామ&oldid=1969164" నుండి వెలికితీశారు