మిరప
కేప్సికం | |
---|---|
![]() | |
ఎర్ర మిరప, నిలువుకోత | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
జాతులు | |
|
మిరపను ఇప్పుడు ప్రపంచమంతా పండిస్తున్నారు. "కేప్సికమ్" అనే జీనస్ కు చెందిన ఈ మిరప అనేక రూపాలలో లభ్యమవుతుంది. చిలీ పెపర్ అనే మిరపకు పుట్టిల్లు అమెరికా కాగా, లాంగ్ పెపర్ అనేది మన భారత ఉపఖండానికి చెందినది. ఈ మిరపను భారతీయులు ఆయుర్వేదంలో వాడిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇది ఘటుగా ఉంటది. వాసన చూస్తే తుమ్ములోస్తవి. తింటే హా హా అనాలి. ఇది లేకుంటే అంతా సప్పసప్పన.
- ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, కడపజిల్లా,మైలవరం మండలం, తొర్రివేముల గ్రామంలో విరివిగా మిరపను పండిస్తారు
ఉపయోగాలు[మార్చు]
- ఆహార పదార్థాలలో;
పచ్చి మిరపను, ఎండుమిరపను, కొన్ని రకాలను మసాల, కూరగాయలుగా ఉపయోగిస్తారు.
- మందుల తయారీలో;
మందుల తయారీలలోనూ తరచుగా మిరపను ఉపయోగిస్తున్నారు.
- మిరప పొడిలో ఉండే కేప్సాయ్‌సిన్ రసాయనం బరువును తగ్గిస్తుంది, కొవ్వు పెరగకుండా చూస్తుంది.ఈ రసాయనం కొవ్వులో ఉండే సుమారు 20 ప్రొటీనుల స్థాయిని నియంత్రిస్తుంది.
మిరపలో ఉండే కాప్‌సాసిన్ రక్తపోటుపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.మిరపలో ఉన్న ప్రత్యేక గుణాలు నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా రక్తనాళాలు సురక్షితంగా ఉంటాయి.
రకాలు[మార్చు]
గుంటూరు రకం మిరప మేలైనదిగా పరిగణింపబడుతుంది. స్కావిల్ రేటింగ్ ప్రకారం ప్రపంచంలో అన్నిటికన్నా కారంగా ఉండేడి భారదేశంలోని ఈశాన్య ప్రాంతంలో ముఖ్యంగా లభించే నగ జొలోకియా లేక భూత్ జొలోకియా అనే మిరప. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో సరపన్ అనే విత్తన పరిశోధన సంస్థ ఆరు రకాల తీపి మిరప పండ్లు వంగడాలను పండించింది. ఈ కొత్త రకం తీపి మిరపకాయలు త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతున్నాయి. సరపన్ మధు... సరపన్ హల్ది... సరపన్ కేసర్... సరపన్ బూలాత్... సరపన్ బనానా... ఫ్లవర్ చిల్లీ... ఉన్నాయి. ఈ స్వీట్ మిరపకాయలలో కూడా పలు సైజులలోను... రకరకాల రంగులలోనూ లభ్యమవుతాయి.వీటిని ఇతర పళ్ళ మాదిరిగానే తినవచ్చు.కారం, ఘాటు ఏమాత్రం లేని ఈ మిరపకాయలు తినడం వల్ల ఎటువంటి జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం లేదు.
- ఎండు మిరపకాయలకు బదులు పచ్చి మిరపతోనే పొడిని, నిల్వ ఉండే ముద్దను తయారుచేస్తున్నారు.
రకరకాల మిరపకాయల చిత్రాలు[మార్చు]
Capsicum annuum cultivars
Pepperoncini (C. annuum)
Pepperoncini in kebab restaurant
Cayenne pepper (C. annuum)
Habanero chili (C. chinense Jacquin)- plant with flower and fruit
Scotch bonnet (C. chinense) in a Caribbean market
Scotch bonnet (C. chinense)
Thai peppers (C. Frutescens)
Piri piri (C. frutescens 'African Devil')
Naga Jolokia pepper aka Bhut Jolokia (C. chinense x C. frutescens)
వెలుపలి లింకులు[మార్చు]
