Jump to content

అనిగండ్లపాడు

అక్షాంశ రేఖాంశాలు: 16°54′N 80°16′E / 16.900°N 80.267°E / 16.900; 80.267
వికీపీడియా నుండి
అనిగండ్లపాడు
పటం
అనిగండ్లపాడు is located in ఆంధ్రప్రదేశ్
అనిగండ్లపాడు
అనిగండ్లపాడు
అక్షాంశ రేఖాంశాలు: 16°54′N 80°16′E / 16.900°N 80.267°E / 16.900; 80.267
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్
మండలంపెనుగంచిప్రోలు
విస్తీర్ణం20.38 కి.మీ2 (7.87 చ. మై)
జనాభా
 (2011)
8,062
 • జనసాంద్రత400/కి.మీ2 (1,000/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,990
 • స్త్రీలు4,072
 • లింగ నిష్పత్తి1,021
 • నివాసాలు2,292
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్521190
2011 జనగణన కోడ్588861

అనిగండ్లపాడు ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పెనుగంచిప్రోలు నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. అనిగండ్లపాడు 14 వార్డులతో పంచాయితీ హోదా కలిగి ఉంది ఇది పెనుగంచిప్రోలు మండలంలో రెండోవ మెజర్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2292 ఇళ్లతో, 8062 జనాభాతో 2038 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3990, ఆడవారి సంఖ్య 4072. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2070 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1052. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588861. 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం కృష్ణా జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.[2][3]

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం ప్రకారం, ఈ గ్రామం 1930 ప్రాంతంలో నందిగామ తాలూకాలో ఉండేది. అప్పటి జనసంఖ్య 2,657 (1931 జనాభా లెక్కల ప్రకారం).[4]

సమీప గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో తాల్లూరు, గుమ్మడిదుర్రు, శివాపురం, సుబ్బాయిగూడెం, పెనుగంచిప్రోలు, జొన్నలగడ్డ గ్రామాలు ఉన్నాయి.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

అనిగండ్లపాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. జగ్గయ్యపేట నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. దగ్గరి రైల్వేస్టేషన్ మధిర, మోతిమర్రి. ప్రధాన రైల్వేస్టేషన్ విజయవాడ 59 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, శివాపురం అనిగండ్లపాడు, సమీప బాలబడి జగ్గయ్యపేటలో ఉంది. సమీప జూనియర్ కళాశాల పెనుగంచిప్రోలులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు నందిగామలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ నందిగామలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నందిగామలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

అంగనవాడీ కేంద్రం

[మార్చు]

ఈ గ్రామములో నూతనంగా నిర్మించిన 3 అంగనవాడీ కేంద్రాల భవనాలను, 2017, జూన్-4న ప్రారంభించారు.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

[మార్చు]

మునేరు కాలువ.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కుమరి ప్రియాంక, సర్పంచిగా ఎన్నికైనాడు.2021 ఫిబ్రవరిలో జరిగిన గ్రామ పంచాయితి ఎన్నికలలో వై.యాస్.అర్ కాంగ్రస్ పార్టీ మద్దతుదారు జ్యోతి బ్రహ్మం (స్త్రీ) సర్పంచ్ గా ఎన్నికైంది.అనిండ్లపాడు గ్రామ పంచాయితి పరిదిలో 2 MPTC స్థానాలు ఉన్నాయి. 2021 నవంబరులో జరిగిన మండల ప్రజా పరిషత్, ఎన్నికలలో అనిగండ్లపాడు-1 నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోందూరి నిజయలక్ష్మిఎన్నికైంది . అనిగండ్లపాడు -2 నుంచి వై.కా.పా అభ్యర్థి విజయం దోసపాటి. స్వర్ణలత గెలిచింది.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

అనిగండ్లపాడులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

[మార్చు]

శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం

[మార్చు]

అనిగండ్లపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2014, జూన్-12, గురువారం విగ్రహప్రతిష్ఠామహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం 7-30 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ, విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాధాకృష్ణ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనిగండ్లపాడు గ్రామంతోపాటు, పరిసర ప్రాంతాలనుండి, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అనంతరం నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమానికి విశేషస్పందన లభించింది. ఈ ఉత్సవాల సందర్భంగా, దూరప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. [

శ్రీ జగదంబ అమ్మవారి ఆలయం

[మార్చు]

గ్రామములో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017, జూన్-18వతేదీ ఆదివారంనాడు, తొలుత గ్రామోత్సవం నిర్వహించి, అనంతరం, జగదంబ అమ్మవారు, సేవాలాల్ మహారాజ్ విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్మించారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు పాల్గొన్నారు.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 8 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

అనిగండ్లపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 210 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 78 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 70 హెక్టార్లు
  • బంజరు భూమి: 24 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1656 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 782 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 968 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఎనిగండ్లపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 332 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 633 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 3 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

అనిగండ్లపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, ప్రత్తి, మిరప, అపరాలు, కాయగూరలు

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

బియ్యం

ప్రధాన వృత్తులు

[మార్చు]

ప్రజల ప్రధాన జీవనాధారము వ్యవసాయం.

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ చెరుకుమల్లి శ్రీనివాసరావు [8]

గ్రామ విశేషాలు

[మార్చు]

ఆధ్యాత్మిక విశేషాలు

[మార్చు]

పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి చిన్న తిరునాళ్ళలో ప్రధాన ఘట్టం, పుట్టింటి పసుపు, కుంకుమ బండ్ల ఉత్సవం, ఈ గ్రామంలో వైభవంగా జరుపుతారు. అమ్మవారి పుట్టింటి వంశస్తులైన శ్రీ కొల్లా శ్రీనివాసరావు ఇంటినుండి ప్రత్యేకంగా అలంకరించిన బండిపై పసుపు, కుంకుమలను ఊరేగింపుగా పెనుగంచిప్రోలులోని అమ్మవారి ఆలయానికి తీసుకొని వచ్చి సమర్పించటం, ఆనవాయితీ. మొదట శ్రీ కొల్లా శ్రీనివాసరావు నివాసంలో వేదపండితులు, ఆలయార్చకుల ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిమలు, పసుపు, కుంకుమలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని బండిపై ఉంచెదరు. పసుపు, కుంకుమల బండి బయలుదేరగానే, గ్రామస్థులు బండికి ఎదురేగి, భక్తి శ్రద్ధలతో నీరు వారపోసి, టెంకాయలు కొడతారు. ఆ బండి వెనుక, పలువురు గ్రామస్థులు కట్టిన బండ్లు పెనుగంచిప్రోలు వెళ్ళును. పెనుగంచిప్రోలులో వేంచేసియున్న శ్రీ తిరుపతమ్మ, గోపయ్యస్వామి వార్లను గ్రామాలకు తీసుకొని వెళ్ళి, అక్కడ గూడా శాంతి కళ్యాణాలను నిర్వహించాలని దేవస్థానం వారు తీర్మానించారు. 2014 లో, శ్రావణమాసం నుండి మొదలయ్యే ఈ కార్యక్రమలను మొదటిసారిగా, అమ్మవారికి పుట్టింటి పసుపు, కుంకుమలు పంపే గ్రామమయిన అనిగండ్లపాడులో జరుపవలెనని తీర్మానించారు. శ్రీ తిరుపతమ్మ శాంతి కళ్యాణం, ఈ గ్రామంలో 2014, ఆగష్టు-6, గురువారం నాడు నిర్వహించెదరు. అనంతరం ఊరేగింపు నిర్వహించెదరు. [4], [6]&[7]

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8238. ఇందులో పురుషుల సంఖ్య 4121, స్త్రీల సంఖ్య 4117, గ్రామంలో నివాసగృహాలు 2028 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2038 హెక్టారులు. ప్రాంతీయభాష: తెలుగు

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము, ద్వితీయ సంపుటం, పేజీ 69.[permanent dead link]

వెలుపలి లింకులు

[మార్చు]