జాతర
Appearance
ఈ వ్యాసం ఒక భారతీయ సాంప్రదాయము గురించి. అదే పేరుగల సినిమా కొరకు, జాతర (సినిమా) చూడండి.
హిందూ సంప్రదాయములో దేవతలను, దేవుళ్లను, పుణ్య స్త్రీలను, మహిమగల స్త్రీ, పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది. ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిష్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటారు. జాతరని యాత్ర అని కూడా అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉన్న మన భారతదేశములో లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి.
కొన్ని ముఖ్యమైన జాతరలు
[మార్చు]ఇది 12 ఏళ్లకు ఒక్క సారి వస్తుంది.ఈ జాతరను 3 నెలలు నిర్వహిస్తారు.
- శంబర పోలమాంబ జాతర
- మేడారం సమ్మక్క సారక్క జాతర
- తిరుపతి గంగమ్మ జాతరలో పురుషులు స్త్రీల వేషాలు వేసుకుంటారు.
- పైడితల్లి జాతర: విజయనగరం రాజు విజయ రామరాజుకు పైడితల్లి సోదరి. బొబ్బిలి యుద్ధం సమయంలో తాండ్ర పాపారాయునితో తలపడేందుకు వెళుతున్న అన్నను పైడితల్లి వద్దని వారించిందట. అయినా సమర భూమికేగి పాపారాయుని చేతిలో హతుడయ్యాడు. ఆ దుఃఖంతో పైడితల్లి పెద్ద చెరువులో దూకి 1757లో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి విజయ దశమి ముగిసిన తొలి మంగళవారం రోజున పైడితల్లి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో సిరిమాను ఎక్కడ ఉందో పైడితల్లి అమ్మవారే స్వయంగా పూజారి కలలో కనబడి చెపుతుందట. ఆమె ఆజ్ఞానుసారంగా ఆ మానును వెతికి తెస్తారు. ఈ మానును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు.
- లింగమంతుల స్వామి జాతర: పెద్దగట్టు జాతర అనికూడా అంటారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో దురాజ్‌పల్లిలో ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 10 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లింగమంతుల జాతర దిష్టిపూజ కార్యక్రమంతో ప్రారంభమౌతుంది. హైదరాబాదు-విజయవాడ బస్సులను జాతర అయిదు రోజులూ నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా మళ్లిస్తారు.
- నాగోబా జాతర: అదిలాబాద్ జిల్లాలో జరిగే గోండుల జాతర.
- శ్రీకాళహస్తిలో జరిగే ఏడుగంగల జాతర
- శ్రీ శ్రీ శ్రీ సునామ జకిని మాతా, శ్రీ శ్రీ శ్రీ మల్కుమా జకిని మాతా జాతర : అనంతపురం జిల్లాలో జరిగే ఆరెెెెకటికుల జాతర. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఆరెకటిక
- జీవాలను బలిస్తామని మొక్కుకున్నవారి నుంచి ఆ జీవాలను అందుకున్న పోతురాజు మేక మెడను వెనక్కి విరిచి తన నోటితో ఆ మెడను పట్టి అమాంతంగా కొరికేస్తాడు. గింజుకుంటున్న ఆ మేకను గాలిలోకి విసిరి నేలకేసి కొట్టి అత్యంత దారుణంగా కొట్టి చంపేస్తాడు.కొన్ని జాతరల్లో కాళ్ళతో చచ్చే వరకు మూగజీవాన్ని తొక్కి చంపడం ఒక భాగం. ఒక్కో కులం నుంచి ఒక ప్రతినిధి ముందుకు వచ్చి జాతర ప్రారంభ దినాన ఇలా మేకనో, గొర్రెనో తొక్కి చంపేస్తాడు. అనంతరం దాన్ని వండుకొని తింటారు. అలాగే కొన్ని గ్రామాల్లో ఎత్తైన శిడిమానుకు మూగజీవాలను కట్టడం ఒక ఆచారంగా ఉంది. ఈ జీవానికి పొడవాటి చువ్వలు గుచ్చి సిడిమానుకు వేలాడదీస్తారు. మరుసటి రోజు కిందకు దింపాక అదృష్టం బావుండి అవి బతికితే ఇక వాటి జోలికి వెళ్ళరు.
ఎన్నెన్నో నమ్మకాలు
[మార్చు]- శిడిమానుకు వేలాడదీసిన మూగజీవి మరుసటి రోజు కిందకు దింపాక అదృష్టం బావుండి బతికితే ఇక దాని జోలికి వెళ్ళరు. అది మేసిన చేలల్లో సిరులు పండుతాయని ఒక నమ్మకం.
- బియ్యం కొలత వేసి గ్రామదేవత గుడిలో పెడితే మరుసటి రోజు అవి పెరుగుతాయని కొన్ని గ్రామాల్లో విశ్వసిస్తారు.
- బంగారంతో చేసిన ఏదో ఒక వస్తువును ఆ గ్రామంలోని పుట్టలో వేసి మరుసటి రోజు తవ్వి తీస్తారు. తిరిగి దొరికిన ఆ ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించి పూజలు జరుపుతారు.
- ప్రభుత్వం జోగినీ వ్యవస్థను నిషేధించినా జాతరల్లో మాతంగి నాట్యమాడాల్సిందే. మాతంగి లేకుండా ఏ జాతరా ప్రారంభం కాదు.
- ఒక్క వేటుతో దున్నపోతును తెగనరికి ఆ రక్తంతో కలిపిన అన్నాన్ని గ్రామ పొలిమేరల్లో విసరడం పలు గ్రామాల్లో కనిపించే సాధారణ దృశ్యం. ఈ సమయంలో పొరుగూరు వాసులు ఎవరూ ఈ గ్రామంలో అడుగుపెట్టకుండా కర్రలు, బరిసెలతో కాపలాకాస్తుంటారు.
- గ్రామాధిపత్యం కోసం పోట్లాడుకునే వర్గాలకు ఈ జాతరలు కలిసొస్తుంటాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- మన జాతరలు-విధానాలు పుస్తకం : వంగరి లక్ష్మీభూమయ్య - హన్మకొండ.
- వార్త దినపత్రిక ఆధ్యాత్మికం-పేజి : శ్రీకాకుళం మొగ్గ ఎడిషన .