పెనుగంచిప్రోలు మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 16°54′06″N 80°14′51″E / 16.9017°N 80.2475°ECoordinates: 16°54′06″N 80°14′51″E / 16.9017°N 80.2475°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ జిల్లా |
మండల కేంద్రం | పెనుగంచిప్రోలు |
విస్తీర్ణం | |
• మొత్తం | 164 కి.మీ2 (63 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 51,811 |
• సాంద్రత | 320/కి.మీ2 (820/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1010 |
పెనుగంచిప్రోలు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మండలం. పెనుగంచిప్రోలు గ్రామం ఈ మండలానికి ముఖ్య పరిపాలనా కేంద్రం. ఈ మండలం జగయ్యపేట శాసనసభ నియజకవర్గం,, విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధికి చెందిన మండలం. ఈ మండల పరిధిలో 16 గ్రామాలు ఉన్నాయి. పెనుగంచిప్రోలు మండల ప్రజా పరషత్ లో 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. పెనుగంచిప్రోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా మర్కపుడి.గాంధీ ఎన్నికయ్యాడు .పెనుగంచిప్రోలు మండలంలో జిల్లా ప్రజా పరషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఉంది.2021 లో పెనుగంచిప్రోలు జెడ్పీటీసీ సభ్యురాలుగా వుట్లు నాగామణి ఎన్నికైంది. ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
జనాభా[మార్చు]
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అనిగండ్లపాడు | 2,028 | 8,238 | 4,121 | 4,117 |
2. | గుమ్మడిదుర్రు | 792 | 3,239 | 1,603 | 1,636 |
3. | కొల్లికుల్ల | 329 | 1,317 | 683 | 634 |
4. | కొనకంచి | 907 | 3,481 | 1,761 | 1,720 |
5. | లింగగూడెం | 423 | 1,831 | 916 | 915 |
6. | ముచ్చింతాల | 540 | 2,426 | 1,224 | 1,202 |
7. | ముండ్లపాడు | 748 | 3,209 | 1,642 | 1,567 |
8. | నవాబ్ పేట | 1,165 | 4,991 | 2,504 | 2,487 |
9. | పెనుగంచిప్రోలు | 3,202 | 13,390 | 6,739 | 6,651 |
10. | శనగపాడు | 917 | 3,630 | 1,823 | 1,807 |
11. | సుబ్బాయిగూడెం | 433 | 1,811 | 888 | 923 |
12. | తోటచెర్ల | 481 | 1,902 | 999 | 903 |
13. | వెంకటాపురం | 255 | 1,230 | 648 | 582 |