అడివిరావులపాడు
అడివిరావులపాడు | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°46′N 80°13′E / 16.767°N 80.217°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ |
మండలం | నందిగామ |
విస్తీర్ణం | 6.83 కి.మీ2 (2.64 చ. మై) |
జనాభా (2011) | 2,101 |
• జనసాంద్రత | 310/కి.మీ2 (800/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 1,063 |
• స్త్రీలు | 1,038 |
• లింగ నిష్పత్తి | 976 |
• నివాసాలు | 544 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08678 ) |
పిన్కోడ్ | 521185 |
2011 జనగణన కోడ్ | 588876 |
అడివిరావులపాడు ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నందిగామ నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 37 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 544 ఇళ్లతో, 2101 జనాభాతో 683 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1063, ఆడవారి సంఖ్య 1038. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 929 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 106. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588876. 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం కృష్ణా జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [2][3]
గణాంకాలు
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1916. ఇందులో పురుషుల సంఖ్య 974, స్త్రీల సంఖ్య 942, గ్రామంలో నివాసగృహాలు 452 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 683 హెక్టారులు.
సమీప గ్రామాలు
[మార్చు]చందాపురం 3 కి.మీ, చిననందిగామ 4 కి.మీ, మునగచెర్ల 4 కి.మీ, ముప్పాళ్ళ 4 కి.మీ, కోనాయపల్లె 5 కి.మీ
గ్రామం పేరు వెనుక చరిత్ర
[మార్చు]అడవి రావులపాడు గ్రామం పేరు ఎలా వచ్చిందంటే, ఈ అగ్రహారాన్ని తుర్లపాటి వంశస్థులకు ఇచ్చేటప్పుడు ఆ ప్రాంతమంతా అడవి. తుర్లపాటి వంశస్థుల పేర్ల చివర రావు అనే శబ్దం ఉండేది. కనుక ఈ గ్రామం అడవిరావులపాడుగా మారిందని చెబుతుంటారు. ఆత్మీయతలకు, అనుబంధాలకు ఆలవానమైన ఈ గ్రామంలో అభివృద్ధిని అత్యవసరంగా స్థానికులు భావిస్తున్నారు. అడవిరావులపాడు గ్రామంలో తుర్లపాటి మల్లిఖార్జున వరప్రసాదరావు తల్లి తుర్లపాటి అన్నపూర్ణమ్మ అనేక గుప్తదానాలు చేశారు. ఆ ఊరిలో తుర్లపాటివంశస్థులచే శివాలయం 120 సంవత్సరాల క్రితం నిర్మించారు.ఈ ఆలయం 1989లో పునర్నిర్మాణం తుర్లపాటి సంగమేశ్వరరావు, గ్రామస్థుల సహకారంతో దుర్భాకులవేంకటేశ్వరఅవధాని జీర్ణోధ్దరణ పునఃప్రతిష్ఠలుచేసి, దేవాలయాన్నిఅత్యద్భుతంగా తీర్చిదిద్దారు . పూర్వం అమరావతి జమిందారు వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా కొంతమంది భిల్లులను చంపటం జరిగింది. దానికి పరిహారంగా వేయి శివాలయాలను కట్టించమని రాజ పురోహితులు చెప్పారు.కొన్ని కట్టించారు.తరువాత, 'దేహోదేవాలయో ప్రోక్తా' అనే ధర్మాన్ని అనుసరించి లింగదారి కూడా శివాలయంతో సమానమని లింగదారిగా మారే నియోగి బ్రాహ్మణులకు అగ్రహారం ఇస్తానని చెప్పడంతో, పూర్వీకులు లింగదారులుగా మారారని చెప్తారు.అలా ఇవ్వబడిందే అడవిరావులపాడు అగ్రహారం (సుమారు 2000 ఎకరాలు). ఆ పైన ఇవ్వబడిన 2000 ఎకరాలలో తూర్పు, దక్షిణ పడమటి ముఠాల వారికి ఒక్కక్కరికి 600 ఎకరలున్నూ, మిగత 200 ఎకరాలు గ్రామ కంఠం + రుద్ర భూమి కిన్నూ ఏర్పాటు చేయటం జరిగింది.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి. జగ్గయ్యపేట, నందిగామ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 52 కి.మీ దూరంలో ఉంది.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది. పాఠశాలను తుర్లపాటి సంగమేమేశ్వరారావు&వీరభద్రావు కుమారులు&కుమార్తెలు 2010లోశ్రీ దుర్భాకులసుబ్రహ్మణ్యఘనపాఠీ ప్రవేక్షణలో నిర్మిచినారు బాలబడి, ప్రాథమిక పాఠశాల నందిగామలోను, ప్రాథమికోన్నత పాఠశాల లింగాలపాడులోను, మాధ్యమిక పాఠశాల లింగాలపాడులోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నందిగామలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ నందిగామలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నందిగామలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.
మౌలిక సదుపాయాలు
[మార్చు]ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.
గ్రామ పంచాయతీ
[మార్చు]2020 సంవత్సరం గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికలలో సూరా కొండలరావు భార్య ఈ గ్రామ పంచాయితీ సర్పంచిగా ఎన్నికైంది.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు
[మార్చు]- శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివారిదేవాలయం
- శ్రీదాసాంజనేయస్వామివారిదేవాలయం,
- శ్రీరామాలయం
- ఇంకా 3 చర్చీలు ఉన్నాయి
గ్రామ విశేషాలు
[మార్చు]ఆ ఉరులో దుర్భాకుల వెంకటేశ్వర అవధాని మహాపండితులు. అతను సుమారు 250 దేవతా ప్రతిష్ఠలు చేయించి బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వారు ఆంధ్రప్రదేశ్ ప్రథమ శాసనసభస్పీకర్, అయ్యదేవరకాళేశ్వరరావు అప్పటి సెంట్రల్ ఇరిగేషన్ మినిష్టర్, కె.యల్.రావు గార్లకు గురువుగా, ఇంటిబ్రహ్మగా ప్రసిధ్దిగాంచాడు.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]అడివిరావులపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 64 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 5 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 6 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 8 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 29 హెక్టార్లు
- బంజరు భూమి: 85 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 484 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 531 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 67 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]అడివిరావులపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 37 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 30 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]అడివిరావులపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".