Jump to content

అనాసాగరం

అక్షాంశ రేఖాంశాలు: 16°47′23″N 80°16′33″E / 16.789586°N 80.275876°E / 16.789586; 80.275876
వికీపీడియా నుండి

అనాసాగరం , కృష్ణా జిల్లా, నందిగామ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది నందిగామ నగరపంచాయితీలో కలిపారు.

అనాసాగరం
—  రెవెన్యూయేతర గ్రామం  —
అనాసాగరం is located in Andhra Pradesh
అనాసాగరం
అనాసాగరం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°47′23″N 80°16′33″E / 16.789586°N 80.275876°E / 16.789586; 80.275876
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నందిగామ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521185
ఎస్.టి.డి కోడ్ 08678

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]
  1. ఆర్.సి.ఎం ప్రాథమిక పాఠశాల.
  2. మండల పరిషత్తు ఆదర్శ ప్రాథమిక పాఠశాల.

గ్రంధాలయాలు

[మార్చు]
  1. బొడ్డురాయి సెంటర్‌లోని మినీ గ్రంథాలయం.
  2. ఎస్.సి.కాలనీలోని అంబేద్కర్ సెంటర్‌లోని పఠనమందిరం.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం నందిగామ పట్టణ శివారులో ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ, అంకమ్మ అమ్మవార్ల ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో ఈ ముగురమ్మలూ ఒకే ప్రాంగణంలోని దేవాలయంలో కొలువై ఉన్నారు. ఈ పురాతన ఆలయాన్ని 20 లక్షలరూపాయల భక్తుల విరాళాలతో పునర్నిర్మించారు. మరికొద్ది దూరంలో శ్రీ గంటలమ్మ తల్లి ఆలయం ఉంది. ఉగాది పండుగ నాడు, మహిళలు ఈ అమ్మవారలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వచ్చుచున్నది. గ్రామమంతా పాడిపంటలతో చల్లగా ఉండాలని కోరుతూ, ప్రతి సంవత్సరం ప్రభలతో జాతర నిర్వహించెదరు. ఎంతో ప్రాముఖ్యం గల ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో, గ్రామస్థులు కమిటీగా ఏర్పడి, దేవాలయాలను అపురూపంగా తీర్చిదిద్దినారు. పునర్నిర్మించిన ఈ అలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవం 2017, మార్చి-9వతేదీ గురువారం నుండి ప్రారంభించారు. 9వతేదీ గురువారంనాడు, గణపతిపూజ, గోపూజ నిర్వహించారు. 10వతేదీ శుక్రవారంనాడు మండపారాధన, సామూహిక కుంకుమపూజలు, 11న క్షీరాధివాసం, సూర్య నమస్కారాలు, మూలమంత్ర హోమాలు, జలాధివాసం, జ్యోతిర్లింగార్చనలు నిర్వహించారు. 12న మహా లింగార్చన, దేవతా విగ్రహాల గ్రామోత్సవం, ధాన్యాధివాసాం, శయ్యాధివాసం నిర్వహించారు. 13వతేదీ సోమవారం ఉదయం 8-42 కి యంత్రస్థాపన, బింబస్థాపన, కళాన్యాసం, దేవతా విగ్రహాల ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి నిర్వహించారు. గ్రామ దేవతల విగ్రహాలకు ఎదురుగా పోతరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తొలిసారిగా అమ్మవారలకు ఆవు-దూడ దర్శనం చేయించారు. కుంభం సమర్పించారు. ఈ కార్యక్రమానికై సుదూర ప్రాంతాలనుండి విచ్చేసిన భక్తులు, బంధుమిత్రులతో గ్రామంలో సందడి నెలకొన్నది. ఈ సందర్భంగా భారీ అన్నసమారాధన కార్య్యక్రమం నిర్వహించారు.

ప్రతి సంవత్సరం ఉగాది పండుగనాడు, గ్రామస్థులందరూ కలిసి ఉమ్మడిగా గ్రామదేవతలకు బోనాలు సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. ఈ సందర్భంగా భారీప్రభను రంగురంగుల విద్యుద్దెపాలతో అందంగా అలంకరించెదరు.

శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అనాసాగరం&oldid=4130418" నుండి వెలికితీశారు